...
...
Next Story

Lucky Zodiac Signs: మారిపోనున్న ఈ 5 రాశుల జాతకం- అపారమైన ధన లాభం, ఊహించని విజయాలు- 13 ఏళ్లకు అరుదైన యోగం!

Shani Jayanti 2026 Lucky Zodiac Signs: 2026లో శని జయంతి అత్యంత శక్తివంతమైన 'శనిశ్చరి అమావాస్య' వేళ రాబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం, అమావాస్య కలిసి రావడం అరుదైన ఘట్టం. ఈ ప్రభావంతో ఐదు రాశుల వారి జాతకాలు ఒక్కసారిగా మారిపోయి, అదృష్టం పట్టనుంది. మరి ఆ 5 రాశులు ఏంటో తెలుసుకుందాం.

Published on: Apr 11, 2026, 13:35:07 IST
Advertisement
<p>హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శని దేవుడిని న్యాయాధికారిగా భావిస్తారు. మనం చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇచ్చే శని దేవుడు జన్మించిన రోజే శని జయంతి. 2026 మే 16న ఈ పండుగను జరుపుకోనున్నాం. అయితే ఈ ఏడాది ఒక ప్రత్యేకత ఉంది. <br> </p>

హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శని దేవుడిని న్యాయాధికారిగా భావిస్తారు. మనం చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇచ్చే శని దేవుడు జన్మించిన రోజే శని జయంతి. 2026 మే 16న ఈ పండుగను జరుపుకోనున్నాం. అయితే ఈ ఏడాది ఒక ప్రత్యేకత ఉంది.

శని జయంతి శనివారం నాడు రావడం, అదే రోజున అమావాస్య తిథి కూడా ఉండటంతో దీనిని 'శనిశ్చరి అమావాస్య'గా పిలుస్తారు. 13 ఏళ్ల తర్వాత వస్తున్న ఇటువంటి శుభ సంయోగం కొన్ని రాశుల వారికి అపారమైన ధన లాభాన్ని, కెరీర్‌లో ఊహించని విజయాలను అందించనుంది.

వృషభం: ఈ వృషభ రాశి వారికి ఈ శని జయంతి కొత్త ఆశలను మోసుకొస్తుంది. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఆఫీసులో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ఎప్పటి నుంచో పూర్తి చేయాలనుకుంటున్న పనులు ఈ సమయంలో ఒక కొలిక్కి వస్తాయి. శని దేవుడి అనుగ్రహంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

మిథున రాశి: మిథున రాశి వారికి ఈ సమయం ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఒకటికి మించిన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారస్తులు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతాల పెంపు కోసం చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

తులా రాశి: ఈ రాశి జాతకులకు శని జయంతి తర్వాత అంతా శుభమే జరుగుతుంది. మీపై కుట్రలు చేసే ప్రత్యర్థులు లేదా శత్రువుల పప్పులు ఇక ఉడకవు. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా తల్లి వైపు బంధువుల నుంచి ఆస్తి లాభం లేదా ఆర్థిక సహాయం అందే సూచనలు ఉన్నాయి.

ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారికి శని దేవుడి విశేష ఆశీస్సులు లభించనున్నాయి. మీరు ఎప్పటి నుంచో కలలు కంటున్న కొత్త ఉద్యోగం లేదా విదేశీ ప్రయాణాలకు మార్గం సుగమం అవుతుంది. మీ సామర్థ్యాన్ని మీరు గుర్తించి లక్ష్యాల దిశగా అడుగులు వేస్తారు. ఆరోగ్యం విషయంలో కూడా సానుకూల మార్పులు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది.

కుంభ రాశి: కుంభ రాశికి శని దేవుడే అధిపతి కావడం వల్ల ఈ శని జయంతి వీరికి అత్యంత కీలకం. మే నెల తర్వాత మీ జీవితంలో సానుకూల మార్పులు మొదలవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మీ సామాజిక హోదా పెరగడంతో పాటు పాత బాకీలు వసూలవుతాయి. శని దేవుడి అనుగ్రహం వల్ల తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe