
స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ మరోసారి హాట్ షోతో రెచ్చిపోయింది. తన గ్లామర్ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో ఇవాళ (అక్టోబర్ 3) పోస్టు చేసింది.
శ్రుతి హాసన్ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదే సమయంలో తన యాక్టింగ్ కెరీర్ గురించి ఆమె చేసిన కామెంట్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి.
కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘హే రామ్’ సినిమాలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ కూతురు క్యారెక్టర్లో శ్రుతి హాసన్ నటించింది.
అయితే ఆ పాత్రలో నటించాలని నాన్న కమల్ హాసన్ రిక్వెస్ట్ చేశారని శ్రుతి హాసన్ చెప్పింది. ఆ తర్వాత 2009లో వచ్చిన లక్ సినిమా తర్వాత ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాలని శ్రుతి అనుకుందంటా.
కానీ లక్ సినిమాలో ఆమె యాక్టింగ్ శ్రుతి హాసన్ కే నచ్చలేదంటా. అందుకే తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి సినిమాల్లో కంటిన్యూ అయ్యానని శ్రుతి హాసన్ వెల్లడించింది.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}