...
...
Next Story

Smartphone : ఎండాకాలంలో మీ స్మార్ట్​ఫోన్ ఓవర్​హీట్ అవుతోందా? ఇలా చేయకపోతే నష్టమే..

భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ తీవ్రమైన వేడి కేవలం మనుషులకే కాదు, మన చేతుల్లో ఉండే స్మార్ట్‌ఫోన్లకు కూడా పెద్ద శాపంగా మారింది. చాలా ఫోన్స్ ఓవర్​హీట్ అయిపోయి, బ్యాటరీలు పాడైపోతుంటాయి. ఈ నేపథ్యంలో, ఎండకాలంలో మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ పాడవకుండా కాపాడుకునేందుకు కొన్ని సులువైన టిప్స్ ఇక్కడ చూడండి..

Published on: May 30, 2026, 11:18:53 IST
Advertisement
<p>మీ ఫోన్‌ను నేరుగా సూర్యరశ్మి తగిలేలా లేదా 35°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో ఉంచవద్దు. దీనివల్ల ఛార్జింగ్ స్పీడ్ తగ్గడమే కాకుండా, బ్యాటరీ శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒకవేళ మీ ఫోన్ విపరీతంగా వేడెక్కితే, అది రూమ్ టెంపరేచర్‌కు వచ్చే వరకు పక్కన పెట్టి సహజంగా చల్లబడనివ్వండి. ఆ తర్వాతే ఛార్జింగ్ పెట్టండి. ఛార్జింగ్ పెట్టే సమయంలో ఫోన్ వెనుక ఉండే ప్రొటెక్టివ్ కవర్లను తొలగించడం మంచిది. లేకపోతే కవర్ల వల్ల లోపలి వేడి బయటకు పోలేక బ్యాటరీ లైఫ్‌ను తగ్గిస్తుంది. ఎల్లప్పుడూ మీ మొబైల్ బ్రాండ్‌కు చెందిన ఒరిజినల్ ఛార్జర్​ని మాత్రమే ఉపయోగించండి.</p>

మీ ఫోన్‌ను నేరుగా సూర్యరశ్మి తగిలేలా లేదా 35°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో ఉంచవద్దు. దీనివల్ల ఛార్జింగ్ స్పీడ్ తగ్గడమే కాకుండా, బ్యాటరీ శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒకవేళ మీ ఫోన్ విపరీతంగా వేడెక్కితే, అది రూమ్ టెంపరేచర్‌కు వచ్చే వరకు పక్కన పెట్టి సహజంగా చల్లబడనివ్వండి. ఆ తర్వాతే ఛార్జింగ్ పెట్టండి. ఛార్జింగ్ పెట్టే సమయంలో ఫోన్ వెనుక ఉండే ప్రొటెక్టివ్ కవర్లను తొలగించడం మంచిది. లేకపోతే కవర్ల వల్ల లోపలి వేడి బయటకు పోలేక బ్యాటరీ లైఫ్‌ను తగ్గిస్తుంది. ఎల్లప్పుడూ మీ మొబైల్ బ్రాండ్‌కు చెందిన ఒరిజినల్ ఛార్జర్​ని మాత్రమే ఉపయోగించండి.

మీరు వాడని హెవీ గేమింగ్ యాప్స్ లేదా కెమెరా యాప్‌లను బ్యాక్‌గ్రౌండ్ నుంచి పూర్తిగా క్లోజ్ చేయండి. ఇవి బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఫోన్ హీట్ అవ్వడానికి కారణమవుతాయి. ఎండలోకి వెళ్లినప్పుడు స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను పూర్తిగా పెంచడం తగ్గించండి. అలాగే అడాప్టివ్ బ్రైట్‌నెస్ ఆఫ్ చేయడం వల్ల డిస్‌ప్లే జనరేట్ చేసే వేడి తగ్గుతుంది. మీ ఫోన్‌లో ఓఎల్ఈడీ లేదా అమోలెడ్ డిస్‌ప్లే ఉంటే ఖచ్చితంగా 'డార్క్ మోడ్' ఆన్ చేసుకోండి. డార్క్ పిక్సెల్స్ తక్కువ పవర్ తీసుకుని తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తాయి.

ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఫోన్‌లో 'బ్యాటరీ సేవర్ మోడ్ ఆన్ చేయడం ద్వారా బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీలను పరిమితం చేసి ఫోన్‌పై భారాన్ని తగ్గించవచ్చు.

ఎక్కువ బ్యాటరీని గుంజేసే యాప్‌ల బ్యాక్‌గ్రౌండ్ రన్నింగ్‌ను నిలిపివేయండి. ఆండ్రాయిడ్​లో: Settings > Apps > App management > యాప్‌ను సెలెక్ట్ చేయండి > Battery usage > "Allow background activity" ని ఆఫ్ (Toggle off) చేయండి. ఐఫోన్​లో: Settings > Background App Refresh లోకి వెళ్లి దానిని పూర్తిగా 'Off' చేయండి లేదా వైఫైకి మాత్రమే పరిమితం చేయండి.

ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ వేసవి కాలంలో మీ స్మార్ట్‌ఫోన్ హీట్ అవ్వకుండా కాపాడుకోవడమే కాకుండా, బ్యాటరీ లైఫ్‌ను సుదీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe