...
...
Next Story

Ind Vs Pak: మంధాన మెరుపులు.. రిచా ఉరుములు.. పాకిస్థాన్ బౌలింగ్ ను చిత్తు చేసిన భారత్.. స్కోరు ఎంతంటే?

Ind Vs Pak: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో మ్యాచ్ లో ఇండియా బ్యాటింగ్ లో అదరగొట్టింది. టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం (జూన్ 14) జరుగుతున్న పోరులో స్మృతి మంధాన‌, రిచా ఘోష్ చెలరేగారు. దీంతో పాక్ కు ఇండియా టఫ్ టార్గెట్ సెట్ చేసింది.

Published on: Jun 14, 2026, 21:05:17 IST
Advertisement
<p>టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ లో ఇండియా చెలరేగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 రన్స్ చేసింది. </p>

టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ లో ఇండియా చెలరేగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 రన్స్ చేసింది.

ఇండియన్ స్టార్ ఓపెనర్ మంధాన బ్యాటింగ్ లో సత్తాచాటింది. 44 బాల్స్ లోనే 68 రన్స్ చేసింది. ఇందులో 9 ఫోర్లు, 2 సిక్సర్లున్నాయి.

క్రీజులో సెట్ అయిన మంధానను రమీన్ షమీమ్ ఔట్ చేసింది. దీంతో ఇండియా జోరుకు కాస్త బ్రేక్ పడింది.

మరో ఎండ్ లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా రాణించింది. ఆమె 35 బంతుల్లో 36 పరుగులు చేసింది.

చివర్లో పవర్ హిట్టర్ రిచా ఘోష్ విధ్వంసకర బ్యాటింగ్ తో రెచ్చిపోయింది. ఆమె 17 బంతుల్లోనే 34 రన్స్ కొట్టింది. 5 ఫోర్లు, ఓ సిక్సర్ బాది టీమ్ స్కోరు 170కి చేరడంలో కీలక పాత్ర పోషించింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe