
హాట్ యాంకర్ శ్రీముఖి ఇటీవల సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష కారణంగా ఈ భామ పేరు మార్మోగుతోంది.
తన లేటెస్ట్ ట్రెండింగ్ డ్రెస్ ఫొటోలను శ్రీముఖి ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఇవాళ (ఆగస్టు 22) ఈ యాంకరమ్మ షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక శ్రీముఖిపై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష హోస్ట్ గా చేస్తున్న ఆమె బిహేవియర్ సరిగ్గా లేదని అంటున్నారు.
ముఖ్యంగా రన్నింగ్ రాజా అనే వ్యక్తి అడిషన్ కోసం వచ్చినప్పుడు శ్రీముఖి వాడిన భాషపై అభ్యంతరాలు వస్తున్నాయి. చెంప పగలగొడతానంటూ శ్రీముఖి చెప్పడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
శ్రీముఖి ఎందుకు పనికి రాదని, అగ్నిపరీక్ష సీజన్ 2లో ఆమె చాలా ఓవర్ చేస్తుందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}