
టాటా కార్లు అంటేనే భద్రతకు మారుపేరు. ఇప్పటికే గ్లోబల్ ఎన్సీఏపీ, భారత్ ఎన్సీఏపీలో 5-స్టార్ రేటింగ్ సాధించిన ట్రాక్ రికార్డ్ టాటా సొంతం. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కూడా అదే స్థాయి ప్రమాణాలతో రూపొందింది.
స్మార్ట్ (బేస్ వేరియంట్): ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్-హోల్డ్ అసిస్ట్, హై-బీమ్ అసిస్ట్, టీపీఎంఎస్ (టైర్ ప్రెజర్ మానిటరింగ్), ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), ఏబీఎస్‌తో కూడిన ఈబీడీ వంటి కీలక ఫీచర్లు ఉన్నాయి.
స్మార్ట్+ : ఇందులో అదనంగా డే/నైట్ ఐఆర్వీఎం, రియర్ వ్యూ కెమెరా లభిస్తాయి. అయితే, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో-హోల్డ్ వంటివి కేవలం 40 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి
అడ్వెంచర్ : పైన రెండు వేరియంట్లలోని ఫీచర్లతో పాటు ఇందులో అదనంగా 'హిల్ డిసెంట్ కంట్రోల్' ఫీచర్‌ను చేర్చారు.
ఎంపవర్డ్: వర్షం పడితే ఆటోమేటిక్‌గా పనిచేసే వైపర్లు, రియర్ వైపర్, డిఫాగర్, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో అదనంగా ఉన్నాయి.
ఎంపవర్డ్+ ఎస్: ఇందులో పైన పేర్కొన్న అన్నిటితో పాటు అదనంగా 'ఆటో-డిమ్మింగ్ ఐఆర్వీఎం' ఫీచర్ లభిస్తుంది. అదిరిపోయే సేఫ్టీ ఫీచర్లతో వచ్చిన ఈ కారు ధర రూ. 9.69 లక్షల నుంచి రూ. 12.59 లక్షల వరకు ఉంది. బీఏఏఎస్ స్కీమ్ కింద కేవలం రూ. 6.49 లక్షలకే ఈ కారును సొంతం చేసుకోవచ్చు.