...
...
Next Story

TG Inter SSC Exams 2026 : తెలంగాణ ఇంటర్, టెన్త్ పరీక్షలు - విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్

నేటి నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు మార్చి 14 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ కూడా షురూ అవుతాయి. అయితే ఈసారి విద్యార్థులకు 5 నిమిషాలు ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతి ఇవ్వనున్నారు.ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

Published on: Feb 25, 2026, 07:23:22 IST
Advertisement
<p>నేటి నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు మార్చి 14 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ కూడా షురూ అవుతాయి. అయితే ఈసారి విద్యార్థులకు 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వనున్నారు.ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.</p>

నేటి నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు మార్చి 14 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ కూడా షురూ అవుతాయి. అయితే ఈసారి విద్యార్థులకు 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వనున్నారు.ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

ఇంటర్, మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) రామకృష్ణారావు మంగళవారం కలెక్టర్లతో వీడియా కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ ఎలాంటి అవకతవకలు జరగకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ టైమ్ ఇవ్వాలని తెలిపారు.

ఈసారి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 4.89 లక్షలకు పైగా, రెండవ సంవత్సరం విద్యార్థులు 4.53 లక్షల మందికిపైగా పరీక్షలు రాయనున్నారు. SSC విద్యార్థులు 5.28 లక్షల మంది హాజరుకానున్నారు. అయితే అన్ని కేంద్రాలలో CCTV, పోలీసు బందోబస్తు, ANMలు, ప్రథమ చికిత్స, బెంచీలు మరియు క్లాక్ రూములు ఉంటాయని సీఎస్ వెల్లడించారు.

టెన్త్ ఎగ్జామ్స్ పరీక్షా పత్రాలపై QR కోడ్‌లు ఉంటాయి. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందు తెరవబడతాయి. హాల్ టిక్కెట్లు విద్యార్థులకు నేరుగా వాట్సాప్ ద్వారా పంపబడతాయని… వెబ్‌సైట్ నుండి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సీఎస్ వెల్లడించారు.

ఇంటర్ పరీక్షలకు 1,495 సెంటర్లను ఏర్పాటు చేశారు.అన్నిచోట్లా సీసీ కెమెరాలు సెట్ చేశారు. అలాగే మాస్ కాపీయింగ్ జరిగే ఛాన్స్ లేకుండా.. ఈసారి కూడా జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe