...
...
Next Story

TG DOST Registrations 2026 : తెలంగాణ దోస్త్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు - నేటితో ముగియనున్న గడువు

TG DOST Phase 2 Registration Updates : తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ‘దోస్త్’ (TG DOST) రెండో విడత రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. అయితే ఈ గడువు నేటితో (మే 25) ముగియనుంది. అభ్యర్థులు వెంటనే రిజిస్ట్రేషన్ తో పాటు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Published on: May 25, 2026, 10:02:22 IST
Advertisement
<p>తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ (UG) కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు కీలక అప్డేట్. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (TG DOST) 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నేటి(మే 25)తో ముగియనుంది.</p><p> </p>

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ (UG) కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు కీలక అప్డేట్. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (TG DOST) 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నేటి(మే 25)తో ముగియనుంది.

మొదటి విడతలో సీటు రాని విద్యార్థులు, సీటు వచ్చినా నచ్చని వారు, అలాగే ఇప్పటివరకు అసలు దరఖాస్తు చేసుకోని కొత్త అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం మిగిలి ఉంది. కాబట్టి ఇవాళ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు… వెంటనే ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా, నచ్చిన కాలేజీలు, కోర్సులను ఎంచుకునేందుకు వెబ్ ఆప్షన్లను కూడా త్వరితగతిన నమోదు చేయాలని స్పష్టం చేస్తున్నారు.

దోస్త్ రెండో విడత కౌన్సెలింగ్‌లో మొదటిసారిగా పాల్గొనే కొత్త అభ్యర్థులు రూ. 400 రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే మొదటి ఫేజ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కాగా, కాలేజీలను ఎంచుకునేందుకు (వెబ్ ఆప్షన్లు) మే 26 వరకు తుది అవకాశం కల్పించారు.

మొదటగా టీజీ దోస్త్ అధికారిక వెబ్‌సైట్ https://dost.cgg.gov.in/ ను సందర్శించాలి.

హోం పేజీలో అందుబాటులో ఉన్న "Candidate Pre-Registration" లింక్‌పై క్లిక్ చేయండి.

ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది, అక్కడ అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసి దోస్త్ ఐడీ (DOST ID) జెనరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు పేమెంట్ లింక్ ద్వారా రూ. 400 రుసుము చెల్లించాలి. లాగిన్ ఐడీ, పిన్ నంబర్ ఉపయోగించి అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తిగా పూరించాలి.. అనంతరం వెబ్ ఆప్షన్ల ద్వారా మీకు నచ్చిన కాలేజీలను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాలి.

దోస్త్ రెండో విడతలో విజయవంతంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని, వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న అభ్యర్థులకు మే 30న సీట్లను కేటాయిస్తారు. సీటు పొందిన విద్యార్థులు మే 31 నుంచి జూన్ 5 వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ (Online Self-Reporting) చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో నిర్ణీత గడువు లోపు రిపోర్ట్ చేయని పక్షంలో వారికి దక్కిన సీటు స్వయంచాలకంగా రద్దవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe