...
...
Next Story

TG EdCET 2026 Results : తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల - ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

TG EdCET 2026 Results : తెలంగాణ ఎడ్‌సెట్ - 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది పరీక్ష రాసిన అభ్యర్థుల్లో రికార్డు స్థాయిలో 96.95 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. edcet.tgche.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి ర్యాంక్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Published on: May 30, 2026, 15:00:18 IST
Advertisement
<p>తెలంగాణ ఎడ్‌సెట్ - 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది పరీక్ష రాసిన అభ్యర్థుల్లో రికార్డు స్థాయిలో 96.95 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. </p>

తెలంగాణ ఎడ్‌సెట్ - 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది పరీక్ష రాసిన అభ్యర్థుల్లో రికార్డు స్థాయిలో 96.95 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో మొత్తం 28,771 మంది అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో 27,887 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు.

ఓవరాల్‌గా 96.95 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షలో క్వాలిఫై అయ్యారు.

ఈ ఫలితాలలో మెథడాలజీల వారీగా చూసుకుంటే గణితం, సైన్స్, సోషల్ స్టడీస్, లాంగ్వేజెస్ విభాగాల్లో అభ్యర్థులు మంచి ప్రతిభ కనబరిచారు.

ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలకు బీఈడీ తప్పనిసరి కావడంతో… ఈసారి పోటీతో పాటు ఉత్తీర్ణత శాతం కూడా గణనీయంగా పెరగడం గమనార్హం.

మొదటగా అధికారిక కన్వీనర్ వెబ్‌సైట్‌ https://edcet.tgche.ac.in/ ను సందర్శించాలి.

హోంపేజీలో కనిపించే 'Download Rank Card' లింక్‌పై క్లిక్ చేయాలి.

మీ ఎడ్‌సెట్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.

స్క్రీన్‌పై కనిపించే మీ ర్యాంక్ కార్డును ప్రింట్ తీసుకుని, భవిష్యత్తు కౌన్సెలింగ్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.

టీజీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ బీఈడీ కళాశాలల్లో సీట్ల భర్తీకి సంబంధించిన వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియను అధికారులు త్వరలోనే ప్రారంభించనున్నారు.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల నమోదుకు సంబంధించిన సమగ్ర షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి అధికారికంగా ప్రకటించనుంది. అభ్యర్థులు కౌన్సెలింగ్ సమయానికి తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe