...
...
Next Story

Paradise Nani : థియేటర్లలో ‘జడల్ జమానా’- ఈ ఓటీటీల్లో ది ప్యారడైజ్ స్టార్ నాని టాప్ 5 సినిమాలు..

ఈ ఏడాది మచ్ అవైటెడ్ టాలీవుడ్ సినిమాల్లో ఒకటైన ది ప్యారడైజ్ సినిమా థియేటర్ల విడుదలైంది. ఇప్పుడు ఎక్కడ చూసినా నాని మేనియా నడుస్తోంది. ఈ నేపథ్యంలో కలెక్షన్ల పరంగా ఇప్పటివరకు నాని టాప్-5 సినిమాలు, వాటి ఓటీటీ వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Sep 24, 2026, 11:20:50 IST
Advertisement
<p>శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటించిన సినిమా ది ప్యారడైజ్​కు హైప్ మామూలుగా లేదు. రిలీజ్​కి ముందే తెలుగు రాష్ట్ర సినీ అభిమానులను ఈ సినిమా ఊపేసింది. అనిరుధ్​ మ్యూజిక్ తోడవ్వడంతో బొమ్మ బ్లాక్​బాస్టర్​ అని అందరు అంచనా వేసేశారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఓవైపు థియేటర్లలో సందడి చేస్తోంది. మరి మీరు నాని టాప్-5 (కలెక్షన్ల పరంగా) సినిమాలు రీ-వాచ్ చేయాలనుకుంటే.. ఇది మీకోసమే</p>

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటించిన సినిమా ది ప్యారడైజ్​కు హైప్ మామూలుగా లేదు. రిలీజ్​కి ముందే తెలుగు రాష్ట్ర సినీ అభిమానులను ఈ సినిమా ఊపేసింది. అనిరుధ్​ మ్యూజిక్ తోడవ్వడంతో బొమ్మ బ్లాక్​బాస్టర్​ అని అందరు అంచనా వేసేశారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఓవైపు థియేటర్లలో సందడి చేస్తోంది. మరి మీరు నాని టాప్-5 (కలెక్షన్ల పరంగా) సినిమాలు రీ-వాచ్ చేయాలనుకుంటే.. ఇది మీకోసమే

2025 మేలో విడుదలైన హిట్​-3 సినిమా.. ఇప్పటివరకు నాని కెరీర్​లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీ వరల్డ్​ వైడ్​ కలెక్షన్లు రూ. 120.4 కోట్లు. హిట్​-3 నెట్​ఫ్లిక్స్​లో అందుబాటులో ఉంది.

కీర్తి సురేశ్, నాని నటించిన దసరా సినిమా 2023లో విడుదలైంది. ఈ సినిమాని కూడా శ్రీకాంత్ ఓదెలానే తీశాడు. ఇది నాని కెరీర్​లో రెండో అతిపెద్ద కలెక్షన్లు రాబట్టిన చిత్రం. దీనికి వరల్డ్ వైడ్ 118.6 కోట్లు వచ్చాయి. ఇది నెట్​ఫ్లిక్స్​లో ఉంది.

2024లో సరిపోదా శనివారం సినిమా విడుదలైంది. ఈ సినిమా డైరక్టర్ వివేక్ ఆత్రేయ. ఇది నాని కెరీర్​లో 3వ బిగ్గెస్ట్ హిట్. దీనికి ప్రపంచవ్యాప్తంగా 101.4 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా కూడా నెట్​ఫ్లిక్స్​లో చూడవచ్చు.

ఎస్​ఎస్​ రాజమౌళీ దర్శకత్వంలో నాని నటించిన సినిమా ఈగ. 2012లో విడుదలైంది. అప్పట్లో ఇదొక సంచలనం! ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 100.3 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లేదా ఆహాలో చూడవచ్చు.

నాని, మృణాల్​ ఠాకూర్ నటించిన హాయ్ నాన్న 2023లో విడుదలైంది. ఫ్యామిలీ ఆడియన్స్​కి విపరీతంగా నచ్చేసింది ఈ సినిమా. ఫలితంగా వరల్డ్​ వైడ్ రూ. 76.8 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ మూవీని నెట్​ఫ్లిక్స్​లో చూడవచ్చు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks