...
...
Next Story

LPG Cylinder Booking : ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవు - ఇదిగో క్లారిటీ

LPG Cylinder Booking Rules :ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్రం కీలక అలర్ట్ ఇచ్చింది. బుకింగ్స్ లో కొత్త రూల్స్ వచ్చాయంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చింది. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది.

Published on: Mar 25, 2026 12:00 PM IST
Advertisement
<p>LPG గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్రం కీలక అలర్ట్ ఇచ్చింది. బుకింగ్స్ లో కొత్త రూల్స్ వచ్చాయంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చింది. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది.</p>

LPG గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్రం కీలక అలర్ట్ ఇచ్చింది. బుకింగ్స్ లో కొత్త రూల్స్ వచ్చాయంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చింది. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది.

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో మరియు కొన్ని వార్తా కథనాలలో గ్యాస్ సిలిండర్ (LPG) బుకింగ్ సమయ పరిమితులపై వస్తున్న వార్తలు అవాస్తమని కేంద్రం స్పష్టం చేసింది. ప్రభుత్వం అటువంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని పేర్కొంది.

భారత ప్రభుత్వ పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ గానీ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (IOCL, BPCL, HPCL) గానీ రీఫిల్ బుకింగ్‌పై ఇలాంటి కొత్త పరిమితులను విధించలేదని కేంద్ర పెట్రోలియం శాఖ వివరణ ఇచ్చింది.

పాత నిబంధనలే అమల్లో ఉన్నాయిని కేంద్రం స్పష్టం చేసింది. పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల కనీస గడువు యథాతథంగా కొనసాగుతుందని పేర్కొంది.

అనధికారిక వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని కేంద్ర పెట్రోలియం శాఖ సూచించింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe