...
...
Next Story

iPhone 17 offers : విజయ్ సేల్స్‌లో 'యాపిల్ డేస్' సందడి- ఐఫోన్ 17 సిరీస్‌పై భారీ తగ్గింపు!

విజయ్ సేల్స్ వేదికగా ‘యాపిల్ డేస్’ సేల్ నేటి (ఏప్రిల్ 11) నుంచి ప్రారంభంకానుంది. ఐఫోన్ 17 సిరీస్, ఐఫోన్ ఎయిర్ సహా పాత మోడల్స్‌పై అదిరిపోయే బ్యాంకు ఆఫర్లు, ఎక్స్​ఛేంజ్ బోనస్‌లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Apr 11, 2026, 10:45:14 IST
Advertisement
<p>మీరు కొత్త ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది మీకోసమే! ప్రముఖ రిటైల్ నెట్‌వర్క్ విజయ్ సేల్స్ తన ప్రతిష్టాత్మక 'యాపిల్ డేస్' సేల్‌ని ఈ రోజు ప్రారంభించనుంది. ఏప్రిల్ 11న మొదలైన ఈ సేల్ ఏప్రిల్ 16 వరకు కొనసాగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 160కి పైగా విజయ్ సేల్స్ స్టోర్లతో పాటు వారి అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్స్​, వాటి ధరలు, వాటిపై డిస్కౌంట్లు- ఆఫర్ల వివరాలను ఇక్కడ చూసేయండి..</p>

మీరు కొత్త ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది మీకోసమే! ప్రముఖ రిటైల్ నెట్‌వర్క్ విజయ్ సేల్స్ తన ప్రతిష్టాత్మక 'యాపిల్ డేస్' సేల్‌ని ఈ రోజు ప్రారంభించనుంది. ఏప్రిల్ 11న మొదలైన ఈ సేల్ ఏప్రిల్ 16 వరకు కొనసాగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 160కి పైగా విజయ్ సేల్స్ స్టోర్లతో పాటు వారి అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్స్​, వాటి ధరలు, వాటిపై డిస్కౌంట్లు- ఆఫర్ల వివరాలను ఇక్కడ చూసేయండి..

ఐఫోన్ 17 ప్రారంభ ధర రూ. 78,790 గా ఉంది. యాక్సిస్, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ. 3,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇటీవలే విడుదలైన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్ ఐఫోన్ 17ఈ లాంచ్ ధర రూ. 64,900 కాగా, సేల్‌లో కేవలం రూ. 60,490 కే లభిస్తోంది.

ఇక ఈ విజయ్​ సేల్స్​ యాపిల్​ డేస్​లో ఐఫోన్ 17 ప్రో ప్రారంభ ధర రూ. 1,24,190 (బ్యాంకు ఆఫర్ కలిపి)గా ఉది. కాగా ఐఫోన్ 17 ప్రో మాక్స్ రూ. 1,38,390 వద్ద ప్రారంభమవుతోంది. యాపిల్ నుంచి వచ్చిన సన్నని, తేలికపాటి మోడల్ ఐఫోన్ ఎయిర్ ఇప్పుడు రూ. 90,990 కే సొంతం చేసుకోవచ్చు.

కేవలం లేటెస్ట్ ఫోన్లే కాకుండా, గతేడాది మోడల్స్​పై కూడా విజయ్ సేల్స్ భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. ఐఫోన్ 16 అసలు ధర తగ్గడమే కాకుండా, రూ. 2,000 బ్యాంకు డిస్కౌంట్ కలిపి రూ. 64,990 కే అందుబాటులో ఉంది. ఐఫోన్ 16 ప్లస్ ఎఫెక్టివ్ ధర రూ. 71,490 గా నిర్ణయించారు. ఐఫోన్ 16 ప్లస్ స్మార్ట్​ఫోన్ ఎఫెక్టివ్ ధర రూ. 71,490 గా నిర్ణయించారు.

"వినియోగదారులకు మరింత లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఎంపిక చేసిన మోడల్స్‌పై రూ. 10,000 వరకు ఎక్స్​ఛేంజ్ బోనస్‌ను అందిస్తున్నాము," అని విజయ్ సేల్స్ ప్రతినిధులు తెలిపారు. దీనితో పాటు ‘యాపిల్ కేర్+’ లేదా ప్రొటెక్ట్ ప్లాన్లపై 20% వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే విజయ్ సేల్స్ వారి 'MyVS' లాయల్టీ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి కొనుగోలుపై 0.75% లాయల్టీ పాయింట్లను పొందవచ్చు. ఒక్కో పాయింట్ ఒక రూపాయికి సమానం, వీటిని తదుపరి కొనుగోళ్లలో వాడుకోవచ్చు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe