
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఆకాశంలో ఒక తార మూవీలో రుహానీ శర్మ కీలక పాత్రలో నటిస్తుంది. ఆమె పోస్టర్ ను మేకర్స్ ఇవాళ (అక్టోబర్ 25) రిలీజ్ చేశారు.
ఆకాశంలో ఒక తార సినిమాలో రుహానీ శర్మ ‘బిజిలి’ అనే క్యారెక్టర్ ప్లే చేస్తోంది. ఇందులో ఓ పల్లెటూరి అమ్మాయిలా రుహానీ కనిపిస్తోంది. ఈ మూవీ నవంబర్ 20న రిలీజ్ కానుంది.
రుహానీ శర్మ వరుసకు విరాట్ కోహ్లీకి మరదలు అవుతుంది. ఆమె అనుష్క శర్మకు కజిన్ సిస్టర్. ఈ విషయాన్ని రుహానీ గతంలో పేర్కొంది.
రుహానీ ఇప్పటికే తమిళ్, మలయాళం, హిందీతో పాటు తెలుగులోనూ సినిమాలు చేసింది. సోషల్ మీడియాలో హాట్ పోజులతో అదరగొడుతోంది.
రుహానీ శర్మ ‘హిట్ ది ఫస్ట్ కేస్’ మూవీతో తెలుగులో అడుగుపెట్టింది. ఇందులో విష్వక్ సేన్ హీరో. ఆ తర్వాత వరుసగా డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు, her chapter 1 సినిమాలు చేసింది.
సైంధవ్, ఆపరేషన్ వాలంటైన్, శ్రీరంగ నీతులు, లవ్ మీ తదితర తెలుగు సినిమాల్లోనూ రుహానీ శర్మ మెరిసింది.