
కింగ్ కోహ్లి మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న విరాట్ గ్యాప్ తర్వాత మైదానంలోకి వచ్చినా బ్యాటింగ్ తో ఇరగదీశాడు.
38 ఏళ్ల కోహ్లి మరో ప్రపంచ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్ తో వన్డేలో అతను 15 వేల పరుగుల మైలురాయి చేరుకున్నాడు.
వన్డేల్లో సచిన్ టెండూల్కర్ తర్వాత 15 వేల రన్స్ చేరుకున్న రెండో బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రమే.
వన్డేల్లో అత్యంత వేగంగా 15 వేల రన్స్ కంప్లీట్ చేసిన బ్యాటర్ గా విరాట్ కోహ్లి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. అతను 315 ఇన్నింగ్స్ ల్లో ఈ ఫీట్ అందుకున్నాడు.
వన్డేల్లో ఫాస్టెస్ట్ 8000, 9000, 10000, 11000, 12000, 13000, 14000 పరుగుల రికార్డు కూడా విరాట్ కోహ్లి పేరు మీదే ఉంది.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}