...
...
Next Story

ఏపీ వెదర్ రిపోర్ట్ :నేడు ఈ జిల్లాలకు వర్ష సూచన – పిడుగుపాటు హెచ్చరికలు

ఏపీకి ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే సూచనలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

Published on: Jul 20, 2026, 06:02:46 IST
Advertisement
<p>ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ(జూలై 20) పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే సూచనలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.</p>

ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ(జూలై 20) పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే సూచనలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

సోమవారం (జూలై 20, 2026) రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ప్రధానంగా మేఘావృతమై ఉంటుంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పోలవరం ప్రాంతం, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశంతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఏపీలోని మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.

వర్షాలు పడే సమయంలో పిడుగులు సంభవించే ముప్పు ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఆశ్రయం పొందకుండా సురక్షితమైన భవనాల్లో ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

రానున్న 3 రోజులు మేఘావృతమైన వాతావరణం ఉండటంతో పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe