...
...
Next Story

WhatsApp : వాట్సాప్ నుంచి అదిరిపోయే సెక్యూరిటీ ఫీచర్- ఇక మీ అకౌంట్ మరింత సేఫ్!

వాట్సాప్.. తన యూజర్ల భద్రత కోసం భారీ మార్పునకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ఉన్న 6 అంకెల టూ-స్టెప్ వెరిఫికేషన్ పిన్ స్థానంలో అక్షరాలు, సంఖ్యలతో కూడిన బలమైన ఆల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్ ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Jul 25, 2026, 11:21:00 IST
Advertisement
<p>ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడుతున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ తన యూజర్ల ఖాతాల భద్రతను మరో మెట్టు పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. అకౌంట్ హ్యాకింగ్, సిమ్ స్వాపింగ్ వంటి సైబర్ నేరాల నుంచి వినియోగదారులను కాపాడేందుకు ఒక శక్తివంతమైన సెక్యూరిటీ ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోంది. ఇందులో భాగంగా, ప్రస్తుతం టూ-స్టెప్ వెరిఫికేషన్ కోసం ఉపయోగిస్తున్న 6 అంకెల పిన్ నంబర్ స్థానంలో సరికొత్త 'ఆల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్' వ్యవస్థను తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది. తాజాగా విడుదలైన ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ కోడింగ్‌ ఆధారంగా ఈ కీలక విషయం వెలుగులోకి వచ్చింది.</p>

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడుతున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ తన యూజర్ల ఖాతాల భద్రతను మరో మెట్టు పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. అకౌంట్ హ్యాకింగ్, సిమ్ స్వాపింగ్ వంటి సైబర్ నేరాల నుంచి వినియోగదారులను కాపాడేందుకు ఒక శక్తివంతమైన సెక్యూరిటీ ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోంది. ఇందులో భాగంగా, ప్రస్తుతం టూ-స్టెప్ వెరిఫికేషన్ కోసం ఉపయోగిస్తున్న 6 అంకెల పిన్ నంబర్ స్థానంలో సరికొత్త 'ఆల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్' వ్యవస్థను తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది. తాజాగా విడుదలైన ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ కోడింగ్‌ ఆధారంగా ఈ కీలక విషయం వెలుగులోకి వచ్చింది.

ఇప్పటివరకు వాట్సాప్ టూ-స్టెప్ వెరిఫికేషన్‌లో కేవలం 6 అంకెల సంఖ్యలను మాత్రమే పిన్‌గా పెట్టుకునే వెసులుబాటు ఉండేది. అయితే దీనిని సులభంగా అంచనా వేసే ప్రమాదం ఉందని భావించిన వాట్సాప్, ఇప్పుడు అక్షరాలు, సంఖ్యలు కలగలిపి ఉండే 'ఆల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్' క్రియేట్ చేసుకునే సౌకర్యాన్ని తీసుకురానుంది. పాస్‌వర్డ్ ఎంత బలంగా ఉందో సరిచూసుకున్న తర్వాతే సిస్టమ్ దాన్ని సేవ్ చేయడానికి అనుమతిస్తుందని బీటా నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల సైబర్ నేరగాళ్లు పాస్‌వర్డ్‌ను హ్యాక్ చేయడం లేదా ఊహించడం దాదాపు అసాధ్యంగా మారుతుంది.

ఈ కొత్త పాస్‌వర్డ్ విధానం వాట్సాప్ ప్రస్తుత లాగిన్ ప్రక్రియతో కలిసి పనిచేస్తుంది. కొత్త ఫోన్‌లో లేదా వేరే డివైజ్‌లో వాట్సాప్ లాగిన్ అయ్యేటప్పుడు ఎస్‌ఎంఎస్ ద్వారా వచ్చే ఓటీపీతో పాటు, వినియోగదారులు తాము స్వయంగా క్రియేట్ చేసుకున్న ఈ కొత్త పాస్‌వర్డ్‌ను కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఒకవేళ హ్యాకర్లు మీ సిమ్ కార్డును డూప్లికేట్ చేసి ఓటీపీ పొందినప్పటికీ, మీరు సెట్ చేసుకున్న ఆల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్ తెలియకపోతే మీ వాట్సాప్ అకౌంట్‌ను లాగిన్ చేయడం సాధ్యపడదు.

ప్రస్తుతం ఈ సెక్యూరిటీ ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉనట్లు సమాచారం. సాధారణ వినియోగదారులకే కాకుండా బీటా టెస్టర్లకు కూడా ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ కొత్త భద్రతా ఫీచర్‌ను అందరికి ఎప్పుడు రోలౌట్ చేస్తారనే దానిపై కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

గత కొన్నేళ్లుగా వాట్సాప్ తన ప్లాట్‌ఫామ్‌పై భద్రతను నిరంతరం పెంచుతూ వస్తోంది. డివైజ్ వెరిఫికేషన్, మాల్వేర్ దాడుల నుంచి రక్షణ కల్పించే ఖాతా రక్షణ వ్యవస్థలను పరిచయం చేసిన వాట్సాప్, ఇప్పుడు ఈ కొత్త పాస్‌వర్డ్ ఫీచర్ ద్వారా యూజర్ల డేటాను మరింత సురక్షితంగా మార్చనుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe