'అన్నదాత సుఖీభవ స్కీమ్' డబ్బులు ఎప్పుడు వస్తాయి..? తాజా అప్డేట్స్ ఇవే
పంట పెట్టుబడి సాయం కోసం ఏపీ సర్కార్ అన్నదాత సుఖీభవ స్కీమ్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్కీమ్ కింద అందే సాయం రైతులు ఎదురుచూస్తున్నారు. పీఎం కిసాన్ నిధులతో పాటే వీటిని కూడా విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ స్కీమ్ డబ్బుల విడుదలపై ముఖ్యమైన అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి…
పీఎం కిసాన్ నిధులతో పాటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ స్కీమ్ నిధులను కూడా జమ చేయనుంది. ఇదే విషయాన్ని ఏపీ ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. అయితే ఈ నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
అన్నదాత సుఖీభవ స్కీమ్ అర్హుల వివరాలను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పేర్కొంది. అర్హుల స్టేటస్ తెలుసుకునేందుకు ముందుగా అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్ సైట్ https://annadathasukhibhava.ap.gov.in/ లోకి వెళ్లాలి. హోంపేజీలో కనిపింటే 'Know Your Status' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. పక్కనే ఉండే సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే రైతు దరఖాస్తు స్టేటస్ డిస్ ప్లే అవుతుంది. ఏమైనా ఇబ్బందులు ఉంటే జూలై 13వ తేదీలోపు అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది.
దేశంలోని రైతులకు లబ్ధి చేకూర్చే పథకం పీఎం కిసాన్. ప్రధానమంత్రి కిసాన్ యోజన 20వ విడత నిధులు త్వరలో విడుదల కానున్నాయి. ఈ విడత జూలై 18న రైతుల ఖాతాల్లో జమ అవుతుందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలైలో బీహార్ సందర్శించే అవకాశం ఉంది. ఇదే సమయంలో నిధులు జమ చేసే అవకాశం ఉంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏటా రూ.6,000 అందజేస్తారు. ప్రతి విడతలో(మొత్తం 3 విడతలు) రూ. 2 వేలు జమ చేస్తారు.
దేశంలోని రైతులకు లబ్ధి చేకూర్చే పథకం పీఎం కిసాన్. ప్రధానమంత్రి కిసాన్ యోజన 20వ విడత నిధులు త్వరలో విడుదల కానున్నాయి. ఈ విడత జూలై 18న రైతుల ఖాతాల్లో జమ అవుతుందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలైలో బీహార్ సందర్శించే అవకాశం ఉంది. ఇదే సమయంలో నిధులు జమ చేసే అవకాశం ఉంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏటా రూ.6,000 అందజేస్తారు. ప్రతి విడతలో(మొత్తం 3 విడతలు) రూ. 2 వేలు జమ చేస్తారు.
జూలై 18వ తేదీన పీఎం కిసాన్ నిధులు విడుదలైతే… వీటితో పాటే అన్నదాత సుఖీభవ స్కీమ్ నిధులు కూడా రైతుల ఖాతాలోకి వస్తాయి. ఒకవేళ ఈ తేదీ కాకపోతే… మరో తేదీలో వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఈ జూలై నెలలోనే పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధులు జమవుతాయని అధికారిక వర్గాల మేరకు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు.రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6,000లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మూడు దఫాల్లో ఈ మొత్తాన్ని అందజేస్తారు.
పీఎం కిసాన్ కింద(20వ విడత) ఒక్కో రైతు కుటుంబానికి రూ.2వేల చొప్పున విడుదల చేస్తారు. దీంతో సుఖీభవ డబ్బులను కూడా జమ చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. అదేరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.5 వేల చొప్పున జమ చేయనుంది. అంటే తొలి విడతలో ఏపీలోని రైతుకు రూ.7 వేలు అందుతాయి.జూలై 18వ తేదీ కాకుండా కేంద్రం మరో తేదీని ఖరారు చేస్తే… దానికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం కూడా సుఖీభవ నిధులను జత చేస్తుంది.
ఇక రెండో విడతగా అక్టోబరులో రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు, కేంద్రం రూ.2వేలు కలిపి రూ.7వేలు, మూడో విడతగా వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్రం రూ.4వేలు, కేంద్రం రూ.2వేలు కలిపి రూ.6వేలను రైతుల బ్యాంక్ ఖాతాలో జమవుతాయి. పీఎం కిసాన్ నిధులతో పాటే ఈ డబ్బులు కూడా వస్తాయి.
రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది. మొత్తం 3 విడతల్లో డబ్బులను జమ చేస్తారు. ఇందులో కేంద్రం వాటాగా పీఎం కిసాన్ నిధులు కూడా ఉంటాయి.
E-Paper

