...
...
Next Story

Gitanjali Angmo : భర్తకి తోడుగా పోరాటాలు.. సింగిల్ హ్యాండ్‌తో ఉద్యమం! ఎవరీ గీతాంజలి ఆంగ్మో?

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఆసుపత్రి నుంచి పోరాడుతుంటే, బయట ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. విద్యావేత్త, బిజినెస్ ఉమెన్, మార్షల్ ఆర్ట్స్ ఎక్స్‌పర్ట్ అయిన ఆమె స్ఫూర్తిదాయక ప్రస్థానంపై ప్రత్యేక కథనం..G

Published on: Jul 19, 2026, 11:26:42 IST
Advertisement
<p>గీతాంజలి ఆంగ్మో కేవలం ఒక సామాజిక కార్యకర్త భార్య మాత్రమే కాదు, ఆమె ఒక విజయవంతమైన సోషల్ ఆంట్రప్రెన్యూర్ (సామాజిక పారిశ్రామికవేత్త), గొప్ప విద్యావేత్త. లడఖ్‌లో విద్యా సంస్కరణల కోసం సోనమ్ వాంగ్‌చుక్‌తో కలిసి ఆమె ‘హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్, లడఖ్’ సంస్థను స్థాపించారు. ప్రస్తుతం ఆమె ఈ ప్రతిష్టాత్మక సంస్థకు వ్యవస్థాపక సీఈఓ, డీన్‌గా వ్యవహరిస్తున్నారు. హిమాలయ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, పర్యావరణహిత సాంకేతికతను పెంపొందించడంపై ఈ సంస్థ పనిచేస్తుంది. గ్రీన్ క్యాంపస్‌ల నిర్మాణం, సోలార్ హీటెడ్ బిల్డింగ్‌ల రూపకల్పనలో ఈ సంస్థ రికార్డు సృష్టించింది. చివరికి 2021లో భారత సైనికుల కోసం మైనస్ డిగ్రీల చలిని తట్టుకునేలా ప్రత్యేక 'సోలార్ హీటెడ్ టెంట్లు' తయారు చేసింది కూడా వీరే కావడం విశేషం.</p>

గీతాంజలి ఆంగ్మో కేవలం ఒక సామాజిక కార్యకర్త భార్య మాత్రమే కాదు, ఆమె ఒక విజయవంతమైన సోషల్ ఆంట్రప్రెన్యూర్ (సామాజిక పారిశ్రామికవేత్త), గొప్ప విద్యావేత్త. లడఖ్‌లో విద్యా సంస్కరణల కోసం సోనమ్ వాంగ్‌చుక్‌తో కలిసి ఆమె ‘హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్, లడఖ్’ సంస్థను స్థాపించారు. ప్రస్తుతం ఆమె ఈ ప్రతిష్టాత్మక సంస్థకు వ్యవస్థాపక సీఈఓ, డీన్‌గా వ్యవహరిస్తున్నారు. హిమాలయ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, పర్యావరణహిత సాంకేతికతను పెంపొందించడంపై ఈ సంస్థ పనిచేస్తుంది. గ్రీన్ క్యాంపస్‌ల నిర్మాణం, సోలార్ హీటెడ్ బిల్డింగ్‌ల రూపకల్పనలో ఈ సంస్థ రికార్డు సృష్టించింది. చివరికి 2021లో భారత సైనికుల కోసం మైనస్ డిగ్రీల చలిని తట్టుకునేలా ప్రత్యేక 'సోలార్ హీటెడ్ టెంట్లు' తయారు చేసింది కూడా వీరే కావడం విశేషం.

గీతాంజలి ఒడిశాలోని బాలాసోర్‌లో ఒక పంజాబీ కుటుంబంలో జన్మించారు. ఫకీర్ మోహన్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె, భువనేశ్వర్‌లోని ప్రముఖ జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఉన్నత చదువుల అనంతరం కార్పొరేట్ రంగంలో అడుగుపెట్టిన గీతాంజలి దాదాపు 15 ఏళ్ల పాటు టాప్ పొజిషన్లలో పనిచేశారు. అందులో ఎక్కువ కాలం డెన్మార్క్‌లోనే గడిపారు. అయితే స్వదేశానికి వచ్చి సొంతంగా ఏదైనా సాధించాలనే సంకల్పంతో కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి భారత్ తిరిగొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పూషన్, షాంఘై పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వంటి సంస్థలతో పాటు 'హీలియోస్ బుక్స్' అనే పబ్లిషింగ్ హౌస్‌ను కూడా విజయవంతంగా స్థాపించారు.

గీతాంజలి ప్రతిభ కేవలం వ్యాపారానికే పరిమితం కాలేదు. గీతాంజలి తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో తనను తాను ఒక ఆధ్యాత్మిక అన్వేషకురాలిగా పేర్కొన్నారు. వేదాంతం, భగవద్గీతను ఆమె బోధిస్తారు. ప్రతిష్టాత్మక 'చెవెనింగ్ ఫెలో' అయిన ఆమె, భారత ప్రభుత్వం అందించే 'వుమెన్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా' జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. వీటన్నింటికీ మించి ఆమె కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు. క్లాసికల్ డ్యాన్స్ అయిన ఒడిస్సీతో పాటు రష్యన్ బ్యాలెట్ డ్యాన్స్‌లోనూ ఆమె ప్రవీణురాలు కావడం విశేషం.

గీతాంజలి సోనమ్ వాంగ్‌చుక్‌కు రెండో భార్య. అంతకుముందు వాంగ్‌చుక్ అమెరికాకు చెందిన రెబెక్కా నార్మన్ అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత విద్యా సదస్సులో గీతాంజలితో ఏర్పడిన పరిచయం వివాహ బంధానికి దారితీసింది.

గీతాంజలి ఎప్పుడూ ప్రచారానికి దూరంగా ఉంటారు. కానీ భర్తకు కష్టం వస్తే మాత్రం బలంగా పోరాడతారు. గత ఏడాది లడఖ్‌కు స్వయంప్రతిపత్తి, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌లో చేర్చాలనే డిమాండ్‌తో జరిగిన నిరసనల్లో నలుగురు చనిపోయినప్పుడు, వాంగ్‌చుక్‌ను కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద పోలీసులు నిర్బంధించారు. ఆ సమయంలో ఆమె ఏమాత్రం అధైర్యపడకుండా భర్త నిర్బంధాన్ని సవాలు చేస్తూ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశ రాష్ట్రపతికి లేఖ రాసి జోక్యం చేసుకోవాలని కోరారు.

ఆమె పట్టుదలతో దాదాపు 170 రోజుల నిర్బంధం తర్వాత వాంగ్‌చుక్ విడుదలయ్యారు. ఇప్పుడు మళ్లీ నీట్ పేపర్ లీక్ వివాదంలో భర్త ఆసుపత్రి పాలైనా, ఆమె వెనకడుగు వేయకుండా దిల్లీ వీధుల్లో విద్యార్థుల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe