హైదరాబాద్ : మందుబాబులకు బ్యాడ్ న్యూస్ - 2 రోజులు వైన్స్ షాపులు బంద్, ఎప్పుడంటే...?

By Maheshwaram Mahendra Chary, Telangana, Hyderabad
Updated On Jul 10, 2025 05:03 pm IST

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ వచ్చేసింది. హైదరాబాద్ పరిధిలో జరిగే ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారి (సికింద్రాబాద్) బోనాల సందర్భంగా వైన్స్ షాపులను మూసివేయనున్నారు. ఈ మేరకు నగర పోలీసులు ప్రకటన విడుదల చేశారు. జూలై 13 ఉదయం నుంచి జూలై 15 ఉదయం వరకు మూసి వేసి ఉంటాయని పేర్కొన్నారు.

1 / 6

వైన్స్ షాపులు మాత్రమే కాకుండా... కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా మూసివేసి ఉంటాయని హైదరాబాద్ నగర సీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

expand-icon View Photos in a new improved layout
Updated on Jul 10, 2025 05:03 pm IST

వైన్స్ షాపులు మాత్రమే కాకుండా... కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా మూసివేసి ఉంటాయని హైదరాబాద్ నగర సీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

2 / 6

హైదరాబాద్ లో ఆషాడ మాస బోనాలు జరుగుతున్నాయి. జూలై 13వ తేదీన ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారి బోనాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నగర పోలీసులు కీలక ప్రకటన చేశారు. వైన్స్ షాపులు మూసివేసి ఉంటాయని తెలిపారు.
(Image Credit- Pexels) expand-icon View Photos in a new improved layout
Updated on Jul 10, 2025 05:03 pm IST

హైదరాబాద్ లో ఆషాడ మాస బోనాలు జరుగుతున్నాయి. జూలై 13వ తేదీన ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారి బోనాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నగర పోలీసులు కీలక ప్రకటన చేశారు. వైన్స్ షాపులు మూసివేసి ఉంటాయని తెలిపారు.

(Image Credit- Pexels)

3 / 6

గాంధీ నగర్, చిలకలగూడ, బేగంపేట్, గోపాల్ పురం, మహంకాళీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు మూసివేసి ఉంటాయని పోలీసులు ప్రకటించారు.

expand-icon View Photos in a new improved layout
Updated on Jul 10, 2025 05:03 pm IST

గాంధీ నగర్, చిలకలగూడ, బేగంపేట్, గోపాల్ పురం, మహంకాళీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు మూసివేసి ఉంటాయని పోలీసులు ప్రకటించారు.

4 / 6

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాల సందర్భంగా రెండు రోజులు వైన్స్ షాపులు మూసి వేసి ఉంటాయని పోలీసులు తెలిపారు. జూలై 13 ఉదయం 6 గంటల నుంచి జూలై 15 ఉదయం 6 గంటల వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది.

expand-icon View Photos in a new improved layout
Updated on Jul 10, 2025 05:03 pm IST

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాల సందర్భంగా రెండు రోజులు వైన్స్ షాపులు మూసి వేసి ఉంటాయని పోలీసులు తెలిపారు. జూలై 13 ఉదయం 6 గంటల నుంచి జూలై 15 ఉదయం 6 గంటల వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది.

5 / 6

నిబంధనలు ఉల్లంఘించి షాపులు తెరిస్తే.. కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
expand-icon View Photos in a new improved layout
Updated on Jul 10, 2025 05:03 pm IST

నిబంధనలు ఉల్లంఘించి షాపులు తెరిస్తే.. కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

6 / 6

జూలై 17న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి చివరి 7వ బంగారు బోనం సమర్పించనున్నారు. ఇక జూలై 20న పాతబస్తీలో బోనాలు ఉంటాయి. జూలై 21న పాతబస్తీలో భక్తిశ్రద్ధలతో అమ్మవారి సామూహిక ఘటాల ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ తర్వాత మారు బోనంతో ఈసారి ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ముగియనున్నాయి. బోనాలు జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలపై ఆంక్షలు విధిస్తారు.

(Disclaimer : మద్యం సేవించటం హానికరం. అతిగా సేవించటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి)

expand-icon View Photos in a new improved layout
Updated on Jul 10, 2025 05:03 pm IST

జూలై 17న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి చివరి 7వ బంగారు బోనం సమర్పించనున్నారు. ఇక జూలై 20న పాతబస్తీలో బోనాలు ఉంటాయి. జూలై 21న పాతబస్తీలో భక్తిశ్రద్ధలతో అమ్మవారి సామూహిక ఘటాల ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ తర్వాత మారు బోనంతో ఈసారి ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ముగియనున్నాయి. బోనాలు జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలపై ఆంక్షలు విధిస్తారు.

(Disclaimer : మద్యం సేవించటం హానికరం. అతిగా సేవించటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి)

• author-default-90x90
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

• మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!