...
...
Next Story

Women strength training : బరువులు ఎత్తితే మహిళల శరీరం లావుగా మారుతుందా? అపోహలు - వాస్తవాలు..

బరువులు ఎత్తితే శరీరం కండలు తిరిగి బల్కీగా మారుతుందనే భయంతో చాలా మంది మహిళలు స్ట్రెంత్ ట్రైనింగ్‌కు దూరంగా ఉంటారు. అయితే ఇది కేవలం అపోహ మాత్రమేనని, దీనివల్ల ఆరోగ్య ప్రWయోజనాలు ఎన్నో ఉన్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Published on: Aug 23, 2026, 12:21:05 IST
Advertisement
<p>శరీరం కండలు తిరగడం అనేది అంత సులువుగా లేదా అనుకోకుండా జరిగేది కాదు. ఇది జన్యువులు, హార్మోన్లు, ఆహారపు అలవాట్లు, వ్యాయామ శైలి, వర్కౌట్ చేసే సమయం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. చాలామంది మహిళలకు రెగ్యులర్ స్ట్రెంత్ ట్రైనింగ్ వల్ల కండలు అసాధారణంగా పెరగడం కంటే, బాడీ టోన్ మెరుగవ్వడం, బలం పుంజుకోవడం వంటి ప్రయోజనాలే కలుగుతాయి. మహిళలు ఏ వయసులోనైనా రెసిస్టెన్స్ ట్రైనింగ్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు. బరువులు ఎత్తడం వల్ల కండలు, ఎముకలు బలపడతాయి. మంచి పోశ్చర్ సహకరిస్తుంది, బ్యాలెన్స్ మెరుగవుతుంది. దైనందిన పనులు సులభంగా మారుతాయి. మరి బరువులు ఎత్తడం వల్ల నిజంగానే మహిళలు బల్కీగా మారుతారా? సాధారణంగా చెప్పాలంటే, లేదు! అసలు దీని వెనుక ఉన్న అసలు నిజాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాము..</p>

శరీరం కండలు తిరగడం అనేది అంత సులువుగా లేదా అనుకోకుండా జరిగేది కాదు. ఇది జన్యువులు, హార్మోన్లు, ఆహారపు అలవాట్లు, వ్యాయామ శైలి, వర్కౌట్ చేసే సమయం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. చాలామంది మహిళలకు రెగ్యులర్ స్ట్రెంత్ ట్రైనింగ్ వల్ల కండలు అసాధారణంగా పెరగడం కంటే, బాడీ టోన్ మెరుగవ్వడం, బలం పుంజుకోవడం వంటి ప్రయోజనాలే కలుగుతాయి. మహిళలు ఏ వయసులోనైనా రెసిస్టెన్స్ ట్రైనింగ్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు. బరువులు ఎత్తడం వల్ల కండలు, ఎముకలు బలపడతాయి. మంచి పోశ్చర్ సహకరిస్తుంది, బ్యాలెన్స్ మెరుగవుతుంది. దైనందిన పనులు సులభంగా మారుతాయి. మరి బరువులు ఎత్తడం వల్ల నిజంగానే మహిళలు బల్కీగా మారుతారా? సాధారణంగా చెప్పాలంటే, లేదు! అసలు దీని వెనుక ఉన్న అసలు నిజాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాము..

సాధారణ వెయిట్ ట్రైనింగ్ చేసినంత మాత్రాన మహిళల్లో పెద్ద ఎత్తున కండలు పెరగకపోవడానికి ప్రధాన కారణం వారి హార్మోన్ల వ్యవస్థ. పురుషులతో పోలిస్తే మహిళల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. కండల వృద్ధిలో ఈ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. అంత మాత్రాన మహిళలు కండలను పెంచుకోలేరని కాదు, కచ్చితంగా పెంచుకోవచ్చు. అయితే, గణనీయమైన స్థాయిలో కండలు పెరగాలంటే మాత్రం క్రమమైన రెసిస్టెన్స్ ట్రైనింగ్, సరైన పోషకాహారం, తగినంత ప్రోటీన్, సుదీర్ఘకాలం పాటు క్యాలరీ సర్​ప్లస్ (అవసరానికి మించి ఆహారం తీసుకోవడం) అవసరం అవుతాయి. వారానికి రెండు లేదా మూడు సార్లు బరువులు ఎత్తే చాలామంది మహిళలకు ఆకస్మికంగా కండలు పెరగడం కాకుండా, మరింత బలమైన, చక్కని ఆకారంలో ఉండే కండలే సొంతమవుతాయి.

రెగ్యులర్ స్ట్రెంత్ ట్రైనింగ్ వల్ల కండలు శరీరానికి సరైన ఆకారాన్ని ఇస్తాయి, కదలికలకు మద్దతు ఇస్తాయి. వస్తువులు మోయడం, మెట్లు ఎక్కడం లేదా వస్తువులు పైకి ఎత్తడం వంటి దైనందిన పనులు సులభమవుతాయి. వెయిట్-బేరింగ్, రెసిస్టెన్స్ వ్యాయామాలు ఎముకల బలాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఇది మహిళలకు ఎంతో ముఖ్యం.

ఇక కొవ్వును తగ్గించుకుంటూ లేదా మెయింటైన్ చేస్తూ కండలను పెంచుకోవడం ద్వారా మరింత టోన్డ్ లుక్ పొందవచ్చు. కండల కణజాలానికి శక్తి అవసరం. కండలను సంరక్షించుకోవడం ద్వారా రోజువారీ కేలరీల ఖర్చు మెరుగవుతుంది.

కండలు, కొవ్వు శరీరంపై వేర్వేరు ప్రభావాలను చూపుతాయి కాబట్టి బరువులో తేడా వెంటనే కనిపించకపోవచ్చు. బరువులో పెద్దగా మార్పు లేకపోయినా, ఒక మహిళ మరింత లీన్‌గా, బలంగా కనిపించవచ్చు.

బరువులు ఎత్తినంత మాత్రాన మహిళల శరీరం ఆటోమేటిక్‌గా లావుగా మారదు. ట్రేనింగ్ వాల్యూమ్, వ్యాయామాల ఎంపిక, పోషకాహారం, రికవరీ, జన్యువులు, వ్యక్తిగత లక్ష్యాలపై కండల వృద్ధి ఆధారపడి ఉంటుంది. బలం పుంజుకోవడానికి బరువులు ఎక్కువగా ఎత్తడం వాస్తవానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కండల పరిమాణాన్ని ప్రత్యేకంగా పెంచుకోకుండా మరింత బలంగా మారాలనుకునే వారు, తగినన్ని రిపిటీషన్లు, రెస్ట్ పీరియడ్స్‌తో కూడిన చక్కటి స్ట్రెంత్ ప్రోగ్రామ్‌ను అనుసరించవచ్చు. మంచి వ్యాయామ టెక్నిక్‌ను పాటిస్తూ క్రమంగా బలాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి.

ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్‌లో స్ట్రెంత్ ట్రైనింగ్ ఒక ముఖ్యమైన భాగం. నడవడం, పరిగెత్తడం, సైక్లింగ్ చేయడం వంటివి కేలరీలను కరిగించినప్పటికీ, రెసిస్టెన్స్ ట్రైనింగ్ మాత్రం కండలను కాపాడుకోవడానికి, నిర్మించుకోవడానికి సహాయపడుతుంది. రెసిస్టెన్స్ వ్యాయామాలు లేకుండా బరువు తగ్గితే ఒక్కోసారి కొవ్వుతో పాటు కండలు కూడా కరిగిపోయే ప్రమాదం ఉంది. సమతుల్య ఆహారం, తగినంత ప్రోటీన్‌తో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్‌ను జోడించడం ద్వారా కొవ్వును తగ్గిస్తూ కండలను పటిష్టం చేసుకోవచ్చు.

అయితే, శరీరం లోని ఏదో ఒక నిర్దిష్ట భాగంలో ఉన్న కొవ్వును మాత్రమే ప్రత్యేకంగా ఏ వ్యాయామం కూడా తగ్గించలేదు. క్రమమైన శారీరక శ్రమ, సరైన పోషకాహారం, సమతుల్యమైన కేలరీల తీసుకోవడం వంటి వాటి కలయిక శరీర కొవ్వును తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe