...
...
Next Story

గణపతికి ప్రీతిపాత్రమైన ఈ 16 నామాలను పఠించి, ఈ పుష్పాలు సమర్పించండి.. ఎలాంటి విఘ్నాలు ఉండవు!

హిందూ ధర్మంలో ఏ శుభకార్యమైనా విఘ్నేశ్వరుని పూజతోనే మొదలవుతుంది. గణపతి ఆరాధనతో కష్టాలు ఎలా తొలగిపోతాయి? స్వామికి ప్రీతిపాత్రమైన 16 నామాలు, పూజా విశేషాల గురించి తెలుసుకోండి.

Published on: Jun 17, 2026, 09:30:41 IST
Advertisement

వినాయకుడిని ఆరాధించడం వలన విఘ్నాలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు. వినాయకుడిని పూజించడం వలన మనం చేసే ఏ కార్యమైనా కూడా విజయవంతంగా పూర్తి అవుతుందని నమ్మకం. అందుకే ఎలాంటి శుభకార్యాలు చేసినా మొట్టమొదట వినాయకుడిని పూజిస్తాము. పెళ్లిళ్లు జరిపేటప్పుడు కూడా వినాయకుడి పూజ చేసి పెళ్లి పనులు మొదలు పెడతాము.

గణపతికి ప్రీతిపాత్రమైన ఈ 16 నామాలను పఠించి, ఈ పుష్పాలు సమర్పించండి.. ఎలాంటి విఘ్నాలు ఉండవు! (pinterest)
గణపతికి ప్రీతిపాత్రమైన ఈ 16 నామాలను పఠించి, ఈ పుష్పాలు సమర్పించండి.. ఎలాంటి విఘ్నాలు ఉండవు! (pinterest)

వినాయకుడిని ఆరాధించడం వలన విఘ్నాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుంది. ఆరోగ్యం, సంపద, శాంతి లభిస్తాయి. ఐశ్వర్యం, విద్యాబుద్ధి కూడా పెరుగుతాయి. కుటుంబంలో ఆనందం, ఐక్యత కూడా వినాయకుని ఆరాధించడం వలన పెరుగుతాయి. రోజూ వినాయకుడిని ఆరాధించడం వలన భక్తి, ధైర్యం, విజయాలను పొందడానికి వీలవుతుంది.

వినాయకుడిని ఆరాధించేటప్పుడు ఈ 16 నామాలను జపించండి. ఈ 16 నామాలను చదువుకోవడం వలన వినాయకుని అనుగ్రహం కలుగుతుంది. విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రం ద్వారా వినాయకుని ఆశీస్సులు పొందవచ్చు. ఈ 16 నామాలు కూడా అత్యంత శక్తివంతమైనవి. గుర్తు పెట్టుకోండి. ఈసారి ఎప్పుడైనా వినాయకుడిని ఆరాధించేటప్పుడు, పూజ చేసేటప్పుడు, మొట్టమొదట వినాయకుడిని పూజించేటప్పుడు అయినా ఈ నామాలను చదువుకుంటే మంచిది. దీని ద్వారా పైన చెప్పిన లాభాలన్నింటినీ కూడా పొందడానికి వీలవుతుంది.

ఓం సుముఖాయ నమః

ఓం ఏకదంతాయ నమః

ఓం కపిలాయ నమః

ఓం గజకర్ణకాయ నమః

ఓం లంబోదరాయ నమః

ఓం వికటాయ నమః

ఓం విఘ్నరాజాయ నమః

ఓం గణాధిపాయ నమః

ఓం ధూమకేతవే నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం ఫాలచంద్రాయ నమః

ఓం గజాననాయ నమః

ఓం వక్రతుండాయ నమః

ఓం శూర్పకర్ణాయ నమః

ఓం హేరంబాయ నమః

ఓం స్కందపూర్వజాయ నమః

వినాయకుడికి ఇష్టమైన ఈ పుష్పాలను సమర్పించండి

ఎర్ర మందారాలు:

సుగంధభరితమైన జాజి పువ్వులు అంటే వినాయకుడికి చాలా ఇష్టం. ఈ పూల సువాసన పూజ గదిని పవిత్రంగా మారుస్తుంది. మనసును కూడా ప్రశాంతంగా ఉంచుతుంది.

గరిక:

వినాయకుడి పూజలో గరిక కచ్చితంగా ఉండాలి. వీటిని సమర్పించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. కోరికలు నెరవేరుతాయి. వినాయకుని ఆశీస్సులతో సంతోషంగా ఉండొచ్చు. కుదిరితే 21 గరికపోచలను సమర్పించండి.

పూజలో గరిక ఎందుకు వాడాలి?

గరిక వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. గరిక లేని పూజ వినాయకుడికి అసంపూర్ణమని భావిస్తారు.

వినాయకుడికి పూలతో పూజ చేసేటప్పుడు వాడిపోయిన పూలను, నేల మీద పడిన పూలను సమర్పించకండి. తాజా పూలను మాత్రమే సమర్పించండి. వినాయకుడికి కనకాంబరాలు, మల్లెపూలు కూడా సమర్పించవచ్చు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks