Lord Hanuman Favorite Zodiac Signs: ఆంజనేయ స్వామికి ఈ రాశులంటే అమితమైన ఇష్టం.. మీ రాశి ఇందులో ఉందా?
Lord Hanuman Favorite Zodiac Signs: ధైర్యం, బలం, బుద్ధికి ప్రతిరూపమైన ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉంటే ఎంతటి కష్టమైనా ఇట్టే తొలగిపోతుంది. ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారికి హనుమంతుడి అండదండలు ఎప్పుడూ ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
హనుమంతుడి అనుగ్రహం పొందితే ధైర్యం, బలం పుష్కలంగా లభిస్తాయని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. హనుమంతుడిని నమ్ముకుంటే కచ్చితంగా శుభ ఫలితాలను పొందవచ్చని, హనుమంతుని అనుగ్రహం కోసం రకరకాల పద్ధతులు, పూజా విధానాలు, మంత్రాలను పాటిస్తూ ఉంటాము. హనుమంతుడిని ఆరాధించడం వలన జాతకంలో గ్రహాల అశుభ ప్రభావాల నుంచి కూడా బయటపడచ్చని నమ్మకం.

జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే, హనుమంతుడికి కొన్ని రాశుల వారంటే మహా ఇష్టం. మరి ఏ రాశుల వారికి హనుమంతుడు ఎప్పుడూ మేలు చేస్తాడు? హనుమంతుడికి ఇష్టమైన రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.
హనుమంతుడికి ఈ రాశుల వారంటే మహా ఇష్టం.. మరి వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి!
1.మేష రాశి:
మేష రాశికి అధిపతి కుజుడు. కుజుడు, హనుమంతుడి మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. ఈ కారణంగా హనుమాన్ అనుగ్రహం ఈ రాశి వారికి బాగా లభిస్తుంది. కుజుడు వలన ఈ రాశి వారు ధైర్యంగా, భయం లేకుండా ఉంటారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలరు. లక్ష్యాలను సాధించడానికి పట్టుదలతో ఉంటారు. ఏ కష్టం వచ్చినా ఏ మాత్రం వెనుకడుగు వేయరు.
2.వృశ్చిక రాశి:
ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి వారు హనుమాన్ ప్రత్యేక ఆశీస్సులను ఎప్పుడూ పొందుతూ ఉంటారు. హనుమాన్ అనుగ్రహంతో తెలివితేటలను పెంచుకుంటూ, ఓపికగా ఉంటారు. నిజాయితీ, అంకితభావంతో ఉండడం ఈ రాశి వారి మరో ప్రత్యేకత. దీంతో సులువుగా విజయాలను సాధిస్తారు.
3.సింహ రాశి:
ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశి వారు హనుమాన్ అనుగ్రహంతో ఆనందంగా ఉంటారు. అలాగే ఆత్మవిశ్వాసం, శక్తి ఎక్కువగా ఉంటాయి. నాయకత్వ నైపుణ్యాలు కూడా ఎక్కువగా ఉండడంతో ఎప్పుడూ మంచి అవకాశాలను పొందుతారు. మంచి నిర్ణయాలను తీసుకుంటారు. సక్సెస్‌ను అందుకుంటారు.
4.కుంభ రాశి:
ఈ రాశికి అధిపతి శని దేవుడు. శని దేవుని ప్రభావంతో ఈ రాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు. న్యాయంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశి వారికి ఎప్పుడూ హనుమాన్ ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. కష్టాల నుంచి కూడా ఈ రాశి వారు సులువుగా బయటపడతారు. ప్రతికూల శక్తుల నుంచి విముక్తి పొందడానికి అవకాశాలు ఎప్పుడూ ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు ఈ రాశి వారు సమాజ ప్రయోజనాల కోసం మంచి పనులు చేస్తారు.
హనుమంతుడికి ఇష్టమైన ఈ రాశుల వారు క్రమం తప్పకుండా స్వామిని ఆరాధించడం వల్ల జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


