Vastu Tips Main Door : ఇంటి మెయిన్ డోర్ ముందు ఇవి ఉంటే దరిద్రమే.!. వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది…?
Vastu Shastra Main Door : వాస్తు శాస్త్రంలో సింహద్వారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొన్ని వస్తువులు ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. లక్ష్మీ దేవి అనుగ్రహం కలగాలంటే పాటించాల్సిన వాస్తు సూత్రాలివే…!
Vastu Shastra Main Door : హిందూ సంప్రదాయంలో…నూ…. వాస్తు శాస్త్రంలోనూ ఇంటి ప్రధాన ద్వారానికి (మెయిన్ డోర్) అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇంటికి కిటికీలు, ఇతర తలుపులు ఎన్ని ఉన్నా.. సానుకూల శక్తి ప్రవేశించేది మాత్రం ప్రధాన ద్వారం నుంచేనని పెద్దలు చెబుతుంటారు. లక్ష్మీదేవి ఇంటికి వచ్చే మార్గం కూడా ఇదే. అందుకే ఇంటిని నిర్మించేటప్పుడు మెయిన్ డోర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ద్వారం వద్ద ఉండే పరిసరాలు మన ఆరోగ్యం, ఆర్థిక స్థితిగతులు మరియు కుటుంబ ప్రశాంతతను ప్రభావితం చేస్తాయి. వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ముందు అస్సలు ఉండకూడని వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం….!
ప్రధాన ద్వారం ముందు ఇవి ఉంటే కష్టాలు తప్పవు. చాలామంది ఇంటి ముందు స్థలం ఉంది కదా అని రకరకాల వస్తువులను ఉంచుతుంటారు లేదా ఆ పక్కనే ఇళ్లు నిర్మిస్తుంటారు. కానీ కొన్ని అంశాలు తీవ్రమైన వాస్తు దోషాలకు దారితీస్తాయి.
- నేరుగా ఉండే రోడ్డు : ఇంటి ప్రధాన ద్వారానికి సరిగ్గా ఎదురుగా రోడ్డు ఉండటం మంచిది కాదు. వీధిపోటు లేదా నిటారుగా వచ్చే రహదారి ఉంటే జీవితంలో ఎదుగుదల ఆగిపోవడమే కాకుండా…. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.
- నీరు లేదా బురద : ఇంటి గుమ్మం ముందు నీరు నిలవకూడదు. మురికి గుంటలు లేదా బురద ఉంటే ప్రతికూల శక్తులు ఇంటిని ఆవరిస్తాయి. ఇది కుటుంబ సభ్యుల పురోగతిని దెబ్బతీస్తుంది.
- మురుగు కాలువలు : ప్రవేశ ద్వారం ముందు మురుగు నీరు వెళ్లే కాలువ ఉండకూడదు. దీనివల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవదని, ఆర్థిక నష్టాలు సంభవిస్తాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- విద్యుత్ స్తంభాలు : ఇంటి ప్రధాన ద్వారానికి అడ్డంగా కరెంట్ స్తంభం లేదా మరేదైనా స్తంభం ఉంటే అది అశుభం. ఇది ముఖ్యంగా ఇంట్లోని మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
- చెట్లు లేదా నీడ : మెయిన్ డోర్ ముందు భారీ వృక్షాలు ఉండకూడదు. ఆ చెట్టు నీడ నేరుగా ఇంటిపై పడటం కూడా వాస్తు దోషమే. దీనివల్ల కుటుంబంలో కలహాలు పెరిగే అవకాశం ఉంది.
- బావి లేదా ఆలయం : ఇంటి ముందు బావి ఉండటం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే గుడి గోపురం నీడ లేదా గుడికి సరిగ్గా ఎదురుగా ద్వారం ఉండటం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతాయి.
వాస్తు ప్రకారం…. ఇంటి ప్రధాన ద్వారం పరిమాణం కూడా చాలా ముఖ్యం. ఇంటి లోపల ఉండే తలుపుల కంటే ప్రధాన ద్వారం ఎప్పుడూ పెద్దదిగా ఉండాలి. ఒకవేళ మెయిన్ డోర్ చిన్నదిగా ఉండి, వెనుక తలుపులు పెద్దవిగా ఉంటే.. ఆ ఇంట్లో ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. సంపాదించిన డబ్బు నిలవదు, ఆర్థిక అస్థిరత ఏర్పడుతుంది.
సరైన దిశ ఏది….?
వాస్తు శాస్త్రం ప్రకారం….. ఇంటికి ప్రధాన ద్వారం ఉత్తర దిశలో ఉండటం అత్యంత శ్రేష్ఠం. ఉత్తర దిశ కుబేర స్థానం కాబట్టి ఐశ్వర్యం లభిస్తుంది. ఒకవేళ అది కుదరకపోతే తూర్పు లేదా ఈశాన్య (ఈశాన్యం) దిశల్లో ద్వారం ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఈ దిశల నుంచి వచ్చే గాలి, వెలుతురు ఇంటికి శుభ ఫలితాలను ఇస్తాయి.
మీరు కొత్త ఇల్లు కట్టుకుంటున్నా లేదా పాత ఇంట్లో నివసిస్తున్నా.. ప్రధాన ద్వారం ముందు ఎటువంటి అవరోధాలు లేకుండా చూసుకోవడం ద్వారా ఇంట్లో సుఖశాంతులను పెంపొందించుకోవచ్చని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

