Vastu: వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ఏ దిశలో ఉండాలి? ఇలా చేస్తే సంపద రెట్టింపు, కెరీర్ గ్రాఫ్ పైకి వెళ్తుంది!
Vastu: ఉద్యోగంలో నిరంతరం ఒత్తిడి వేధిస్తోందా? మీ డెస్క్‌పై ఒక చిన్న మనీ ప్లాంట్ మీ కెరీర్ గ్రాఫ్‌ను మార్చేయగలదు. వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ వల్ల కలిగే ఆ రెండు అద్భుత ప్రయోజనాలు, అది ఉండాల్సిన సరైన దిశ గురించి పూర్తి వివరాలు మీకోసం.
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఆఫీసు పని ఒత్తిడి సామాన్యుడి నుంచి ఉన్నతాధికారి వరకు అందరినీ వేధిస్తోంది. గంటల తరబడి కంప్యూటర్ స్క్రీన్ల ముందు కూర్చుని పని చేసే వారికి మానసిక ప్రశాంతత కరువవుతోంది. ఇలాంటి సమయంలో మన చుట్టూ ఉండే వాతావరణం సానుకూలంగా ఉంటే పని తీరు మెరుగుపడుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు మన ఆఫీస్ డెస్క్‌పై ఉండే చిన్నపాటి మొక్కలు ఎంతో తోడ్పడతాయి. ముఖ్యంగా 'మనీ ప్లాంట్' కేవలం అలంకరణకే కాదు, సానుకూల శక్తిని (Positive Energy) ఆకర్షించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.

ఆఫీస్ డెస్క్‌పై మనీ ప్లాంట్ ఉంచడం వల్ల కలిగే ఆ రెండు ప్రధాన ప్రయోజనాలు ఇవే:
1. నెగటివిటీకి చెక్.. పనిలో ఏకాగ్రత!
ఆఫీసులో ఎప్పుడూ టార్గెట్లు, డెడ్‌లైన్లు అంటూ వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డెస్క్‌పై ఉండే మనీ ప్లాంట్ ఒక 'స్ట్రెస్ బస్టర్'లా పనిచేస్తుంది. వాస్తు ప్రకారం, ఈ మొక్క మన చుట్టూ ఉండే ప్రతికూల శక్తిని (Negativity) గ్రహించి, వాతావరణాన్ని తేలికపరుస్తుంది.
మరో ఆసక్తికర అంశం ఏంటంటే, ఈ మొక్కకు ఉండే పచ్చని రంగు మన కళ్లకు, మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. దీంతో పనిపై ఏకాగ్రత పెరుగుతుంది. చుట్టూ ఉండే గాలిని శుద్ధి చేయడమే కాకుండా, కళ్ల అలసటను తగ్గించి ఉత్సాహంగా పని చేసేలా ప్రోత్సహిస్తుంది.
2. కెరీర్ ఎదుగుదల.. ఐశ్వర్య ప్రాప్తి
మనీ ప్లాంట్ ఎప్పుడూ పైవైపే పెరుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, మొక్క ఎదగడం అనేది జీవితంలో మనం సాధించే పురోగతికి సంకేతం. మీ డెస్క్‌పై ఉండే మనీ ప్లాంట్ ఎంత ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటే, మీ కెరీర్ గ్రాఫ్ కూడా అలాగే పైకి వెళ్తుందని నమ్ముతారు.
జ్యోతిష్య రీత్యా ఈ మొక్క శుక్ర గ్రహానికి సంబంధించింది. జాతకంలో లేదా వాస్తులో శుక్రుడు బలంగా ఉంటే సుఖ సంతోషాలు, ఐశ్వర్యం సిద్ధిస్తాయి. ఆఫీసులో మనీ ప్లాంట్ ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, రావలసిన బకాయిలు లేదా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది.
దిశ మారితే.. దశ మారుతుందా?
మనీ ప్లాంట్ ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. దిశ తప్పితే ఫలితం తారుమారయ్యే ప్రమాదం ఉంది.
సరైన దిశ: మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ ఆగ్నేయ దిశలో (South-East) ఉంచాలి. ఈ దిశకు అధిపతి వినాయకుడు, గ్రహం శుక్రుడు. కాబట్టి ఇక్కడ మొక్కను ఉంచితే అడ్డంకులు తొలగి శుభ ఫలితాలు అందుతాయి.

నిషేధిత దిశ: పొరపాటున కూడా ఈశాన్య దిశలో (North-East) ఈ మొక్కను పెట్టకండి. ఈ దిశలో మనీ ప్లాంట్ ఉంటే ఆర్థిక నష్టాలు కలగడమే కాకుండా, పెళ్లి సంబంధాలు చెడిపోయే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది.
మొక్కలను కేవలం అలంకారంగా చూడకుండా, వాటికి సరైన సంరక్షణ అందిస్తూ సరైన దిశలో ఉంచినప్పుడు మాత్రమే ఆశించిన ఫలితాలు వస్తాయి అని గుర్తు పెట్టుకోండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


