Lucky Rasis: ఏప్రిల్ 15 నుంచి 30 వరకు ద్వాదశ రాశుల ఫలితాలు, వారికి అదృష్ట సమయం!

ఏప్రిల్ రెండవ భాగంలో (15 నుంచి 30 వరకు) అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకోండి. కొంతమంది రాశులకు కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు, ప్రేమలో ఆనందం లభిస్తే, మరి కొంత మంది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. మీ రాశి ఫలితాలు చూసుకున్నారా?

Published on: Apr 15, 2026 12:30 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అప్పుడే ఏప్రిల్ 15 రోజులు పూర్తయ్యాయి, ఇంకో 15 రోజులు మిగిలి ఉన్నాయి. ఈ 15 రోజులు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి ప్రయోజనాలు కలుగుతాయి? ఏ రాశి వారికి నష్టాలు కలుగుతాయి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఏప్రిల్ రెండవ భాగం ఏ రాశి వారికి బాగా కలిసి రాబోతుందో చూసేయండి. మీరు కూడా సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటారో లేదో తెలుసుకోవచ్చు.

Lucky Rasis: ఏప్రిల్ 15 నుంచి 30 వరకు ద్వాదశ రాశుల ఫలితాలు, వారికి అదృష్ట సమయం! (pinterest)
Lucky Rasis: ఏప్రిల్ 15 నుంచి 30 వరకు ద్వాదశ రాశుల ఫలితాలు, వారికి అదృష్ట సమయం! (pinterest)

ఏప్రిల్ 15 నుంచి 30 వరకు ద్వాదశ రాశుల ఫలితాలు:

మేష రాశి:

మేష రాశి వారికి ఈ సమయంలో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది. కెరీర్‌లో పురోగతిని చూస్తారు. ఆర్థిక పరంగా లాభాలు ఉంటాయి. భవిష్యత్తు గురించి మంచి ప్రణాళికలు వేస్తారు.

వృషభ రాశి:

వృషభ రాశి వారికి కూడా ఈ సమయం బాగుంటుంది. ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. ప్రేమించిన వ్యక్తితో కనెక్ట్ అయి ఉంటారు. ఆనందం పెరుగుతుంది. ఆర్థిక పరంగా బాగుంటుంది. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు.

మిధున రాశి:

మిధున రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారికి క్రియేటివిటీ పెరుగుతుంది. కొత్త ఐడియాలతో ముందుకు వస్తారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. రిలేషన్‌షిప్‌లో కూడా ఇబ్బందులు ఉండవు.

కర్కాటక రాశి:

ఈ రాశి వారికి ఈ 15 రోజులు బాగుంటాయి. ఆర్థిక పరంగా స్థిరంగా ఉంటారు. అయితే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ప్రేమించిన వారితో కలిసి సంతోషంగా ఉంటారు.

సింహ రాశి:

సింహ రాశి వారికి ఈ సమయంలో కెరీర్‌లో మంచి అవకాశాలు వస్తాయి. మీ తోటి ఉద్యోగస్తులు, మీ స్నేహితులు అందరూ మీకు సపోర్ట్ ఇస్తారు. ఇంట్లో పరిస్థితులు కూడా బాగుంటాయి. ఆర్థిక పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాన్ఫిడెంట్‌గా ఉంటారు. ఏప్రిల్ చివరికి బ్యాలెన్స్‌డ్ సక్సెస్‌ను చూస్తారు.

కన్యా రాశి:

కన్యా రాశి వారు కంఫర్టబుల్‌గా ఉంటారు. ఆనందంగా ఉంటారు. ప్రేమ జీవితంలో ఆనందం పెరుగుతుంది. కెరీర్‌లో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థిక పరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆర్థిక పరంగా బాగుంటుంది. ఫోకస్‌తో అనుకున్న వాటిని పూర్తిచేస్తారు.

తులా రాశి:

తులా రాశి వారికి ఈ సమయం బాగుంటుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటారు. మీ సోషల్ నెట్‌వర్క్ కొత్త వ్యాపారాలను మొదలుపెట్టడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కెరీర్‌లో కూడా బాగా కలిసి వస్తుంది.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారు సహనంగా ఉండడం మంచిది. అప్పుడు ఆర్థిక పరంగా బాగుంటుంది. ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటే బాగా కలిసి వస్తుంది. అయితే కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల బాగుంటుంది. లేకపోతే లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ధనస్సు రాశి:

ధనస్సు రాశి వారు తేలికపాటి వ్యాయామాలు చేయడం వలన ఆరోగ్యం బాగుంటుంది. ఏప్రిల్ నెలలో మీరు చాలా ధైర్యంగా ఉంటారు. కొత్త ఆసక్తులు ఏర్పడతాయి. కెరీర్‌లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భయం లేకుండా ముందుకు వెళ్తే ఇబ్బందులు ఉండవు.

మకర రాశి:

మకర రాశి వారికి ఈ నెలలో పురోగతి ఉంటుంది. కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. తోటి ఉద్యోగస్తుల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి బాగుంటుంది. సహనంతో ఉంటే అన్ని చక్కబడతాయి. మొత్తానికి ఈ నెల మీరు మంచి ఎదుగుదలను చూస్తారు.

కుంభ రాశి:

కుంభ రాశి వారు ప్రేమ జీవితాన్ని దృఢంగా మార్చుకుంటారు. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా బాగుంటుంది.

మీన రాశి:

మీన రాశి వారికి కూడా ఇది శుభ సమయం. ఈ 15 రోజులు కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More