ఈ మొక్కలు కేవలం అందానికి మాత్రమే కాదు అదృష్టాన్ని కూడా పెంచుతాయి!

ఇంట్లో మొక్కలు అందానికే కాదు, అదృష్టాన్ని కూడా తీసుకొస్తాయి. ఈ మొక్కలను ఇంట్లో పెంచితే మాత్రం కేవలం అందమే కాదు, అదృష్టం కూడా పెరుగుతుంది. ప్రతికూల శక్తి తొలగి, సానుకూల శక్తి వ్యాపిస్తుంది. మరి ఆ మొక్కలు ఏవి, ఇంట్లో ఉంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. 

Published on: Mar 28, 2026, 16:00:32 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలామంది ఇళ్లల్లో మొక్కలను పెంచుతారు. ఇంట్లో మొక్కలు అందానికే కాదు, అదృష్టాన్ని కూడా తీసుకొస్తాయి. ఈ మొక్కలను ఇంట్లో పెంచితే మాత్రం కేవలం అందమే కాదు, అదృష్టం కూడా పెరుగుతుంది. మరి ఆ మొక్కలు ఏవి, ఇంట్లో ఉంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మొక్కలు కేవలం అందానికి మాత్రమే కాదు అదృష్టాన్ని కూడా పెంచుతాయి (pinterest)
ఈ మొక్కలు కేవలం అందానికి మాత్రమే కాదు అదృష్టాన్ని కూడా పెంచుతాయి (pinterest)

ఈ మొక్కలు కేవలం అందానికి మాత్రమే కాదు, అదృష్టాన్ని కూడా పెంచుతాయి

శంఖు పూల మొక్క

ఈ మొక్క పూలు నీలం రంగులో ఉంటాయి. ఈ మొక్క చూడడానికి చాలా బాగుంటుంది. చక్కటి పువ్వులతో ఇంటికి అందాన్ని పెంచుతుంది. ఈ మొక్క ఇంట్లో ఉండడం శుభప్రదం. ఈ మొక్క మానసిక ప్రశాంతతను పెంచి, ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఈ మొక్క ఇంట్లో ఉంటే సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది, అదృష్టం పెరుగుతుంది.

మల్లె పూల మొక్క

మల్లె పూలు ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తాయి. మల్లెపూల వాసన చాలా బాగుంటుంది. మానసిక ప్రశాంతతను మల్లె మొక్క పెంచుతుంది. సంపద, శ్రేయస్సును కూడా ఇది తీసుకొస్తుంది. కనుక ఈ మొక్క ఇంట్లో ఉండడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

తమలపాకు మొక్క

ఈ మొక్క కూడా ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. పూజలో తమలపాకులను ఎక్కువగా వాడతాము. పైగా ఔషధ గుణాలు కూడా ఉంటాయి. తమలపాకు మొక్క ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తి తొలగి, సానుకూల శక్తి వ్యాపిస్తుంది. అదృష్టం కూడా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికపరంగా కూడా లాభాలను పొందవచ్చు.

బంతి పూలు మొక్క

చాలా మంది ఇళ్లల్లో బంతి పూలు, చామంతి పూలను పెంచుతారు. బంతిపూల మొక్కలు ఇంట్లో ఉంటే చాలా మంచిది. ప్రతికూల శక్తి తొలగి, సానుకూల శక్తి వ్యాపిస్తుంది. అంతే కాదు, ఈ మొక్క ఇంట్లో ఉండడం వలన ఆర్థికపరంగా కూడా కలిసి వస్తుంది. అదృష్టం కూడా పెరుగుతుంది.

మనీ ప్లాంట్

మనీ ప్లాంట్‌ను ఇంట్లో పెంచితే సానుకూల శక్తి వ్యాపిస్తుంది. అదృష్టం కూడా పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం, సంపద, అభివృద్ధికి ఈ మొక్క సంకేతం. ఈ మొక్కను తూర్పు లేదా ఈశాన్యం వైపు పెంచితే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే విపరీతమైన లాభాలను కూడా పొందడానికి వీలవుతుంది.

నిరాకరణ: ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము చెప్పుకోము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More