Ugadi 2026 Mantras: ఉగాది నాడు ఈ శ్లోకాలు, మంత్రాలను పఠిస్తే సంపద, ఆనందం రెట్టింపు అవుతాయి!
కొత్త సంవత్సరం కలిసి రావాలని, సంతోషంగా ఉండాలని చాలా మంది భావించి ఉగాదిని ఎంతో ఆనందంగా మొదలు పెడతారు. ఉగాది నాడు సూర్యుడిని ఆరాధిస్తారు. ఉగాది నాడు లక్ష్మీదేవి, కుబేరుడు, విష్ణుమూర్తిని ఆరాధించడం వలన ధన ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆనందంగా ఉండొచ్చు. కొన్ని శ్లోకాలను పఠిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అలాగే ఉగాది అనేది కొత్త సంవత్సరం ప్రారంభం. కొత్త సంవత్సరం అన్ని కలిసి రావాలని, సంతోషంగా ఉండాలని చాలా మంది భావించి ఉగాదిని ఎంతో ఆనందంగా మొదలు పెడతారు. ఉగాది నాడు సూర్యుడిని ఆరాధిస్తారు. అలాగే ఉగాది నాడు లక్ష్మీదేవి, కుబేరుడు, విష్ణుమూర్తిని ఆరాధించడం వలన ధన ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆనందంగా ఉండొచ్చు.

అలాగే కొన్ని శ్లోకాలను ఉగాది (Ugadi 2026) నాడు పఠిస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతే కాకుండా ఆనందమైన జీవితాన్ని గడపొచ్చు, విజయాలను కూడా అందుకోవచ్చు. మరి ఉగాది నాడు వేటిని చదువుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి?
ఉగాది నాడు ఈ శ్లోకాలు పఠిస్తే సంపద, ఆనందం రెట్టింపు
ఉగాది రోజే కాదు, ఈ శ్లోకాలను మీకు నచ్చినప్పుడు చదువుకోవచ్చు. తప్పు లేదు. వీటిని చదివినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి, ధన ఐశ్వర్యాలు కలుగుతాయి, సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. ప్రతిరోజు లేదా శుక్రవారం నాడు వీటిని పఠిస్తే ఎంతో మంచిది. ఈ కొత్త ఏడాది అన్ని బాగా కలిసి రావాలన్నా, సంపద పెరగాలన్నా, సంతోషంగా ఉండాలని వీటిని చదువుకోండి.
వినాయక శ్లోకం:
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా
విఘ్నాలు తొలగిపోయి అడ్డంకులు ఏమీ లేకుండా విజయాలను చేరుకోవాలంటే ఖచ్చితంగా ఉగాది నాడు ఈ వినాయకుని శ్లోకాన్ని చదువుకోండి. ఈ శ్లోకాన్ని చదువుకోవడం వలన వినాయకుని అనుగ్రహంతో మీ పనిలో ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయి సకాలంలో పనులు పూర్తవుతాయి.
లక్ష్మీ ధ్యాన శ్లోకం:
కరగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ
కరమూలే స్థితా గౌరీ ప్రాతః కరదర్శనమ్
లక్ష్మీ ధ్యాన శ్లోకం చదువుకోవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే రోజు ఉదయం నిద్ర లేవగానే ఈ శ్లోకాన్ని పఠించండి. ఉగాది రోజు ఉదయం నిద్ర లేచేటప్పుడు కూడా ఈ శ్లోకాన్ని చదువుకోండి.
లక్ష్మీ గాయత్రి మంత్రం:
ఓం శ్రీ మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణు పత్న్యై చ ధీమహి
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్
లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని జపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ధన ప్రవాహం, ఆర్థిక స్థిరత్వం కలగాలంటే ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచిది.
కుబేర మంత్రం:
ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే
ధనధాన్యసమృద్ధిం మే దేహి దాపయ స్వాహా..
కుబేర మంత్రాన్ని చదివితే కూడా ఎంతో మంచి జరుగుతుంది. ధనాధిపతి అయినటువంటి కుబేరుని అనుగ్రహం కలుగుతుంది. ఆనందంగా ఉండవచ్చు. డబ్బుకి కూడా లోటు ఉండదు.
అష్టలక్ష్మి స్తోత్రం:
అష్టలక్ష్మి స్తోత్రం చదివితే ఐశ్వర్యం, బలం, జ్ఞానం కలుగుతాయి. అష్టలక్ష్మి స్తోత్రాన్ని ఉగాది నాడు చదువుకుంటే ఈ మూడింటినీ పొంది ఆనందంగా ఉండొచ్చు.
సర్వమంగళ మాంగల్యే:
సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే..
లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి సర్వమంగళ మాంగల్యే శ్లోకాన్ని కూడా చదువుకోండి. ఇది ఆనందం, అదృష్టాన్ని తీసుకువస్తుంది.
వెంకటేశ్వర మంత్రం:
"ఓం నమో వెంకటేశాయ నమః"
ఈ మంత్రాన్ని చదువుకుంటే సంపద పెరుగుతుంది. విజయాలను అందుకోవచ్చు. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది. జీవితంలో సక్సెస్‌ను కూడా అందుకోవచ్చు.
మహాలక్ష్మి అష్టకం:
మహాలక్ష్మి అష్టకం చదువుకుంటే చాలా మంచిదే. ముఖ్యంగా శుక్రవారం నాడు చదివితే మరింత శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ అష్టకాన్ని చదివితే అదృష్టం కూడా వెతుక్కుంటూ వస్తుంది. సంపద కూడా పెరుగుతుంది.
మహా మృత్యుంజయ మంత్రం:
మహా మృత్యుంజయ మంత్రాన్ని చదివితే రక్షణ, దుఃఖ నివారణ, అదృష్టం, ఆరోగ్యం, ఆనందం పొందవచ్చు. మహా మృత్యుంజయ మంత్రం చాలా శక్తివంతమైనది. ఇది శివుడికి అంకితం చేయబడినది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


