చైత్ర నవరాత్రులు: ఉగాది పర్వ దినం నాడు చేయాల్సిన పూజా విధానం.. పరాభవ నామ సంవత్సరం మొదటి రోజున ఇలా చేస్తే చాలా మంచిది!

చైత్ర నవరాత్రులు: తొమ్మిది రోజులు పాటు భక్తులు దుర్గాదేవి తొమ్మిది అవతారాలను ఆరాధిస్తారు. అలాగే ఉపవాసాలు ఉంటారు. ఇలా చేయడం వలన కుటుంబంలో ఐశ్వర్యం, శాంతి, ఆరోగ్యం కలుగుతాయని నమ్ముతారు. మార్చి 19 నుంచి మార్చి 27 వరకు చైత్ర నవరాత్రులు. మార్చి 19 నుంచి పరాభవ నామ సంవత్సరం మొదలవుతుంది.

Published on: Mar 17, 2026, 15:00:18 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విశ్వావసునామ సంవత్సరానికి స్వస్తి పలికి, పరాభవనమ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ ఏడాది ఉగాది పండుగ వచ్చిన విషయం తెలిసిందే. హిందువులు జరుపుకునే ముఖ్య పండుగల్లో చైత్ర నవరాత్రులు ఒకటి. తొమ్మిది రోజులు పాటు భక్తులు దుర్గాదేవి తొమ్మిది అవతారాలను ఆరాధిస్తారు. అలాగే ఉపవాసాలు ఉంటారు. ఇలా చేయడం వలన కుటుంబంలో ఐశ్వర్యం, శాంతి, ఆరోగ్యం కలుగుతాయని నమ్ముతారు. మార్చి 19 నుంచి మార్చి 27 వరకు చైత్ర నవరాత్రులు. మార్చి 19 నుంచి పరాభవ నామ సంవత్సరం మొదలవుతుంది.

చైత్ర నవరాత్రులు: ఉగాది పర్వ దినం నాడు చేయాల్సిన పూజా విధానం (pinterest)
చైత్ర నవరాత్రులు: ఉగాది పర్వ దినం నాడు చేయాల్సిన పూజా విధానం (pinterest)

చైత్ర శుక్ల పాడ్యమి ఉదయం 6:52కి ప్రారంభమవుతుంది, మార్చి 20 ఉదయం 4:52తో ముగుస్తుంది. మార్చి 19న కలశ స్థాపన చేసి నవరాత్రుల పూజలు మొదలుపెట్టాలి. ఉగాది నాడు తలస్నానం చేసి, కొత్త బట్టలు లేదా శుభ్రమైన దుస్తులు ధరించి పూజ చేసుకోవాలి. అలాగే పూజ అయిన తర్వాత ఉగాది పచ్చడిని స్వీకరించాలి. ఉగాది పచ్చడి తింటే షడ్రుచులను సమానంగా స్వీకరించాలి అనే సందేశం ఇస్తుంది. ప్రత్యేక గ్రహ స్థితుల మధ్య ఈ ఏడాది వసంత నవరాత్రులు మొదలవుతాయి. తొమ్మిది రోజులు కూడా నవరాత్రులను చాలా మంది నిష్ఠగా చేస్తారు.

చైత్ర నవరాత్రులు 2026

మొదటి రోజు (మార్చి 19): ఉత్తరాభాద్ర నక్షత్రం, శుక్ల యోగం వస్తోంది. ఆ రోజు కలశ స్థాపన చేసే పూజలు చేయాలి. మార్చి 19 ఉదయం 6:52 నుంచి 10:16 వరకు కలశ స్థాపన చేయడానికి శుభ ముహూర్తం. ఒకవేళ ఈ సమయంలో చేయలేకపోతే, 11:52 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు అభిజిత్ ముహూర్తంలో కలశ స్థాపన చేసుకోవచ్చు.

చైత్ర నవరాత్రులు పూజా విధానం:

నవరాత్రులు ప్రారంభానికి ముందు రోజు పసుపు, కుంకుమ, గంధం, పూలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలను సిద్ధం చేసుకోండి. తర్వాత రోజు, అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ప్రభాత సమయంలో శ్రీరాముడిని, లలితాదేవిని, పరమేశ్వరుడిని ఆరాధించే సంకల్పం చెప్పుకోండి.

మొదట వినాయకుడిని ఆరాధించి, ఆ తర్వాత దేవి మంత్రాలను తొమ్మిది రోజులు జపించాలి.

గౌరీ పంచాక్షరి, షోడషీ మంత్రాలు, బాల షడాక్షరి, పంచదశి ఇవి దేవికి సంబంధించినవి. కాబట్టి వీటిని చదువుకోవచ్చు.

అష్టోత్తర శతనామావళి, సహస్రనామావళితో అమ్మవారిని ఆరాధించి, ధూపం, దీపం, నైవేద్యాలను సమర్పించాలి.

చివరగా నీరాజనాలను కూడా సమర్పించాలి. వసంత నవరాత్రుల చివరి రోజు శ్రీరామనవమి. ఆ రోజుతో నవరాత్రులు ముగుస్తాయి.

ఉగాది పూజా విధానం:

ఉగాది నాడు ఇంటిని శుభ్రంగా కడుక్కొని, మామిడి ఆకులు, పూలతో తోరణాలు కట్టుకోండి.

ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయండి. ఉదయం స్నానం చేసే ముందు ఆవుపేడతో కల్లాపు జల్లాలి.

అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి.

ఉగాది సూర్యుడికి సంబంధించిన పండుగ కాబట్టి సూర్యుడికి ప్రత్యేకంగా నైవేద్యం సమర్పించాలి.

ఇంటి ఇలవేల్పుని కూడా ప్రత్యేకంగా ఉగాది నాడు పూజించాలి.

పూజ అయిపోయిన తర్వాత షడ్రుచుల ఉగాది పచ్చడిని స్వీకరించాలి. ఇలా ఉగాది నాడు ఆచరించడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయి. సుఖసంతోషాలు, సౌభాగ్యం, విజయాలు లభిస్తాయి. కొత్త పనులు ప్రారంభించడానికి కూడా ఇది చాలా మంచి రోజు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More