Capricorn Ugadi Horoscope: ఈ ఉగాది నుంచి మకర రాశికి ఎలా ఉంటుంది? నెలల వారీగా ఫలితాలతో పాటు పరిహారాలు తెలుసుకోండి!

పరాభవ నామ సంవత్సరం కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. ఇక విశ్వావసు నామ సంవత్సరంలోకి వచ్చేసే సమయం ఆసన్నమవుతోంది. పరాభవ నామ సంవత్సరంలో 12 రాశుల వారికి వారి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. మరి ఈరోజు మకర రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.

Published on: Mar 17, 2026, 10:00:15 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పరాభవ నామ సంవత్సరంలోకి (Ugadi 2026) అడుగుపెట్టబోతున్నాము. పరాభవ నామ సంవత్సరం కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది, అనేక లాభాలను తీసుకురాబోతుంది. ఇక విశ్వావసు నామ సంవత్సరంలోకి వచ్చేసే సమయం ఆసన్నమవుతోంది. పరాభవ నామ సంవత్సరంలో 12 రాశుల వారికి వారి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. మరి ఈరోజు మకర రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.

మకర రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? (pinterest)
మకర రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? (pinterest)

మకర రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది?

పంచాంగ గణనాల ప్రకారం గురువు జూన్ నుంచి ఏడవ స్థానంలో అనుకూలంగా సంచరిస్తాడు. శని మూడవ స్థానంలో అనుకూలంగా సంచరిస్తాడు. డిసెంబర్ దాకా రెండవ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత జన్మరాశిలో సంచరిస్తాడు. కేతువు డిసెంబర్ వరకు అష్టమ స్థానంలో సంచరిస్తాడు. వీటి ఆధారంగా చూసినట్లయితే మకర రాశి వారికి పరాభవ నామ సంవత్సరం మధ్యస్థంగా ఉంటుంది. కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న వారు సమస్యల నుంచి బయటపడతారు.

ఒత్తిడులు, చికాకులు, గొడవలు ఉండవచ్చు

ఏలిననాటి శని పూర్తి అయినా కూడా గురువు, రాహువు, కేతువు లాంటి గ్రహాలు చెడు దృష్టి ప్రభావం కారణంగా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే గురువు కళత్ర స్థానంలో ఉండడం వలన కాస్త మధ్యస్థ ఫలితాలను పొందుతారు. ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కోపాన్ని కూడా తగ్గించుకోవడం అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు రాజకీయ ఒత్తిడులు, చికాకులు, గొడవలు వంటివి కలగవచ్చు.

విద్యార్థులకు ఎలా ఉంటుంది?

విద్యకు సంబంధించిన విషయాలను చూస్తే మకర రాశి విద్యార్థులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకు కూడా ఎన్నో మార్పులు వస్తాయి, శుభ ఫలితాలను పొందుతారు. మకర రాశి స్త్రీలు గొడవలకు దూరంగా ఉంటే మంచిది. కుటుంబ సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారంలో మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. శుభకార్యాలు వంటివి మకర రాశి వారి కుటుంబంలో ఈ ఏడాది బాగా జరుగుతాయి. అవసరానికి ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంగారం, వజ్రాలు వంటి వాటిలో పెట్టుబడి పెడితే కలిసి వస్తుంది.

పరిహారాలు

శుభ ఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించండి. దుర్గాదేవిని కూడా ఆరాధిస్తే మంచిది. ఏదైనా శక్తి పీఠాలను సందర్శిస్తే కూడా ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. సంకటనాశన గణపతి స్తోత్రం, నవగ్రహ పీడాహార స్తోత్రం పారాయణం చేస్తే మంచిది. ఇప్పుడు మకర రాశి వారి నెలవారీ ఫలితాలు కూడా చూద్దాం.

మకర రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? మార్చి 2026 నుంచి ఏప్రిల్ 2027 వరకు నెలలు వారీగా ఫలితాలు

మార్చి, ఏప్రిల్ 2026: ఈ నెలల్లో మీకు మధ్యస్థంగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉండొచ్చు. ఉద్యోగస్తులకు అధికారులతో మాట పట్టింపులు ఉండొచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా తగ్గుతుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. స్త్రీలకు చికాకులు ఎక్కువ అవుతాయి.

మే 2026:నెల మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. నూతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహన ప్రమాదాలు జరగవచ్చు. ఉద్యోగులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు మానసిక విచారం ఉంటుంది. అధికారుల ద్వారా ఒత్తిడి పెరుగుతుంది.

జూన్ 2026: ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్లు, ధనలాభం వంటివి చూస్తారు. ఎప్పటినుంచో వాయిదా వేసిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. తండ్రికి అనారోగ్య సమస్యలు రావచ్చు. వివాహం కాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది.

జూలై 2026: ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయాలను అందుకుంటారు. భయాందోళనలు తగ్గుతాయి. గౌరవం పెరుగుతుంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. ఈ నెలలో ఇతరులకు బాగా సహాయం చేస్తారు. వ్రతాలు, పూజలు చేస్తారు. గృహ మార్పులు కూడా ఉండొచ్చు.

ఆగస్టు 2026: ఈ నెల మీకు అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు భారీగా లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు కూడా అనుకూలం. ధనలాభం కలుగుతుంది. స్త్రీలకు కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి.

సెప్టెంబర్ 2026: ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. మిత్రుల ద్వారా సహాయ సహకారాలను పొందుతారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. స్త్రీలకు ఈ నెల బాగా అనుకూలంగా ఉంటుంది.

అక్టోబర్ 2026: ఉద్యోగ పరంగా, వృత్తి పరంగా అనుకూలంగా ఉంటుంది. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. గృహప్రవేశం, నూతన కార్యాలు ప్రారంభిస్తారు. ఆర్థిక లాభాలు ఉంటాయి. ఈ నెల స్త్రీలకు బాగా అనుకూలంగా ఉంటుంది. తండ్రి ఆరోగ్యం ఇబ్బంది పెట్టొచ్చు.

నవంబర్ 2026: ఈ నెల మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఎవరినీ అనవసరంగా నమ్మకండి. ఆర్థికపరంగా రుణాలు తీసుకోవాల్సి రావచ్చు. చికాకులు పెరుగుతాయి. మిత్రులు శత్రువులుగా మారవచ్చు. స్త్రీలకు వాత సంబంధిత అనారోగ్య సమస్యలు కలగవచ్చు.

డిసెంబర్ 2026: ఈ నెల మీకు అనుకూలంగా లేదు. గౌరవ మర్యాదలు తగ్గుతాయి. రుణ సమస్యలు పెరుగుతాయి. మానసిక ఆందోళన ఉంటుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. సంతాన పరంగా కూడా సమస్యలు ఎదురవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.

జనవరి 2027: ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. అన్నిట్లో శుభ ఫలితాలను పొందుతారు. ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. బంధుమిత్రుల రాకతో ఆనందం పెరుగుతుంది. గత రెండు నెలలుగా పడిన ఇబ్బందుల నుంచి ఈ నెలలో కోలుకుంటారు.

ఫిబ్రవరి 2027: ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి విషయంలో ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు పెద్దవిగా మారి బాధించవచ్చు.

మార్చి, ఏప్రిల్ 2027: మీకు పూర్తిగా అనుకూలంగా ఉండదు. అభివృద్ధి ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. సోదర వైరం ఏర్పడవచ్చు. ఆర్థికపరంగా లాభాలు ఉంటాయి. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సహనంతో వ్యవహరిస్తే మంచిది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More