Ugadi 2026: ఉగాది రోజు ఏ రంగులు ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? తప్పక చెయ్యాల్సిన 7 పనులు ఏవో తెలుసుకోండి!
కొత్త సంవత్సరం ఉగాది పండుగ నాడు ఈ రంగులు అదృష్టాన్ని తీసుకువస్తాయి. ఈ రంగులను ధరించడం వలన అనేక లాభాలను పొందవచ్చు. అభివృద్ధిని చూడచ్చు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆయురారోగ్యాలు కూడా లభిస్తాయి. మరి ఆ రంగుల గురించి ఇప్పుడే చూసేద్దాం. ఉగాది తేదీ, సమయంతో పాటు తప్పక చేయాల్సినవి ఇవిగో.
కొత్త తెలుగు సంవత్సరంలో అన్ని బాగా కలిసి రావాలని చాలా మంది కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఈ ఏడాది ఉగాది పండుగ మార్చి 19న వచ్చింది. ఉగాది నాడు చాలా మంది ఇష్ట దైవాన్ని ఆరాధించి ఆలయానికి వెళ్లి పూజ చేయించుకుంటారు. అలాగే ఉగాది నాడు ఉగాది పచ్చడి తిని అన్నింటినీ సమానంగా స్వీకరించాలని తెలుసుకుంటారు. ఉగాది నాడు కొన్ని రంగులు అదృష్టాన్ని తీసుకువస్తాయి. మరి ఉగాది నాడు ఏ రంగులు ధరిస్తే మంచిది? జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న విషయాలను వివరంగా తెలుసుకుందాం.

కొత్త సంవత్సరం ఉగాది పండుగ నాడు ఈ రంగులు అదృష్టాన్ని తీసుకువస్తాయి. ఈ రంగులను ధరించడం వలన అనేక లాభాలను పొందవచ్చు. అభివృద్ధిని చూడచ్చు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆయురారోగ్యాలు కూడా లభిస్తాయి. మరి ఆ రంగుల గురించి ఇప్పుడే చూసేద్దాం.
ఈ రంగులు ఉగాది నాడు విపరీతమైన అదృష్టంతో పాటు అనేక లాభాలను తీసుకొస్తాయి
ఆకుపచ్చ – ఇది ప్రకృతిని సూచిస్తుంది. ఆకుపచ్చ రంగును ఉగాది నాడు ధరించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆకుపచ్చ రంగుతో అద్భుతాలను సృష్టించచ్చు.
పసుపు రంగు – పసుపు రంగు మంగళకరమైనది. ఏ పండుగ అయినా సరే చాలామంది పసుపును వాడతారు. అలాగే పసుపుతో వినాయకుడిని చేస్తాము. పసుపు అనేది ప్రతి పండుగకు ఎంతో ప్రత్యేకమైనది. సంపద, ఆనందం, ఆరోగ్యాన్ని ఇది తీసుకువస్తుంది. ఉగాది నాడు పూజలు చేసేటప్పుడు పసుపు రంగు దుస్తులను ధరించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
ఎరుపు రంగు – ఎరుపు రంగు శక్తి, ఉత్సాహానికి ప్రతీక. ఉగాది పండుగ నాడు ఈ రంగు దుస్తులను ధరిస్తే ఆనందం, ఉత్సాహం పెరుగుతుంది.
తెలుపు లేదా క్రీమ్ కలర్ – ఈ రంగులు ప్రశాంతతను సూచిస్తాయి. పవిత్రతను తెలుపుతాయి. పరాభవ సంవత్సరం బాగా కలిసి రావాలని, ప్రశాంతంగా ఈ ఏడాదిని ప్రారంభించాలనుకునే వారు ఈ దుస్తులను ధరించడం మంచిది.
కాషాయ రంగు – కాషాయ రంగు ఆధ్యాత్మికతను సూచిస్తుంది. చాలా మంది దేవాలయాలను సందర్శించేటప్పుడు, ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఈ రంగును ధరిస్తారు. ఇది కూడా శుభప్రదమైన రంగు. ఉగాదినాడు ధరించవచ్చు.
ఉగాది తేదీ, సమయంతో పాటు తప్పక చేయాల్సినవి ఇవిగో:
ఉగాది మార్చి 19 గురువారం నాడు వచ్చింది. చైత్ర శుద్ధ పాడ్యమి మార్చి 18 రాత్రి 10:45కి ప్రారంభమై, మార్చి 19 రాత్రి 8:30తో ముగుస్తుంది. పూజ చేసుకోవడానికి సరైన సమయం ఉదయం 6:15 నుంచి 8:45 వరకు.
- ఉదయం బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి దేవుడిని ఆరాధించండి.
- గుమ్మం ముందు ముగ్గు వేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది శుభ సూచికం.
- గుమ్మానికి మామిడి ఆకులతో తొరణం కట్టితే శుభశక్తి కలుగుతుంది.
- బెల్లం, మామిడి, వేపపువ్వు, చింతపండు, మిరప, ఉప్పుతో కలిసి ఉగాది పచ్చడి తినాలి.
- పూలు, పండ్లను దేవుడికి సమర్పించి కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలి.
- పంచాంగం వినాలి.
- పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదం పొందాలి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


