Ugadi Tula rasi Horoscope: ఉగాది నుంచి తులా రాశికి ఎలా ఉంటుంది? మార్చి 2026 నుంచి ఏప్రిల్ 2027 దాకా నెలల వారీగా ఫలితాలు!

Ugadi Tula rasi Horoscope: ఈ కొత్త సంవత్సరం 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. తులా రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఎలా ఉంటుంది? ఈ రాశి వారికి కలిగే లాభాలు, నష్టాలు వివరాలను పూర్తిగా తెలుసుకుందాం. ఉద్యోగస్తులకు ఈ ఏడాది బాగా కలిసి వస్తుంది. ప్రమోషన్‌లు, పదవులు, ట్రాన్స్ఫర్లు అనుకూలం.

Published on: Mar 15, 2026 10:06 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మరికొన్ని రోజుల్లో పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ కొత్త సంవత్సరం 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. ఈరోజు తులా రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఎలా ఉంటుంది? ఈ రాశి వారికి కలిగే లాభాలు, నష్టాలు వంటి వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.

Ugadi Tula rasi Horoscope: ఉగాది నుంచి తులా రాశికి ఎలా ఉంటుంది? (pinterest)
Ugadi Tula rasi Horoscope: ఉగాది నుంచి తులా రాశికి ఎలా ఉంటుంది? (pinterest)

తులా రాశి వారికి పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది?

పరాభవ నామ సంవత్సరంలో తులా రాశి వారికి అనేక ప్రయోజనాలు కలగబోతున్నాయి. గురువు జూన్ నుంచి దశమ స్థానంలో సంచరించడం వలన అనుకూలంగా ఉంటుంది. అలాగే శని ఆరవ స్థానంలో, రాహువు డిసెంబర్ దాకా ఐదవ స్థానంలో, ఆ తర్వాత నాలుగవ స్థానంలో ఉంటాడు. కేతువు డిసెంబర్ దాకా లాభ స్థానంలో ఉంటాడు. ఇలా చూసినట్లయితే తులా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

లాభదాయక ఫలితాలు

ఉద్యోగస్తులకు ఈ ఏడాది బాగా కలిసి వస్తుంది. ప్రమోషన్‌లు, పదవులు, ట్రాన్స్ఫర్లు వంటివి అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధిలో ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. విదేశీ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ప్రతి ప్రయత్నంలో కూడా లాభదాయక ఫలితాలు పొందుతారు.

విజయాలు, పదవులు

స్త్రీలకు ఉద్యోగాభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, ఆనందం కలుగుతాయి. ముఖ్యమైన పనులను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. తులా రాశి వారికి ఉన్నత పదవులు కూడా కలిసొస్తాయి. రైతులకు లాభం ఉంటుంది. పంటకు గిట్టుబాటు ధరలు లభిస్తాయి. సినీ రంగం, మీడియా వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. విజయాలు ఉంటాయి, ధన లాభం ఉంటుంది.

పరిహారాలు

ఈ రాశి వారు లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సందర్శనతో మంచి ఫలితాలను పొందుతారు. కనకధార స్తోత్రం పఠిస్తే మంచిది. ఇక నెలవారీ ఫలితాలు కూడా చూద్దాం.

తులా రాశి వారికి మార్చి 2026 నుంచి ఏప్రిల్ 2027 వరకు ఎలా ఉండబోతుంది?

మార్చి- ఏప్రిల్ 2026:

వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధి కలుగుతుంది. ఈ రాశి వారు అధికారులతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు రావచ్చు.

మే 2026:

వృత్తి, ఉద్యోగ పరంగా ఈ రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. మిత్రులతో వాదన వాదనలు జరుగుతాయి. అలాగే ఉద్యోగస్తులకు ఇబ్బందులు రావచ్చు. భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్థలు కలిగే అవకాశం ఉంది. భూ లాభం ఉంటుంది. స్త్రీలకు లాభం ఉంటుంది.

జూన్ 2026:

ఈ నెల ఈ రాశి వారికి బాగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ధన లాభం కలుగుతుంది. అయితే అప్పులు చేయాల్సిన పరిస్థితులు కూడా కలుగుతాయి. ఆకస్మిక ఖర్చులు ఎక్కువవుతాయి. కాబట్టి అన్ని పనులను జాగ్రత్తగా చేయాలి.

జూలై 2026:

ఈ నెల ఈ రాశి వారికి అంత అనుకూలంగా లేదు. ఇబ్బందులు కలగవచ్చు. బంధువులతో విరోధాలు కలిగే అవకాశం ఉంది. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది.

ఆగస్టు 2026:

ఈ నెలలో ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ పరంగా అనుకూలంగా లేదు. కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆందోళన ఎక్కువగా ఉంటుంది. బంధువులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. రుణదాతల ఒత్తిడి కూడా పెరుగుతుంది.

సెప్టెంబర్ 2026:

ఈ నెల కూడా ఈ రాశి వారికి అంతగా అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు చికాకులు ఉండొచ్చు. తోటి ఉద్యోగస్తులతో సఖ్యత ఉండకపోవచ్చు. స్త్రీల విషయంలో కుటుంబంలో కలహాలు ఎక్కువగా ఉంటాయి. నింద పడే అవకాశం ఉంది.

అక్టోబర్ 2026:

ఈ నెలలో మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ పరంగా అనుకూలంగానే ఉంటుంది. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల సపోర్ట్ ఉంటుంది. నూతన పరిచయాల కారణంగా అపవాదులు కలగవచ్చు.

నవంబర్ 2026:

ఈ నెల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధిని చూస్తారు. ధన లాభం కలుగుతుంది. నూతన స్త్రీ పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ రావచ్చు. స్త్రీలకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.

డిసెంబర్ 2026:

ఈ నెలలో ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ధన లాభం కూడా ఉండొచ్చు. ఈ మాసం ఈ రాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది.

జనవరి 2027:

ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది. అలసట, నిద్రలేమి వంటివి కలుగుతాయి. రుణబాధలు ఉంటాయి. ధన వ్యవహారాల్లో మధ్యవర్తిత్వం ఏమాత్రం మంచిది కాదని గుర్తుంచుకోండి. వృత్తి, ఉద్యోగాల్లో ఇబ్బందులు, చికాకులు పెరగవచ్చు. అలసట, నిద్రలేమి ఉండొచ్చు. రుణబాధలు పెరుగుతాయి.

ఫిబ్రవరి 2027:

ఈ నెల ఈ రాశి వారికి అనుకూలంగా ఉండదు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. ఏ పని చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. స్త్రీలకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది.

మార్చి 2027 – ఏప్రిల్ 2027:

ఈ నెలలో మీకు అనుకూలంగా లేదు. ఇబ్బందులు ఉండొచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు ఉండవు. స్త్రీలకు చికాకులు, సమస్యలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్థలు కలిగే అవకాశం ఉంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More