Ugadi 2026: పరాభవ నామ సంవత్సరం మిథున రాశి ఉగాది ఫలితాలు.. ధన లాభం, ఉద్యోగాలు, విజయాలు!
పరాభవ నామ సంవత్సరం మిథున రాశి వారి ఫలితాలు: మరి కొన్ని రోజుల్లో విశ్వావసు నామ సంవత్సరం పూర్తి కాబోతోంది. పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది, కెరీర్, డబ్బు, వ్యాపారంతో పాటు కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం.
పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉంటుంది? మరి కొన్ని రోజుల్లో విశ్వావసు నామ సంవత్సరం పూర్తి కాబోతోంది. పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది, కెరీర్, డబ్బు, వ్యాపారంతో పాటు కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం.
Ugadi 2026: పరాభవ నామ సంవత్సరం మిథున రాశి ఉగాది ఫలితాలు (pinterest)
పరాభవ నామ సంవత్సరం మిథున రాశి వారి ఫలితాలు
ఈ రాశి వారికి గురువు జూన్ 1 దాకా జన్మస్థానంలో సువర్ణమూర్తిగా ఉండి విశేషంగా శుభ ఫలితాలను ఇస్తాడు. జూన్ 2 నుంచి ద్వితీయ స్థానంలో గురువు సామాన్య ఫలితాలు ఇస్తాడు. రాహువు, కేతువులు డిసెంబర్ 5 దాకా దశమ, చతుర్థ స్థానాల్లో లోహమూర్తులుగా ఉండడంతో ధన వ్యయం కలుగుతుంది. డిసెంబర్ 6 నుంచి సౌభాగ్యకరమైన ఫలితాలు కలుగుతాయి. ఈ తెలుగు సంవత్సరం ప్రారంభంలో రచయితలుగా, న్యాయమూర్తులుగా, విదేశీ రాయబార కార్యక్రమాల్లో పనిచేసే వారికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి.
ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్ రంగాల ఉద్యోగులు కూడా ఈ కొత్త సంవత్సరంలో బాగా రాణిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ వస్తుంది, వృద్ధి అవకాశాలు కనిపిస్తాయి. పరిశోధనలకు విదేశీ మార్గం, ద్రవ్యము, గుర్తింపు లభిస్తాయి. గతంలో పొదుపు చేసినట్లయితే వారికి ధనం చేతికి వస్తుంది. కుటుంబ బాధ్యతలను సక్రమంగా సహనంతో నిర్వహిస్తారు. పెద్దలను గౌరవిస్తారు. జూలై 26 నుంచి డిసెంబర్ 11 వరకు రేవతి, ఉత్తరాభాద్ర నక్షత్రాలలో శని వక్రంగా సంచరించడం వలన వ్యాపారులకు బాగుంటుంది. బ్యాంకింగ్ రంగం, బ్యాంకు ఉద్యోగస్తులు కాస్త అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. ఇక నెలవారీ ఫలితాలు కూడా చూద్దాం.
పరాభవ నామ సంవత్సరం మిథున రాశి వారి నెలవారీ ఫలితాలు
మార్చి 2026
ఈ రాశి వారికి మార్చిలో తండ్రితో మంచి సంబంధాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాల పట్ల ఉత్సాహాన్ని చూపిస్తారు.
ఏప్రిల్ 2026
సంతానం చేతికి అంది వస్తుంది. ఉన్నత ఆలోచనలతో ప్రారంభిస్తారు. గ్రంథ పఠనం, భావ వ్యక్తీకరణ అలవాటవుతాయి. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
మే 2026
మే 2026లో ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
జూన్ 2026
మీ ప్రవర్తన, మాట తీరు, మర్యాద, హాస్య చతురత కారణంగా అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మీడియా, సినీ, వ్యాపారాల్లో ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో కూడా ముందుంటారు.
జూలై 2026
ఉదర, నేత్ర సమస్యలతో బాధ పడాల్సి ఉంటుంది. బంధుమిత్రుల కారణంగా ఖర్చు ఎక్కువ అవ్వచ్చు. శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. గుర్తింపు లభిస్తుంది.
ఆగస్టు 2026
ఆగస్టు 2026లో ఈ రాశి వారి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులను కలుస్తారు. ఇతరులను ఒప్పించి రాయబారం చేసే సామర్థ్యం కూడా కలిగి ఉంటారు. సంతోషంగా ఉంటారు. స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు.
సెప్టెంబర్ 2026
ఇతరులను బాగా మెప్పిస్తారు. క్రీడల్లో కూడా బాగా రాణిస్తారు. ఆదాయ మార్గాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆర్థిక వికాసం ఉంటుంది. గొంతు సంబంధిత వైద్యులను సంప్రదించే అవకాశాలు ఈ నెలలో కనిపిస్తున్నాయి.
అక్టోబర్ 2026
జూదం వంటి మార్గాల్లో డబ్బు సంపాదిస్తున్నట్లయితే పూర్తిగా వదిలిపెట్టడం మంచిది. స్త్రీలకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. స్టాక్ మార్కెట్ల ద్వారా ఆశాజనకంగా డబ్బు సంపాదిస్తారు. ఆకస్మిక లాభాలు చూస్తారు.
నవంబర్ 2026
మిత్రవర్గంలో మీకు ప్రత్యేక గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు వస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. అపారమైన ఆనందాన్ని పొందుతారు. సంతానం పట్ల శ్రద్ధ వహిస్తారు. వారి బాగోగులను కూడా జాగ్రత్తగా చూసుకుంటారు.
డిసెంబర్ 2026
ఈ నెల రెండవ భాగంలో శత్రువులు, ప్రత్యర్థులపై విజయాలను అందుకుంటారు. సంపద పెరుగుతుంది. కృషి, అంకితభావాన్ని గుర్తిస్తారు. ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
జనవరి 2027
జనవరి నెలలో వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. విజయాలను అందుకుంటారు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ పరిష్కరిస్తారు. ఆర్థిక వికాసం ఉంటుంది.
ఫిబ్రవరి 2027
సరైన ఆలోచన, తగిన క్రియాశీలతతో కష్టమైన పరిస్థితులను కూడా సులువుగా అధిగమిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్పష్టంగా మాట్లాడతారు. భావాలను వ్యక్తీకరిస్తారు. ఇతరులతో మీ జ్ఞానాన్ని పంచుకుంటారు.
మార్చి 2027
సమయానికి తగ్గట్టుగా పని చేస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉన్నత పదవిని చేపడతారు. మీ అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా పెట్టకండి.
పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More