Jupiter Direct Transit: మార్చి 11న గురువు ప్రత్యక్ష సంచారం.. ఐదు రాశులకు గోల్డెన్ డేస్!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువు ప్రస్తుతం మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. మార్చి 11 ఉదయం 6:17కు గురువు ప్రత్యక్ష సంచారం చేస్తాడు. ఇది కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలను తీసుకు వచ్చే అవకాశం ఉంది. గురువు ప్రత్యక్ష సంచారం ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోందో చూసుకోండి.

Published on: Mar 3, 2026, 12:00:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మంచి ఫలితాలు, చెడు ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 12 రాశుల వారిపై గ్రహాల ప్రభావం ఉంటుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువు ప్రస్తుతం మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. మార్చి 11 ఉదయం 6:17కు గురువు ప్రత్యక్ష సంచారం చేస్తాడు. ఇది కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలను తీసుకు వచ్చే అవకాశం ఉంది. గురువు ప్రత్యక్ష సంచారం ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోందో, ఆ అదృష్ట రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

మార్చి 11న గురువు ప్రత్యక్ష సంచారం.. ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు (pinterest)
మార్చి 11న గురువు ప్రత్యక్ష సంచారం.. ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు (pinterest)

మార్చి 11న గురువు ప్రత్యక్ష సంచారం.. ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు

1.మేష రాశి:

మేష రాశి వారికి గురువు ప్రత్యక్ష సంచారం బాగా కలిసి వస్తుంది. అదృష్టం పెరుగుతుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశి వారు శుభవార్తలను వింటారు. పెండింగ్‌లో ఉన్న పనులను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది.

2.మిథున రాశి:

మిథున రాశి వారికి గురువు ప్రత్యక్ష సంచారం విపరీతమైన లాభాలను కలిగిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. వ్యాపారస్తులకు కూడా ఇది శుభప్రదమైన సమయం. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది.

3.సింహ రాశి:

సింహ రాశి వారికి గురువు ప్రత్యక్ష సంచారం శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు సక్సెస్‌ను అందుకుంటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పాత అప్పులు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

4.తులా రాశి:

తులా రాశి వారికి కూడా ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. భూమిని కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేయడానికి కూడా ఇది శుభ సమయం. వైవాహిక జీవితంలో ఉన్న టెన్షన్స్ తొలగిపోతాయి. శుభవార్తలను వింటారు. పిల్లల నుంచి కూడా శుభవార్తలు అందుతాయి. ఆనందం పెరుగుతుంది.

5.ధనస్సు రాశి:

ధనస్సు రాశి వారికి గురువు ప్రత్యక్ష సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. అదృష్టం పెరుగుతుంది. పని ప్రదేశంలో కూడా ఆనందం ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. స్టార్ట్‌అప్ లేదా బిజినెస్‌ను ప్రారంభించడానికి ఇది శుభ సమయం. మార్చి 11న గురువు ప్రత్యక్ష సంచారం మీ ఆనందాన్ని కూడా పెంచుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More