శివ పురాణం: శివరాత్రి నాడు ఇలా చేస్తే ధన లాభం కలుగుతుంది.. లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకు లోటు ఉండదు!

శివ పురాణంలో ధన లాభం కలగడానికి, సమస్యలు తొలగిపోవడానికి కొన్ని ఉపాయాల గురించి తెలియజేయడం జరిగింది. శివుడికి సంబంధించి ఎన్నో పురాణాలు ఉన్నా, శివ పురాణం చాలా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మన కోరికలు నెరవేరడానికి పరిహారాల గురించి ఇందులో చెప్పారు. ధన లాభం కలగాలంటే శివ పురాణం ప్రకారం పాటించడం మంచిది.

Published on: Feb 12, 2026 8:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శివరాత్రి నాడు పరమేశ్వరుని అనుగ్రహం కలగాలంటే శివుని ప్రత్యేకించి ఆరాధించాలి. అలాగే కొన్ని పరిహారాలను పాటిస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. శివ పురాణంలో ధన లాభం కలగడానికి, సమస్యలు తొలగిపోవడానికి కొన్ని ఉపాయాల గురించి తెలియజేయడం జరిగింది. శివుడికి సంబంధించి ఎన్నో పురాణాలు ఉన్నా, శివ పురాణం చాలా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మన కోరికలు నెరవేరడానికి పరిహారాల గురించి ఇందులో చెప్పారు. ధన లాభం కలగాలంటే శివ పురాణం ప్రకారం వీటిని శివరాత్రి నాడు పాటించడం మంచిది.

శివ పురాణం: శివరాత్రి నాడు ఇలా చేస్తే ధన లాభం కలుగుతుంది (pinterest)
శివ పురాణం: శివరాత్రి నాడు ఇలా చేస్తే ధన లాభం కలుగుతుంది (pinterest)

శివరాత్రి 2026

ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 15, ఆదివారం నాడు వచ్చింది. ఆ రోజు శివుడిని ఆరాధించి, ఉపవాసం ఉండి జాగరణ చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కొన్ని పరిహారాలను పాటిస్తే కూడా మంచి జరుగుతుంది.

అక్షింతలను సమర్పించండి:

శివుడికి అక్షింతలను సమర్పించండి. విరిగిపోయిన వాటిని సమర్పించకూడదు. శివ పూజలో అక్షింతలను ఉపయోగించడం వలన శివుని అనుగ్రహం కలుగుతుంది. బియ్యానికి శుక్ర గ్రహంతో సంబంధం ఉంటుంది. శుక్రుడు డబ్బు, విలాసాలు, సంతోషం మొదలైన వాటికి కారకుడు. కనుక శివుడికి బియ్యం లేదా అక్షింతలను సమర్పిస్తే ధనలాభం కలుగుతుంది. శుభ ఫలితాలను పొందవచ్చు. ధర్మగ్రంథాలలో బియ్యాన్ని "హవిష్య అన్నం" అని పిలుస్తారు, అంటే హోమానికి ఉపయోగించే ధాన్యమని. అందుకే బియ్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

జలాభిషేకం చేయండి:

శివరాత్రి నాడు గంగాజలం, నల్ల నువ్వులను నీళ్లలో వేసి శివునికి అభిషేకం చేయండి. అలాగే ఆ తర్వాత "ఓం నమ: శ్శివాయ" అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. ఇలా చేస్తే ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. ఉద్యోగులకు బాగా కలిసి వస్తుంది. వ్యాపారులు భారీగా లాభాలను పొందుతారు. ఇలా చేయడం కూడా మంచిది.

వీటిని కూడా పాటించవచ్చు

శివపురాణం ప్రకారం చూసినట్లయితే గోధుమలు, బార్లీ ఎంతో పవిత్రమైనవి. నీళ్లలో బార్లీని కలిపి శివుడికి సమర్పిస్తే ఆనందం రెట్టింపు అవుతుంది. పూర్వికుల అనుగ్రహం కూడా కలుగుతుంది. గోధుమలను ఆ రోజు దానం చేస్తే శివయ్య అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చు.

లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఇలా చేయండి:

శివరాత్రి రోజు శివలింగం దగ్గర దీపం వెలిగించండి. ఇది జీవితంలో ఉన్న చీకటిని తొలగిస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కుబేరుని అనుగ్రహం కూడా ఉంటుంది.

ఆర్థిక సమస్యలు ఇలా తొలగించుకోండి

శివరాత్రి నాడు అన్ని విధాలుగా కలిసి రావాలని, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా ఈ విధంగా పాటించండి. శివుడికి ఇష్టమైన సోమవారం నాడు ఇలా చేస్తే బాగా కలిసి వస్తుంది. సాయంత్రం సంధ్య వేళలో శివాలయానికి వెళ్లి, శివలింగం దగ్గర నెయ్యి దీపం పెట్టండి. ఇలా చేస్తే మనసులో కోరికలు నెరవేరుతాయి. సోమవారం నాడు దీనిని మొదలుపెట్టి 41 సోమవారాల పాటు ఇలా దీపారాధన చేయండి. ఇక ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఆనందంగా ఉండొచ్చు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More