Mercury Retrograde: బుధ గ్రహం తిరోగమనంతో 23 రోజులు పాటు ఈ రాశులకు కనక వర్షం.. ధన లాభం, ప్రమోషన్లు ఇలా అనేకం!

Mercury Retrograde: బుధుడు గ్రహాలకు రారాజు. బుధుడి సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది 12 రాశుల వారి జీవితంలో చాలా మార్పులను తీసుకొస్తుంది. ఫిబ్రవరి 26న బుధుడు తిరోగమనం చెందుతాడు.  ఆ తర్వాత మార్చి 21న నేరుగా సంచారం చేస్తాడు. బుధుడు సుమారు 23 రోజులు పాటు తిరోగమనంలో ఉంటాడు.

Published on: Feb 9, 2026, 16:30:23 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mercury Retrograde: బుధుడు తెలివితేటలు, కమ్యూనికేషన్, ఆలోచనలను సూచిస్తాడు. ఒక వ్యక్తి జాతకంలో ఉన్న బుధుడిని బట్టి వారి ఆలోచనలు, మాటలు ఉంటాయి. బుధుడు వాణిజ్యం, ప్రయాణం, సాంకేతికతను కూడా ప్రభావితం చేస్తాడు.

Mercury Retrograde: బుధ గ్రహం తిరోగమనంతో 23 రోజులు పాటు ఈ రాశులకు కనక వర్షం (pinterest)
Mercury Retrograde: బుధ గ్రహం తిరోగమనంతో 23 రోజులు పాటు ఈ రాశులకు కనక వర్షం (pinterest)

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. బుధుడు గ్రహాలకు రారాజు. బుధుడి సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది 12 రాశుల వారి జీవితంలో చాలా మార్పులను తీసుకొస్తుంది.

ఫిబ్రవరి 26న బుధుడు తిరోగమనం చెందుతాడు. అంటే బుధుడు వెనక్కి ప్రయాణాన్ని మొదలుపెడతాడు. ఆ తర్వాత మార్చి 21న నేరుగా సంచారం చేస్తాడు. బుధుడు సుమారు 23 రోజులు పాటు తిరోగమనంలో ఉంటాడు. ఇది కొన్ని రాశుల వారికి శుభప్రదమైన ఫలితాలను తీసుకొస్తుంది. ఈ నాలుగు రాశుల వారు కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. ఇన్వెస్ట్‌మెంట్ విషయాలపై కూడా ప్రభావం పడుతుంది. మరి బుధుడు తిరోగమనంలో ఏ రాశి వారికి బాగా కలిసి రాబోతోంది? ఆ అదృష్ట రాశులు ఎవరో తెలుసుకుందాం.

బుధుని తిరోగమనం.. 23 రోజులు పాటు ఈ రాశుల వారికి శుభ ఫలితాలు!

1.వృషభ రాశి:

వృషభ రాశి వారికి బుధుడి తిరోగమనం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆర్థిక లాభాలను పొందుతారు. వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది. ఎక్కువ లాభాలు ఉంటాయి. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే కూడా అద్భుతమైన లాభాలను పొందుతారు. కెరీర్‌లో పురోగతిని చూస్తారు లేదా ప్రమోషన్లు వస్తాయి. ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా బాగా కలిసి వస్తుంది.

2.మిథున రాశి:

మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ రాశి వారికి ఊహించని లాభాలను తీసుకొస్తాడు. ఈ సమయంలో ఈ రాశి వారు వివిధ లాభాలు పొందుతారు. పెండింగ్‌లో ఉన్న టాస్కులు పూర్తవుతాయి. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. వ్యాపారస్తులకు ఎక్కువ లాభం ఉంటుంది. పాత ఇన్వెస్ట్‌మెంట్‌ల నుంచి ఎక్కువ ధన లాభం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి కూడా ఈ సంచారం బాగా కలిసి వస్తుంది.

3.తులా రాశి:

తులా రాశి వారికి బుధుడి తిరోగమనం సానుకూల మార్పులను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు పనిని కొత్త కోణంలో చూస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. పాత పరిచయస్తులతో వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. ఇంటర్వ్యూలు, కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు కూడా విజయవంతంగా రాణిస్తారు. సరైన నిర్ణయాలు తీసుకుంటే సక్సెస్‌ను అందుకుంటారు.

4.కుంభ రాశి:

కుంభ రాశి వారికి బుధుని తిరోగమనం బాగా కలిసి వచ్చేలా చేస్తుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. ఊహించని విధంగా మార్పులను చూస్తారు. ఐటీ, డేటా అనాలిసిస్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన ప్రణాళికలు అనేక విధాలుగా లాభాలను కలిగేలా చేస్తాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More