ఈ ఏడాది గృహప్రవేశం చెయ్యాలనుకుంటున్నారా? 2026 ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్న గృహప్రవేశ ముహూర్తాలు ఇవిగో!
సొంత ఇల్లు కట్టుకోవడం అనేది చాలా మంది కల. కొత్త ఇంటిని కట్టేటప్పుడు మొట్టమొదట శంకుస్థాపన చేసినప్పుడు మంచి ముహూర్తం చూసుకొని శంకుస్థాపన చేస్తారు. అలాగే కొత్త ఇంట్లో గృహప్రవేశం కూడా మంచి ముహూర్తాన చేసుకుంటారు. 2026 సంవత్సరానికి సంబంధించిన శుభ గృహప్రవేశం తేదీల గురించి ఈరోజు తెలుసుకుందాం.
సొంత ఇల్లు కట్టుకోవడం అనేది చాలామంది కల. అందరికీ అదే సాధ్యం కాదు. ఎంతో కష్టపడితే కానీ కొత్త ఇంటిని కొనుగోలు చేయలేము. కొత్త ఇంటిని కట్టేటప్పుడు మొట్టమొదట శంకుస్థాపన చేసినప్పుడు మంచి ముహూర్తం చూసుకొని శంకుస్థాపన చేస్తారు. అలాగే కొత్త ఇంట్లో గృహప్రవేశం కూడా మంచి ముహూర్తాన చేసుకుంటారు. 2026 సంవత్సరానికి సంబంధించిన శుభ గృహప్రవేశం తేదీల గురించి ఈరోజు తెలుసుకుందాం. అయితే, కాస్త ప్రాంతీయ పంచాంగ భేదాల ప్రకారం చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు. గృహప్రవేశం చేయడానికి ముందు కచ్చితంగా పండితులను సంప్రదించడం మంచిది.

ఈ సంవత్సరం గృహప్రవేశం చేస్తున్నారా? అయితే, ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్న శుభ ముహూర్తాలు ఇవి. కచ్చితంగా గృహప్రవేశం చేసేటప్పుడు ముహూర్తం పెట్టుకోవాలి. ముహూర్తం ప్రకారమే గృహప్రవేశం చేసుకుంటేనే మంచి జరుగుతుంది. అలాగే ఇంటిని నిర్మించేటప్పుడు వాస్తు నిపుణుల సలహా తీసుకోవాలి. వాస్తు నియమాల ప్రకారం ఇంటిని నిర్మించుకుంటే వాస్తు దోషాలు ఉండవు. ఆనందంగా ఉండొచ్చు. ఎలాంటి ఇబ్బందులు కలగవు. మరి ఇక గృహప్రవేశానికి సంబంధించిన ముహూర్తాల గురించి చూద్దాం.
గృహప్రవేశం చెయ్యాలా? గృహప్రవేశ ముహూర్తాలు ఇవిగో
జనవరి నెల:
జనవరి నెలలో ముహూర్తాలు లేవు. ధనుర్మాసం, మూఢమి కారణంగా జనవరి నెలలో గృహప్రవేశానికి ముహూర్తాలు లేవు.
ఫిబ్రవరి నెల:
ఫిబ్రవరి నెలలో గృహప్రవేశం చేయాలనుకుంటే ఫిబ్రవరి 19, 20, 21, 24, 25, 26 తేదీలు అనుకూలంగా ఉంటాయి.
మార్చి నెల:
మార్చి నెలలో 1, 3, 4, 7, 8, 9 తేదీలు గృహప్రవేశం చేయడానికి అనుకూలంగా ఉంటాయి.
ఏప్రిల్ నెల:
ఏప్రిల్ నెలలో 10, 11, 15, 16, 20, 21, 25 తేదీలు అనుకూలంగా ఉంటాయి.
మే నెల:
మే నెలలో 1, 6, 7, 8 తేదీలు అనుకూలంగా ఉంటాయి.
జూన్, జూలై:
జూన్ నెలలో ఎలాంటి ముహూర్తాలు లేవు. అలాగే జూలై నెలలో కూడా ముహూర్తాలు లేవు.
ఆగస్టు నెల:
ఆగస్టు నెలలో 16, 17, 18, 21, 22 తేదీలు అనుకూలంగా ఉంటాయి.
సెప్టెంబర్ నెల:
సెప్టెంబర్ నెలలో 5, 6, 9, 10, 13 తేదీలు అనుకూలంగా ఉంటాయి. ఆ తర్వాత ఆషాడ మాసం కారణంగా ముహూర్తాలు లేవు.
అక్టోబర్ నెల:
అక్టోబర్ నెలలో 29, 30, 31 తేదీలు అనుకూలంగా ఉంటాయి.
నవంబర్ నెల:
నవంబర్ నెలలో 1, 2, 6, 7, 8 తేదీలు గృహప్రవేశం చేయడానికి ముహూర్తాలు.
డిసెంబర్ నెల:
డిసెంబర్ నెలలో 4, 5, 9, 10, 11 తేదీలు గృహప్రవేశానికి అనుకూలంగా ఉంటాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


