Ugadi 2026: ఉగాది నుంచి ఈ ఐదు రాశులకు విపరీతమైన అదృష్టం, ధనప్రాప్తి, విదేశీ ప్రయాణాలు ఇలా బోలెడు లాభాలు!

పరాభవనామ సంవత్సరంలో ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం కలగబోతోంది. పరాభవ పేరుకి మాత్రమే కానీ ఈ రాశుల వారికి మాత్రం బాగా కలిసి రాబోతోంది. విపరీతమైన లాభాలు కలుగుతాయి, విజయాలను అందుకుంటారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? పరాభవ నామ సంవత్సరంలో అదృష్టం కలిగే రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Mar 16, 2026, 13:30:57 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మరి కొన్ని రోజుల్లో పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. విశ్వావసు నామ సంవత్సరానికి స్వస్తి పలుకబోతున్నాము. అయితే పరాభవనామ సంవత్సరంలో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. తెలుగు నూతన సంవత్సరం ఉగాది ఈ నెల 19న జరుపుకోబోతున్నాము. ఉగాది నాడు పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడిని తినడం, కొత్త కార్యక్రమాలను మొదలుపెట్టడం ఇలా వివిధ పద్ధతులను పాటిస్తూ ఉంటాము.

Ugadi 2026: ఉగాది నుంచి ఈ ఐదు రాశులకు విపరీతమైన అదృష్టం, ధనప్రాప్తి (pinterest)
Ugadi 2026: ఉగాది నుంచి ఈ ఐదు రాశులకు విపరీతమైన అదృష్టం, ధనప్రాప్తి (pinterest)

పరాభవనామ సంవత్సరంలో ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం కలగబోతోంది. పరాభవ పేరుకి మాత్రమే కానీ ఈ రాశుల వారికి మాత్రం బాగా కలిసి రాబోతోంది. విపరీతమైన లాభాలు కలుగుతాయి, విజయాలను అందుకుంటారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? పరాభవ నామ సంవత్సరంలో అదృష్టం కలిగే రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పరాభవ నామ సంవత్సరం ఈ రాశులకు వరం.. విపరీతమైన అదృష్టం, ధనప్రాప్తితో పాటు అనేక లాభాలు

1.తులా రాశి:

తులా రాశికి శని ఆరవ స్థానంలో సంచారం చేయడం వలన బాగా కలిసి రాబోతోంది. అనారోగ్య సమస్యలు, శత్రు బాధలు కూడా తొలగిపోతాయి. అప్పుల సమస్యల నుంచి కూడా బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. జూన్ 2 వరకు ఈ రాశి వారికి ధనప్రాప్తి కలుగుతుంది. ఆర్థికపరంగా బాగుంటుంది, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

2.వృషభ రాశి:

ఈ రాశి వారికి ఉగాది నుంచి బాగా కలిసి రాబోతోంది. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. శని 11వ స్థానంలో సంచారం చేయడం వలన ఈ రాశి వారికి బాగుంటుంది. కష్టానికి తగ్గ ఫలితాలను చూస్తారు. ఆస్తులను కొనుగోలు చేస్తారు. పరాభవనామ సంవత్సరం నుంచి ఈ రాశి వారికి విపరీతమైన లాభాలు ఉంటాయి. బాగా కలిసి వస్తుంది.

3.కన్యా రాశి:

కన్యా రాశి వారికి ఉగాది నుంచి బాగుంటుంది. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. శత్రు బాధలు, అప్పుల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. గురు బలం జూన్ 2 నుంచి అక్టోబర్ 30 దాకా ఉండడంతో ఆకస్మికంగా ధన ప్రాప్తి కలుగుతుంది. జనవరి 24 తర్వాత ఈ రాశి వారికి అవకాశాలు బాగా కలిసి వస్తాయి. మొత్తం మీద ఈ కొత్త సంవత్సరం ఈ రాశి వారికి బాగా కలిసి రాబోతోంది.

4.మకర రాశి:

మకర రాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో విజయాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జూన్ నుంచి అక్టోబర్ దాకా ఆర్థికపరంగా బాగుంటుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. వివాహం జరుగుతుంది. జనవరిలో ఆకస్మిక ధనప్రాప్తిని పొందవచ్చు. మొత్తం మీద పరాభవనామ సంవత్సరం మకర రాశి వారికి కూడా బాగుంటుంది.

5.కుంభ రాశి:

ఈ రాశి వారికి ఏలినాటి శని దోష ప్రభావం తొలగిపోతుంది. గురు బలం వీరిని బాగా కాపాడుతుంది. పరాభవనామ సంవత్సరంలో ఈ రాశి వారికి కూడా అద్భుతంగా ఉంటుంది. వివాహ, దాంపత్య సమస్యల నుంచి కూడా బయటపడతారు. వ్యాపారులకు కూడా ఇది శుభ సమయం. పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు చేసే వారికి అద్భుతంగా కలిసి వస్తుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More