సూర్య, శని కలయికతో పంచాంగ యోగం.. నాలుగు రాశుల వారికి కనీవినీ ఎరుగని విధంగా లాభాలు!
గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది 12 రాశుల వారి జీవితంలో చాలా మార్పులను తీసుకు వస్తుంది. కొన్ని సార్లు శుభ ఫలితాలు ఎదురైతే, కొన్ని సార్లు గ్రహాల సంచారం కారణంగా ప్రతికూల ఫలితాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొత్త ఏడాది గ్రహాల స్థానాల్లో మార్పు రాబోతోంది. పంచాంగ యోగం ఏర్పడుతుంది.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది ద్వాదశ రాశుల వారి జీవితంలో చాలా మార్పులను తీసుకు వస్తుంది. కొన్ని సార్లు శుభ ఫలితాలు ఎదురైతే, కొన్ని సార్లు గ్రహాల సంచారం కారణంగా ప్రతికూల ఫలితాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2025 త్వరలోనే పూర్తి కాబోతోంది. 2026 రాబోతోంది.

కొత్త ఏడాది గ్రహాల స్థానాల్లో మార్పు రాబోతోంది. జనవరి 4న సూర్యుడు శని 72 డిగ్రీల కోణంలో సంయోగం చెందుతాయి. దీంతో పంచాంగ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితమే మారిపోతుంది. కొన్ని రాశుల వారు విపరీతమైన అదృష్టాన్ని పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.
2026 లో సూర్య, శని కలయికతో పంచాంగ యోగం.. ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు
1.కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి పంచాంగ యోగం బాగా కలిసి వస్తుంది. భావోద్వేగ సమతుల్యతను అందిస్తుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఇల్లు, భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది.
2.వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఈ యోగం అనేక విధాలా లాభాలను తీసుకొస్తుంది. పంచాంగ యోగం కారణంగా ఈ రాశి వారికి విపరీతమైన ధన లాభం కలుగుతుంది. సంపద పెరుగుతుంది. పెట్టుబడులకు సంబంధించి మంచి నిర్ణయం తీసుకుంటారు. విదేశీ పరిచయాలు ఎక్కువ లాభాలను తీసుకొస్తాయి. వృత్తి, వ్యాపారంలో కూడా ఈ రాశి వారికి లాభాలు ఉంటాయి.
3.మేష రాశి:
మేష రాశి వారికి ఈ యోగం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. విజయాలను అందుకుంటారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారులకు కూడా ఇది అద్భుతమైన సమయం. కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టుకోవాలనుకుంటే కూడా ఇది అద్భుతమైన సమయం.
4.ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి ఈ పంచాంగ యోగం బాగా కలిసి వస్తుంది. అనేక విధాలుగా లాభాలను పొందుతారు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. సంబంధాలు బలపడతాయి. ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


