వాస్తు శాస్త్రం: ఇంట్లో ఇత్తడి చేపలను పెడితే ఇన్ని లాభాలా? గ్రహ దోషాలు ఉండవు, లక్ష్మీదేవి అనుగ్రహంతో బోలెడంత డబ్బు కూడా!

ఇళ్లల్లో చాలా మంది చేపల తొట్టెలు పెడుతూ ఉంటారు. అక్వేరియం చేపల తొట్టెల్లో చేపల్ని పెంచడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇంట్లో ఇత్తడి చేపలను పెట్టినా కూడా మంచి జరుగుతుంది. చాలా మంది ఇళ్లల్లో ఇత్తడి చేపలను మీరు చూసే ఉంటారు. ఈ సంప్రదాయం కొన్నాళ్లుగా సాగుతూనే ఉంది. ఈ చేపలు కేవలం అలంకరణకు కాదు.

Published on: Mar 9, 2026, 13:30:24 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలామంది ఇళ్లల్లో వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను పెడుతూ ఉంటారు. నిజానికి ఇంట్లో పెట్టే వస్తువులను సరైన దిశలో పెడితే ఇబ్బందులు కలగవు. వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను సరిగ్గా ఉంచినట్లయితే సానుకూల మార్పులను చూడొచ్చు. అనేక విధాలుగా ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇళ్లల్లో చాలా మంది చేపల తొట్టెలు పెడుతూ ఉంటారు. అక్వేరియం చేపల తొట్టెల్లో చేపల్ని పెంచడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇంట్లో ఇత్తడి చేపలను పెట్టినా కూడా మంచి జరుగుతుంది. చాలా మంది ఇళ్లల్లో ఇత్తడి చేపలను మీరు చూసే ఉంటారు. ఈ సంప్రదాయం కొన్నాళ్లుగా సాగుతూనే ఉంది.

ఇంట్లో ఇత్తడి చేపలను ఏ దిశలో పెట్టాలి? ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? (pinterest)
ఇంట్లో ఇత్తడి చేపలను ఏ దిశలో పెట్టాలి? ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? (pinterest)

ఇత్తడి చేపలు

ఈ చేపలు కేవలం అలంకరణకు మాత్రమే కాదు, సానుకూల శక్తి మరియు శ్రేయస్సును కూడా ఇవి తీసుకు వస్తాయని నమ్మకం. ఇత్తడి చేపలు ఇంట్లో ఉంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, వాటిని ఇంట్లో పెట్టేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో ఇత్తడి చేపలను ఏ దిశలో పెట్టాలి? ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?

ఇత్తడి చేపలను ఇంటి ఉత్తరం లేదా తూర్పు వైపు పెడితే ప్రయోజనాలు కలుగుతాయి. ఇత్తడి చేప విగ్రహాలను ఇంట్లో ఉంచడం వలన సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వీటిని ఇంట్లో ఉంచడం వలన సంపద పెరుగుతుంది, ఆనందం కూడా రెట్టింపు అవుతుంది.

జాతకంతో మార్పులు

ఇత్తడి చేపలను ఇంట్లో పెట్టడం వలన జాతకంతో చంద్రుడు, బుధుడు స్థానాలు బలపడతాయి. జాతకంలో చంద్రుడు, బుధుడికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఈ గ్రహాలకు సంబంధించిన లోపాలు ఏమైనా ఉంటే వాటిని సులువుగా తొలగించుకోవడానికి ఇత్తడి చేపలు అద్భుతంగా పనిచేస్తాయి.

ఈ చేపల వలన ఎన్నో లాభాలు కలుగుతాయి

ఇత్తడి చేపలను ఇంట్లో పెట్టడం వలన శాంతిని కాపాడుకోవచ్చు. బుధుడు సంపద, జ్ఞానం, మాటలతో సంబంధం కలిగి ఉంటాడు. అలాగే చంద్రుడు మనసు మరియు మానసిక ప్రభావాన్ని చూపిస్తాడు. వీటిని సరైన దిశలో ఉంచితే శని, రాహువు యొక్క ప్రతికూల స్థానం కూడా మెరుగుపడే అవకాశాలు ఉంటాయి.

ఇత్తడి చేపలకు కుబేరుడితో ఉన్న సంబంధం

ఇత్తడి చేపలను ఇంట్లో పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సంపద పెరుగుతుంది. ఇవి కుబేరుడితో సంబంధం కలిగి ఉంటాయి. ఇంట్లో గోడలకు వీటిని తగిలించడం వలన వ్యతిరేక శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అనారోగ్య సమస్యలు తగ్గి ఇంట్లో సంతోషం, శాంతి కూడా ఉంటాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More