Venus Double Transit: శుక్రుడి డబుల్ సంచారం.. ఈ 5 రాశులకు ఊహించని లాభాలు.. డబ్బు, వైవాహిక జీవితంలో ఆనందం, ప్రమోషన్లు!
శుక్రుడు డబుల్ సంచారం: మార్చి నెలలో చూసుకున్నట్లయితే, శుక్రుడు రెండు సార్లు తన సంచారాన్ని మార్చబోతున్నాడు. మార్చి 26, అంటే ఇంకో రెండు రోజుల్లో శుక్రుడు సంచారంలో చాలా మార్పు రాబోతోంది. శుక్రుడు కేవలం మేషరాశిలోకి ప్రవేశించడమే కాదు, అశ్విని నక్షత్రంలో కూడా ప్రవేశిస్తాడు.
శుక్రుడు విలాసాలు, డబ్బు, సంతోషం మొదలైన వాటికి నాయకుడు. జాతకంలో శుక్రుడు స్థానం సరిగ్గా ఉంటే దేనికి లోటు ఉండదు, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. మార్చి నెలలో చూసుకున్నట్లయితే, శుక్రుడు రెండు సార్లు తన సంచారాన్ని మార్చబోతున్నాడు. మార్చి 26, అంటే ఇంకో రెండు రోజుల్లో శుక్రుడు సంచారంలో చాలా మార్పు రాబోతోంది. శుక్రుడు కేవలం మేషరాశిలోకి ప్రవేశించడమే కాదు, అశ్విని నక్షత్రంలో కూడా ప్రవేశిస్తాడు.

ద్రిక్ పంచాంగం ప్రకారం, శుక్రుడు ఇలా మార్చి 26న మేషరాశిలోకి, అశ్విని నక్షత్రంలోకి ప్రవేశించడంతో డబుల్ రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి అనేక విధాలుగా లాభాలను తీసుకురాబోతోంది. శుక్రుడు డబుల్ సంచారంతో కొన్ని రాశుల వారు విపరీతమైన లాభాలను పొందుతున్నారు. మరి అదృష్ట రాశులు ఎవరో, వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.
శుక్రుడు డబుల్ సంచారం.. ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు
1.మేష రాశి:
మేష రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం, అశ్విని నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారి వ్యక్తిత్వం మెరుగు పడుతుంది. ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. కెరీర్‌లో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారస్తులకు అద్భుతమైన సమయం. ప్రేమ జీవితంలో ఆనందం పెరుగుతుంది.
2.కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఇది శుభ ఫలితాలను తీసుకొస్తుంది. శుక్రుడి డబుల్ సంచారం ఈ రాశి వారికి కెరీర్‌లో అద్భుతమైన మార్పులను తీసుకొస్తుంది. ఈ రాశి వారు ప్రమోషన్ పొందుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. కొత్త ప్లాన్లు వేస్తారు. సక్సెస్‌ను అందుకుంటారు. ప్రేమ జీవితం కూడా బాగుంటుంది.
3.తులా రాశి:
తులా రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. శుక్రుడు సంచారంలో మార్పు రావడంతో ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ప్రమోషన్లు, కొత్త బాధ్యతలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.
4.వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఇది శుభప్రదమైన సమయం. శుక్ర సంచారంలో మార్పు రావడంతో ఈ రాశి వారికి అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. విదేశాల నుంచి కూడా ప్రయోజనాలు కలుగుతాయి. రిలేషన్‌షిప్ బాగుంటుంది. సంతోషంగా ఉంటారు. ప్రశాంతత ఉంటుంది.
5.మీన రాశి:
మీన రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. పెండింగ్‌లో ఉన్న టాస్కులు అన్నీ కూడా పూర్తవుతాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. కెరీర్‌లో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారస్తులకు కూడా ఇది శుభప్రదమైన సమయం. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. బంధం దృఢంగా మారుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


