Ugadi Meena rasi Horoscope: మీన రాశి వారికి పరాభవనామ సంవత్సరం ఎలా ఉంటుంది? నెలల వారీగా తెలుసుకోండి!

ఈరోజు పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెట్టాము. పరాభవనమ సంవత్సరంలో 12 రాశుల వారికి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. మీన రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది? ఈ రాశి వారి భవిష్యత్తుతో పాటు మార్చి 2026 నుంచి ఏప్రిల్ 2027 వరకు ఏ విధంగా ఉండబోతోంది? 

Published on: Mar 19, 2026 4:30 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈరోజు పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెట్టాము. పరాభవనమ సంవత్సరంలో 12 రాశుల వారికి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. మీన రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది? ఈ రాశి వారి భవిష్యత్తుతో పాటు మార్చి 2026 నుంచి ఏప్రిల్ 2027 వరకు ఏ విధంగా ఉండబోతోంది? ఏ నెలలో ఎలాంటి మార్పులు వస్తాయి? అనే వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.

Ugadi Meena rasi Horoscope: మీన రాశి వారికి పరాభవనామ సంవత్సరం ఎలా ఉంటుంది? నెలల వారీగా తెలుసుకోండి! (pinterest)
Ugadi Meena rasi Horoscope: మీన రాశి వారికి పరాభవనామ సంవత్సరం ఎలా ఉంటుంది? నెలల వారీగా తెలుసుకోండి! (pinterest)

మీన రాశి వారికి పరాభవనామ సంవత్సరం ఎలా ఉంటుంది?

జూన్ నుంచి గురువు పంచమ స్థానంలో, శని ఒకటవ స్థానంలో, రాహువు డిసెంబర్ దాకా 12వ స్థానంలో, ఆ తర్వాత లాభ స్థానంలో, కేతువు డిసెంబర్ దాకా ఆరవ స్థానంలో, తర్వాత పంచమ స్థానంలో సంచరించడం వలన ఈ రాశి వారికి మధ్యస్థ నుంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ, గురువు, రాహువు, కేతువు లాంటి గ్రహాలు అనుకూలంగా ఉండడంతో బాగుంటుంది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. పెట్టుబడులు పెట్టేటప్పుడు అనవసరంగా ఎక్కువ డబ్బు ఖర్చు చేయకండి. అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు.

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి

మీన రాశి వారికి రాజకీయ ఒత్తిడి వలన కొంత ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పురోగతి, అభివృద్ధిని చూస్తారు. మీన రాశి వారికి ఏలినాటి శని ప్రభావం వలన అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సినీ, మీడియా రంగాల వారికి మధ్యస్థం నుంచి చెడు ఫలితాలు కలుగుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్త్రీలకు బాగా కలిసి వస్తుంది.

పరిహారాలు:

మీన రాశి వారికి పరాభవ సంవత్సరంలో బాగా కలిసి రావాలంటే దక్షిణామూర్తిని ఆరాధించాలి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. నవగ్రహాలయంలో శనికి తైలాభిషేకం చేస్తే మంచిది. దశరథ ప్రోక్త, శని స్తోత్రాన్ని పఠించండి. ఇక నెలల వారీగా ఫలితాలు చూద్దాం.

మార్చి 2026 నుంచి ఏప్రిల్ 2027 వరకు మీన రాశి వారికి ఎలా ఉండబోతోంది?

ఏప్రిల్ 2026:

ఈ నెల మీకు వృత్తి, ఉద్యోగ పరంగా సాధారణంగా ఉంటుంది. బంధువులతో విరోధాలు ఉంటాయి. ప్రయత్నాలు నెరవేరవు. ఉద్యోగస్తులకు అధికారులతో ఇబ్బందులు కలుగుతాయి. ప్రమోషన్లు లేక ఇబ్బంది పడతారు.

మే 2026:

నెల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఆర్థికపరంగా లాభాలు ఉంటాయి.

జూన్ 2026:

ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. ఏలినాటి శని వలన ఆరోగ్యం దెబ్బతినవచ్చు. అభివృద్ధి కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికపరంగా లాభాలను చూస్తారు. స్త్రీలకు ధన లాభం కలుగుతుంది.

జూలై 2026:

ఈ నెల మీకు పెద్దగా అనుకూలంగా ఉండదు. బంధువులతో ఇబ్బందులు వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధిని చూస్తారు. స్త్రీలకు ఆర్థిక లాభం. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది.

ఆగస్టు 2026:

ఈ నెల మీకు అనుకూలంగా లేదు. అస్తమ కుజుని కారణంగా అనారోగ్యం కలుగవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలసట ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఉండొచ్చు.

సెప్టెంబర్ 2026:

ఈ నెల మీకు మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ధన లాభం కలుగుతుంది. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. వృథా ప్రయాణాలు చేస్తారు. స్త్రీలకు అనుకూలంగానే ఉంటుంది.

అక్టోబర్ 2026:

ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ పరంగా బాగుంటుంది. ఆర్థిక లాభాలను చూస్తారు. కొత్త స్త్రీలతో పరిచయం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల కలయికతో ఆనందం ఉంటుంది.

నవంబర్ 2026:

ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బు ఖర్చు చేస్తారు. డబ్బు చేతికి అందుతుంది. గురువు మార్పు కారణంగా కొంత ఇబ్బందులు రావచ్చు. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది.

డిసెంబర్ 2026:

ఈ నెల మీకు అనుకూలంగా లేదు. శుభకార్యాలు వాయిదా వేస్తారు. స్త్రీలకు ఇబ్బందులు కలుగుతాయి. దైవదర్శనం వలన ఆనందం ఉంటుంది.

జనవరి 2027:

ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులు వస్తారు. ఆకస్మిక ధన లాభాన్ని చూస్తారు. శత్రువులను గుర్తించి వారిని ఇబ్బంది పెడతారు. స్త్రీలకు ధన లాభం కలుగుతుంది.

ఫిబ్రవరి 2027:

ఈ నెల మీకు అనుకూలంగా లేదు. స్త్రీల వలన ఇబ్బందులు వస్తాయి. ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. కోపం, అలసట ఎక్కువగా ఉంటాయి.

మార్చి, ఏప్రిల్ 2027:

ఈ రెండు నెలలు మీకు అనుకూలంగా లేదు. బంధుమిత్రుల కారణంగా లాభం ఉంటుంది. ఊహించని దాని కంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి. వృత్తి, ఉద్యోగ పరంగా బాగుంటుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More