ఈరోజే మార్చి నెలలో వచ్చే మొదటి ప్రదోష వ్రతం.. పూజా విధానంతో పాటు ఆనందం, శ్రేయస్సు కోసం పరిహారాలు తెలుసుకోండి

హిందూ విశ్వాసం ప్రకారం, ప్రదోష వ్రతం ప్రతి శుక్ల పక్షం మరియు కృష్ణ పక్షం త్రయోదశి తిథిలలో వస్తుంది. ఈ రోజున సూర్యాస్తమయం మరియు రాత్రి సంధ్యాకాలం ప్రదోష కాలం అవుతుంది. ఈ కాలంలో ఈ ఉపవాసానికి ప్రత్యేకంగా పూజ చేస్తారు. హిందూ విశ్వాసం ప్రకారం ప్రదోష వ్రతాన్ని మొదట చంద్ర దేవుడు నిర్వహించాడు. 

Published on: Mar 16, 2026, 08:01:12 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూ మతంలో ప్రదోష ఉపవాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే సోమవారం, ప్రదోష ఉపవాస రోజులలో శివుని ఆరాధనకు చాలా ఫలవంతమైనవిగా భావిస్తారు. ఈ రోజున శివుడిని పూర్తి ఆచారాలతో పూజిస్తారు. ప్రతి నెలా రెండు పక్షాల్లో త్రయోదశి రోజున ప్రదోష ఉపవాసం ఉంటుంది. వేర్వేరు రోజుల్లో వచ్చే ప్రదోషం వైభవం వేరు. మార్చి నెల నడుస్తోంది. ఈ నెలలో ప్రదోష వ్రతం 2 సార్లు పాటించబడుతుంది. మార్చిలో మొదటి ప్రదోష ఉపవాసం ఏ రోజు వచ్చిందో తెలుసుకుందాం.

ఈరోజే మార్చి నెలలో వచ్చే మొదటి ప్రదోష వ్రతం
ఈరోజే మార్చి నెలలో వచ్చే మొదటి ప్రదోష వ్రతం

హిందూ విశ్వాసం ప్రకారం, ప్రదోష వ్రతం ప్రతి శుక్ల పక్షం మరియు కృష్ణ పక్షం త్రయోదశి తిథిలలో వస్తుంది. ఈ రోజున సూర్యాస్తమయం మరియు రాత్రి సంధ్యాకాలం ప్రదోష కాలం అవుతుంది. ఈ కాలంలో ఈ ఉపవాసానికి ప్రత్యేకంగా పూజ చేస్తారు. హిందూ విశ్వాసం ప్రకారం ప్రదోష వ్రతాన్ని మొదట చంద్ర దేవుడు నిర్వహించాడు. ఈ రోజున శివుడిని పూర్తి ఆచారాలతో పూజిస్తే ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుందని చెబుతారు. అలాగే ఈ రోజున ఉపవాసం చేయడం ద్వారా సాధకుడి కోరికలన్నీ నెరవేరుతాయి.

మార్చి 2026 మొదటి ప్రదోష ఉపవాసం ఎప్పుడు?

పంచాంగం ప్రకారం మార్చి 16, 2026న మొదటి ప్రదోష ఉపవాసం వచ్చింది. సోమవారం వచ్చింది కనుక సోమ ప్రదోష వ్రతం అంటారు. సోమ ప్రదోష వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం సోమవారం శివుడికి అంకితం చేయబడింది. నియమాల ప్రకారం ఎవరు ఈ ఉపవాసం పాటిస్తారో వారి కోరికలన్నీ నెరవేరతాయని చెబుతారు. అలాగే వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. ఈ ఉపవాసం ఉండడం వలన శివుని ప్రత్యేక ఆశీర్వాదాలను పొందవచ్చు.

ప్రదోష వ్రతం తేదీ, సమయం

ఈ పూజను ప్రదోష కాలంలో చేస్తారు. పంచాంగం ప్రకారం చైత్ర మాసంలో కృష్ణ త్రయోదశి మార్చి 16 నుంచి ప్రారంభమవుతుంది. సమయం ఉదయం 9:40 గంటలకు. అదే సమయంలో ఈ తిథి మరుసటి రోజు అంటే మార్చి 17న ముగుస్తుంది. ముగింపు సమయం ఉదయం 9:23 గంటలు. ఆరాధన గురించి మాట్లాడితే ప్రదోష ఉపవాసం నాడు ఎల్లప్పుడూ సాయంత్రం పూజ చెయ్యాలి.

ప్రదోష వ్రతం పూజా విధి

ప్రదోష ఉపవాసం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయండి మరియు శుభ్రమైన దుస్తులను ధరించండి. దీని తరువాత శివుడిని స్మరించుకుంటూ ఉపవాసం చేస్తామని ప్రతిజ్ఞ చేయండి. ఆ తరువాత శివలింగానికి నీరు సమర్పించి జలాభిషేకం చేయాలి.

ప్రదోష ఉండేవారు పండ్లు తినచ్చు. పూజను ప్రదోష కాలంలో చెయ్యాలి.

ప్రదోష కాలం ప్రారంభానికి ముందు మళ్లీ స్నానం చేయడం శుభప్రదమైనదిగా భావిస్తారు.

ఆ తరువాత ఆచారాల ప్రకారం శివుడిని పూజించి ఆయనకు నైవేద్య, సమర్పించండి.

పూజ సమయంలో ప్రదోష వ్రతం కథ వినండి మరియు చివరలో శివునికి హారతి ఇవ్వండి. హారతి ఇచ్చాక ప్రసాదం తీసుకోండి.

ప్రదోష ఉపవాసం రోజున శివలింగానికి నువ్వులు సమర్పించండి. నువ్వులతో శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా సాధకుడికి అన్ని పాపాల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీవితంలో ఆనందం లభిస్తుందని నమ్ముతారు.

ప్రత్యేక పరిహారాలు

ఆర్థిక ఇబ్బందులను ఇలా తొలగించుకోవచ్చు

ప్రదోష ఉపవాసం రోజున శివలింగానికి బియ్యాన్ని సమర్పించండి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉంటాయని, జీవితంలో డబ్బు కొరతను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని నమ్ముతారు.

సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం:

మీ వైవాహిక జీవితం బాగుండాలంటే ప్రదోష ఉపవాసం రోజున పెరుగులో తేనె కలిపి శివుడికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది.

వివాహంలో అడ్డంకులను ఇలా తొలగించుకోండి:

కొన్ని కారణాల వల్ల మీకు ఇష్టమైన వివాహంలో చాలా కాలంగా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే, ఆ సమస్యల నుండి బయటపడటానికి స్నానం చేసిన తరువాత శివుడికి నమస్కరించి ప్రదోష రోజున ఉపవాసం చేసి శివ మంత్రాన్ని 11 సార్లు జపించాలి. జపం పూర్తయిన తరువాత స్వామికి పుష్పాలు సమర్పించండి.

మంత్రం: ఓం నమః శివాయ.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More