Ugadi Vrischika rasi Horoscope: వృశ్చిక రాశికి శత్రువులపై విజయాలు, ధన లాభం, సంతాన భాగ్యం.. నెలల వారీగా ఫలితాలు ఇవిగో!
Ugadi Vrischika rasi Horoscope: ఈ కొత్త సంవత్సరం 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. వృశ్చిక రాశికి పరాభవ నామ సంవత్సరంలో ఎలా ఉంటుంది? ఈ రాశి వారికి కలిగే లాభాలు, నష్టాలు పూర్తిగా తెలుసుకుందాం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అభివృద్ధిని చూస్తారు. నిరుద్యోగులు ఉద్యోగాలను పొందుతారు.
మరి కొన్ని రోజుల్లో పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. కొత్త సంవత్సరంలో చాలా మార్పులు రాబోతున్నాయి. ప్రతి రాశి వారు కూడా కొత్త సంవత్సరంలో అనేక మార్పులు చూడబోతున్నారు. పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ రాశి వారు ఏ విధంగా ప్రయోజనాలను పొందబోతున్నారు, ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి, ఏ నెలలో అనుకూలంగా ఉంటుంది వంటి వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.

పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది?
జూన్ ప్రారంభం నుంచి బృహస్పతి భాగ్య స్థానంలో ఉంటాడు. శని ఐదవ స్థానంలో అనుకూలంగా సంచరిస్తాడు. అదే విధంగా రాహువు డిసెంబర్ దాకా నాలుగవ స్థానంలో, ఆ తర్వాత మూడవ స్థానంలో ఉంటాడు. అలాగే కేతువు డిసెంబర్ దాకా పదవ స్థానంలో సంచరిస్తాడు. దీని వలన వృశ్చిక రాశి వారికి ఈ కొత్త తెలుగు సంవత్సరంలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతోంది. ఈ ఏడాది ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అంతే కాకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కూడా అభివృద్ధిని చూస్తారు. నిరుద్యోగులు ఉద్యోగాలను పొందుతారు. ఉద్యోగస్తులకు డబ్బు, కీర్తి పెరుగుతాయి.
లాభాలు, శుభ ఫలితాలు
వ్యాపారస్తులకు కూడా పరాభవనామ సంవత్సరంలో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి సులువుగా బయటపడతారు. పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధిని చూస్తారు. అలాగే ఈ రాశి వారు చదువుపరంగా చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్‌ను అందుకుంటారు. విద్యార్థులకు ఈ ఏడాది బాగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు గుర్తింపును పొందుతారు. వ్యాపారులు వృద్ధిని చూస్తారు. రాజకీయ నాయకులకు ఈ ఏడాది మధ్యస్థంగా ఉంటుంది. సినీ, మీడియా రంగాల వారు శుభ ఫలితాలను పొందుతారు.
రైతులకు బాగా కలిసి వస్తుంది. పంట దిగుబడి అనుకూల ఫలితాలను ఇస్తుంది. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృశ్చిక రాశి వారు ఈ సమయంలో ఉపశమనాన్ని పొందుతారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించండి. ఇప్పుడు మాసవారీ ఫలితాలు కూడా చూసేద్దాం.
పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి నెలవారీ ఫలితాలు
ఏప్రిల్ 2026:
ఈ నెల వృత్తిపరంగా బావుంటుంది. సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరంగా లాభాలను పొందుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీలకు కూడా ఈ నెల బాగా కలిసి వస్తుంది. శత్రువులపై విజయాన్ని పొందుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
మే 2026:
ఈ నెల ఈ రాశి వారికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది. ఉద్యోగులకు బాగా లాభాలు ఉంటాయి. స్త్రీలు సంతోషంగా ఉంటారు. సమయం అనుకూలంగా ఉంటుంది.
జూన్ 2026:
ఈ నెల ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు బాగుంటుంది. పదోన్నతిని పొందుతారు. స్త్రీలకు సంతోషం ఉంటుంది. ధన లాభం కలుగుతుంది. సంతానం ద్వారా ఆనందాన్ని పొందుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలిగే అవకాశం కూడా ఉంది.
జూలై 2026:
ఈ నెల ఈ రాశి వారికి బాగుంటుంది. విజయాలను అందుకుంటారు. గౌరవాన్ని పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. నూతన స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో బాగుంటుంది. ఉద్యోగ పరంగా కూడా బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఆగస్టు 2026:
ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది కానీ కాస్త చికాకులు ఉంటాయి. భార్యా భర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. విద్యాపరంగా ఇబ్బందులు ఉండొచ్చు. ఉద్యోగులకు లాభం ఉంటుంది.
సెప్టెంబర్ 2026:
ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా బావుంటుంది. ఆర్థిక లాభాలను చూస్తారు. కోపం, చికాకు కాస్త ఎక్కువగా ఉండొచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. స్త్రీల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు.
అక్టోబర్ 2026:
ఈ నెల మీకు అనుకూలంగా లేదు. ఆర్థికపరంగా ఇబ్బందులు ఉండొచ్చు. నూతన స్త్రీ పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో విరోధాలు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. స్త్రీల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. భర్తతో వాదనలు రావచ్చు.
నవంబర్ 2026:
ఈ నెల మీకు అనుకూలంగా లేదు. ఇబ్బందులు ఉంటాయి. వాహన ప్రమాదాలు జరగవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పోలీసులతో చికాకులు వంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కూడా ఉండొచ్చు. పని చేసే చోట మీరు కీలక పాత్ర పోషిస్తారు. జాయింట్ వ్యాపారం ఈ నెలలో మీకు కలిసి రాదు.
డిసెంబర్ 2026:
ఈ నెల మీకు మధ్యస్థంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధిని చూస్తారు. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో వినోదాల్లో పాల్గొంటారు.
జనవరి 2027:
ఈ నెల కూడా మీకు మధ్యస్థంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు లాభాలు ఉండొచ్చు. ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఆనందంగా ఉంటారు.
ఫిబ్రవరి 2027:
ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. నూతన గృహ, వాహన లాభాలను పొందుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. భర్తతో సంతోషంగా ఉంటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
మార్చి, ఏప్రిల్ 2027:
ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ పరంగా బావుంటుంది. ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. ధనలాభం కూడా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. సంతానం వలన ఆనందం కూడా కలుగుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


