ఉగాది నుంచి ఈ రాశులకు సమస్యలు మొదలు.. ఏ పని మొదలై పెట్టినా అంతే.. మీరూ ఉన్నారా?
ప్రతి సంవత్సరం ఉగాదితో కొత్త తెలుగు సంవత్సరం మొదలవుతుంది. ఉగాది నాడు ప్రతి ఒక్కరూ కూడా పంచాంగ శ్రవణాన్ని వింటారు. ఏడాదిలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ముందే తెలుసుకుంటారు. ఉగాది పండుగ ఈసారి మార్చి 19న రాబోతోంది. కొన్ని రాశుల వారికి బ్యాడ్ టైమ్ మొదలు కాబోతోంది.
ఉగాది 2026: మరి కొన్ని రోజుల్లో విశ్వాసు నామ సంవత్సరం పూర్తి కాబోతోంది. పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. పరాభవ నామ సంవత్సరంలో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. అలాగే కొన్ని రాశుల వారికి బ్యాడ్ టైమ్ మొదలు కాబోతోంది.

ముఖ్యంగా ఈ రెండు రాశుల వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండు రాశుల వారికి కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరి పరాభవ నామ సంవత్సరంలో ఏ రాశుల వారికి నష్టాలు కలగవచ్చు? ఏ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఉగాది 2026 నుంచి కొన్ని రాశుల వారికి సమస్యలు వచ్చే అవకాశం
ప్రతి సంవత్సరం ఉగాదితో కొత్త తెలుగు సంవత్సరం మొదలవుతుంది. ఉగాది నాడు ప్రతి ఒక్కరూ కూడా పంచాంగ శ్రవణాన్ని వింటారు. ఏడాదిలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ముందే తెలుసుకుంటారు. ఉగాది పండుగ ఈసారి మార్చి 19న రాబోతోంది. పరాభవ నామ సంవత్సరం ఇది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు.
ఈ కొత్త సంవత్సరం కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉంటే, కొన్ని రాశుల వారికి మాత్రం కాస్త ప్రతికూలంగా ఉండబోతోంది. సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రెండు రాశుల వారు కూడా ఉగాది నుంచి చిన్నపాటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది.
ఉగాది నుంచి ఈ రాశులకు ఇబ్బందులు.. జాగ్రత్తగా ఉంటే మంచిది
1.మకర రాశి:
మకర రాశి వారికి ఉగాది నుంచి కాస్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా కొత్త పెట్టుబడులు పెట్టడం వలన నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మీ జీవితంలో కొన్ని కొత్త సమస్యలు రావచ్చు. అలాగే ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. అదే విధంగా స్నేహితులతో కూడా జాగ్రత్తగా ఉండాలి.
2.సింహ రాశి:
సింహ రాశి వారికి కూడా కొత్త తెలుగు సంవత్సరం చిన్నపాటి ఇబ్బందులను తీసుకొస్తుంది. శని కారణంగా సింహ రాశి వారికి కష్టాలు ప్రారంభమవుతాయి. ఈ ఉగాది నుంచి ఈ రాశి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అనేక సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. చిక్కులు, చికాకులు పెరుగుతాయి. కొత్త పనులను మొదలు పెట్టేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వీలైతే కొత్త పనులు చేపట్టకుండా ఉండడం ఉత్తమం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


