Ugadi: ఈ ఉగాది నుంచి ఈ రాశుల వారి కష్టాలు తీరినట్టే.. కొత్త ఏడాది వీళ్ళకే ఫుల్లు లక్కు, ఐశ్వర్య యోగం!

ఈ కొత్త తెలుగు సంవత్సరంలో 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టడంతో ప్రతి ఒక్కరికి కూడా ఈ కొత్త తెలుగు నామ సంవత్సరంలో ఎలాంటి మార్పులు వస్తాయి, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ ఉగాది నుంచి గురు గ్రహాల గమనం మారుతుంది. 

Published on: Mar 10, 2026 10:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొత్త తెలుగు నామ సంవత్సరం (Ugadi 2026) త్వరలోనే రాబోతోంది. విశ్వావసుకి స్వస్తి పలికి పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ కొత్త తెలుగు సంవత్సరంలో 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టడంతో ప్రతి ఒక్కరికి కూడా ఈ కొత్త తెలుగు నామ సంవత్సరంలో ఎలాంటి మార్పులు వస్తాయి, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ ఉగాది నుంచి గురు గ్రహాల గమనం మారుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టం రాబోతోంది.

Ugadi 2026: కొత్త ఏడాది వీళ్ళకే ఫుల్లు లక్కు, ఐశ్వర్య యోగం (pinterest)
Ugadi 2026: కొత్త ఏడాది వీళ్ళకే ఫుల్లు లక్కు, ఐశ్వర్య యోగం (pinterest)

కొన్ని రాశుల వారికి వ్యాపారంలో భారీగా లాభాలు రాబోతున్నాయి. అంతేకాకుండా ఉద్యోగంలో ప్రమోషన్లు రానున్నాయి. ఆకస్మిక ధన లాభంతో పాటు అనేక విధాలుగా ప్రయోజనాలు కలగబోతున్నాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఎవరికి ఆర్థికపరంగా, కెరీర్ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఏ విధంగా లాభాలను పొందుతారు? ఆరోగ్యం ఎలా ఉంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి వివరాలను ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం.

ఈ ఉగాదితో ఈ మూడు రాశుల వారికి సమస్యలు తొలగిపోతాయి.. విపరీతమైన అదృష్టం కలగబోతోంది.

1.తులా రాశి:

తులా రాశికి అధిపతి శుక్రుడు. ఈ ఏడాది తులా రాశి వారికి బాగా కలిసి రాబోతుంది. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడంతో ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ కొత్త తెలుగు సంవత్సరంలో సొంత ఇల్లు, కారు వంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.

అయితే కాస్త ఆవేశాన్ని తగ్గిస్తే విజయాన్ని చేరుకోవచ్చు. అనుకున్న వాటిని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయొచ్చు. ఈ ఏడాది కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి.

2.మిథున రాశి:

మిథున రాశి వారు ఈ ఏడాది విపరీతమైన అదృష్టాన్ని పొందబోతున్నారు. మార్చి నెలలో గురువు మీ రాశిలో ఉండడంతో అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. అన్ని రంగాల్లో కూడా విజయాలను అందుకుంటారు.

నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారంలో భారీగా లాభాలు కలుగుతాయి. ఈ ఏడాది ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. మొండి బకాయిలను కూడా సక్సెస్‌ఫుల్‌గా వసూల్ చేస్తారు. మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా ఈ ఏడాది విజయాలను అందుకుంటారు.

3.సింహ రాశి:

సింహ రాశి వారికి అధికార యోగం ఈ ఏడాది కలుగుతుంది. ఈ రాశి వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. సూర్య ప్రభావం వలన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన కోర్టు కేసులు, తీరని ఆస్తి గొడవలు ఈ ఏడాది పరిష్కారం అవుతాయి.

రాజకీయాల్లో ఉన్నవారికి, ప్రభుత్వ ఉద్యోగులకు ఇది గోల్డెన్ టైమ్ అని చెప్పవచ్చు. మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా గతంలో వేధించిన అనారోగ్య సమస్యల నుంచి కూడా ఈ సంవత్సరం బయట పడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More