ఖచ్చితంగా ఉగాది రోజు గుర్తు పెట్టుకుని ఈ 10 పనులు చెయ్యండి.. ఏడాది అంతా ఐశ్వర్యం, ఆనందం, శుభాలు కలుగుతాయి!

ఉగాది నాడు చాలా మంది తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. నిజానికి ఉగాది నాడు తప్పకుండా ఈ పది శుభ పనులు చేయడం మంచిది. ఇలా చేయడం వలన సంవత్సరం మొత్తం కూడా శుభ ఫలితాలను పొందవచ్చు. కష్టాలేమీ లేకుండా ఆనందంగా ఉండొచ్చు. ఇప్పుడు ఉగాది నాడు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటో తెలుసుకుందాం.

Published on: Mar 13, 2026 8:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొత్త తెలుగు సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ప్రతి ఒక్కరూ కూడా కొత్త తెలుగు సంవత్సరం బాగా కలిసి రావాలని అనుకుంటారు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఎదురైన ఇబ్బందులు కొత్త సంవత్సరంలో రాకూడదని ఎంతో భక్తితో, శ్రద్ధగా ఉగాదిని మొదలు పెడతారు. ఉగాది నాడు చాలా మంది తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు.

ఖచ్చితంగా ఉగాది రోజు గుర్తు పెట్టుకుని ఈ 10 పనులు చెయ్యండి (pinterest)
ఖచ్చితంగా ఉగాది రోజు గుర్తు పెట్టుకుని ఈ 10 పనులు చెయ్యండి (pinterest)

నిజానికి ఉగాది నాడు తప్పకుండా ఈ పది శుభ పనులు చేయడం మంచిది. ఇలా చేయడం వలన సంవత్సరం మొత్తం కూడా శుభ ఫలితాలను పొందవచ్చు. కష్టాలేమీ లేకుండా ఆనందంగా ఉండొచ్చు. ఇప్పుడు ఉగాది నాడు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటో తెలుసుకుందాం.

ఖచ్చితంగా ఉగాది రోజు గుర్తు పెట్టుకుని ఈ 10 పనులు చేయాల్సిందే

త్వరగా నిద్ర లేచి స్నానం: ఉగాది రోజు త్వరగా నిద్ర లేచి స్నానం చేయండి. శరీరం, మనసు రెండూ పవిత్రంగా మారతాయి.

ఇంటిని శుభ్రం చేసి తోరణాలు కట్టండి: ఉగాది నాడు ఇంటిని శుభ్రం చేసి ముఖద్వారాన్ని కూడా శుభ్రంగా ఉంచి మామిడి ఆకులతో తోరణాలు కట్టండి. ఇలా చేయడం వలన శుభం, ఐశ్వర్యం కలుగుతాయి.

దేవుడికి పూజ: ఉగాది నాడు కచ్చితంగా దేవుని ఆశీర్వాదంతో ప్రారంభించండి. దాంతో దైవానుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. కష్టాలు కూడా తొలగిపోతాయి.

ఉగాది పచ్చడి: ఉగాది పచ్చడి తయారు చేసుకుని స్వీకరించాలి. జీవితంలో ఆరు రుచులను స్వీకరించాలని ఉగాది పచ్చడి మనకు తెలుపుతుంది.

పంచాంగ శ్రవణం: కొత్త ఏడాది ఎలా ఉండబోతోంది, గ్రహాల ప్రభావం వంటివి పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవచ్చు.

దేవాలయ దర్శనం: దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటే కుటుంబానికి శుభం కలుగుతుందని పండితులు తెలుపుతున్నారు.

పెద్దల ఆశీర్వాదం: పెద్దల ఆశీర్వాదం ఉండాలి. అప్పుడే ఆయురారోగ్యాలు, విజయాలు కలుగుతాయి.

దానాలు: మీకు తోచిన వాటిని దానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. అన్నదానం, వస్త్రదానం ఇలా ఏదైనా చేయొచ్చు.

కొత్త పనులు: ఉగాది రోజు కొత్త పనులు ప్రారంభిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. చేపట్టిన కార్యక్రమాల్లో అడ్డంకులు ఉండవు.

మంచి సంకల్పం చేసుకోండి: కొత్త ఏడాది మంచి ఆలోచనలతో ప్రారంభించుకోండి. మంచి సంకల్పం చేసుకుని ఉగాది నుంచి ఏడాది అంతా బాగా కలిసి రావాలని కొత్త పనులను మొదలు పెట్టండి. ఇలా ఈ 10 శుభ పనులను ఉగాది రోజు చేయడం వలన సంవత్సరం మొత్తం ఐశ్వర్యం, ఆనందం, శుభాలు కలుగుతాయి.

ఉగాది నాడు గణపతి ఆలయానికి వెళ్లి ఇలా చేయండి:

ఉగాది నాడు గణపతి ఆలయానికి వెళ్లి గరికను సమర్పించండి. అలాగే ఎర్రటి పుష్పాలను కూడా సమర్పించండి. ఇది శుభ ఫలితాలను కలిగేలా చేస్తుంది. పైగా వినాయకుడు విఘ్నాలను తొలగిస్తాడు. కాబట్టి మీ కొత్త ఏడాదిని ఇలా మొదలు పెడితే వినాయకుని అనుగ్రహం కలిగి విఘ్నాలన్నీ తొలగిపోతాయి. అలాగే అర్చన చేయించుకోండి. “ఓం గం గణపతయే నమః” అనే మంత్రాన్ని పఠించండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More