మఖ నక్షత్రంలోకి కేతువు, ఐదు రాశుల జీవితాల్లో వెలుగులు.. విజయాలు, అభివృద్ధి, అవకాశాలు ఇలా ఎన్నో!

మఖ నక్షత్రంలోకి కేతువు: మార్చి 29న కేతువు మఖ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. కేతువు నక్షత్ర సంచారంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. ఎనిమిది నెలల పాటు ఈ రాశుల వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

Published on: Mar 12, 2026 10:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది.

మఖ నక్షత్రంలోకి కేతువు, ఐదు రాశుల జీవితాల్లో వెలుగులు (pinterest)
మఖ నక్షత్రంలోకి కేతువు, ఐదు రాశుల జీవితాల్లో వెలుగులు (pinterest)

కేతువు క్రూర గ్రహం. కానీ ఒక్కోసారి కేతువు కూడా శుభ ఫలితాలను తీసుకొస్తూ ఉంటుంది. మార్చి 29న కేతువు మఖ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. కేతువు నక్షత్ర సంచారంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. ఎనిమిది నెలల పాటు ఈ రాశుల వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

మఖ నక్షత్రంలోకి కేతువు.. ఈ రాశులకు అనేక లాభాలు

1.సింహ రాశి:

సింహ రాశి వారికి కేతువు నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు పురోగతిని చూస్తారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. వ్యాపారులకు ఇది అద్భుత సమయం. విజయాలను అందుకుంటారు. ఆర్థికపరంగా కూడా ఇది మంచి సమయం. సానుకూల మార్పులను చూస్తారు. సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుంది.

2.వృషభ రాశి:

వృషభ రాశి వారికి కేతువు సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. ఉద్యోగుల జీతం పెరుగుతుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యాపారులకు అభివృద్ధి కనబడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సంతోషం కూడా రెట్టింపు అవుతుంది.

3.కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి కేతువు నక్షత్ర సంచారంతో మంచి మార్పులు వస్తాయి. అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఉద్యోగులకు, వ్యాపారులకు పురోగతి ఉంటుంది. సంపద పెరుగుతుంది. భారీ పెట్టుబడుల నుంచి లాభాలను పొందుతారు.

4.తుల రాశి:

తులా రాశి వారికి కేతువు నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రయాణాల ద్వారా కొత్త అనుభవాలను పొందుతారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు.

5.మకర రాశి:

మకర రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఊహించని లాభాలను పొందుతారు. కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు, వ్యాపారాలకు కూడా ఇది శుభ సమయం. కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. పెట్టుబడుల నుంచి కూడా బాగా రాబడి వస్తుంది. మనశ్శాంతిగా ఉంటారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More