శుక్ర సంచారంతో మాలవ్య రాజయోగం.. ఐదు రాశులకు అద్భుత లాభాలు.. డబ్బు, విలాసాలతో పాటు ఎన్నో!

జ్యోతిష్య లెక్కల ప్రకారం, శుక్రుడు వృషభ , తులా లేదా మీన రాశిలో ఉన్నప్పుడు మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రాజయోగం ఏప్రిల్ 19న ఏర్పడిపోతుంది. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. శుక్రుడు డబ్బు, సంతోషం, విలాసాలు, అందం మొదలైన వాటికి కారకుడు. 

Published on: Mar 19, 2026 12:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం, శుక్రుడు వృషభ , తులా లేదా మీన రాశిలో ఉన్నప్పుడు మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రాజయోగం ఏప్రిల్ 19న ఏర్పడిపోతుంది. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. శుక్రుడు డబ్బు, సంతోషం, విలాసాలు, అందం మొదలైన వాటికి కారకుడు. శుక్రుడు మాలవ్య మహాపురుష రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఇది ఐదు రాశుల వారికి అనేక విధాలుగా లాభాలను తీసుకురాబోతోంది. మరి అదృష్ట రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శుక్ర సంచారంతో మాలవ్య రాజయోగం.. ఐదు రాశులకు అద్భుత లాభాలు
శుక్ర సంచారంతో మాలవ్య రాజయోగం.. ఐదు రాశులకు అద్భుత లాభాలు

శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించడంతో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది.. ఐదు రాశులకు లాభాలు

1.వృషభ రాశి:

వృషభ రాశి వారికి శుక్రుడు వృషభ రాశిలోకి సంచరించడంతో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికపరంగా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ చూస్తే కూడా కలిసి వస్తుంది. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది.

2.సింహ రాశి:

సింహ రాశి వారికి ఈ శుక్ర ప్రభావం కారణంగా శుభ ఫలితాలు ఎదురవుతాయి. కెరీర్‌లో సక్సెస్ చూస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలను పొందుతారు. ప్రభుత్వం లేదా పాలిటిక్స్‌లో ఉన్నవారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవితంలో స్థిరత్వం ఉంటుంది.

3.వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి ఈ మాలవ్య రాజయోగం మంచి ఫలితాలను అందిస్తుంది. వైవాహిక జీవితంలో బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం. ఆర్థికపరంగా బాగుంటుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది.

4.మకర రాశి:

మకర రాశి వారికి ఈ రాజయోగం అద్భుతంగా ఉంటుంది. అనేక విధాలుగా మార్పులను చూస్తారు. ప్రేమ పెరుగుతుంది. ఆర్థికపరంగా లాభాలు ఉంటాయి. పూర్వికుల నుంచి ఆస్తులను పొందుతారు.

5.కుంభ రాశి:

కుంభ రాశి వారికి ఇది అద్భుత సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. శుక్ర సంచారంతో కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. రిలేషన్‌షిప్ బాగుంటుంది. విలాసాలపై ఇన్వెస్ట్ చేస్తారు. మొత్తం మీద మాలవ్య రాజయోగం మీకు కూడా బాగా కలిసి వస్తుంది.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More