Ugadi 2026: వృషభ రాశికి ఈ కొత్త తెలుగు సంవత్సరంలో ఎలా ఉంటుంది? ఏ నెలలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూసుకోండి!

ఈ కొత్త తెలుగు సంవత్సరంలో వృషభ రాశి వారికి షేర్లు, పెట్టుబడులు సామాన్య ఫలితాలను ఇస్తాయి. రైతులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. రైతులకు ఈ ఏడాది కూడా అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారులు, న్యాయాధికారులు మంచి గుర్తింపును పొందుతారు. ఇనుము, సిమెంట్, గృహ నిర్మాణ సంబంధ వ్యాపారాలకు వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. 

Published on: Mar 10, 2026 1:30 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ రాశి వారి ఈ నెల వారి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 2026 జూన్ 1 దాకా గురువు ఈ రాశి వారికి సామాన్య ఫలితాలను ఇవ్వబోతున్నాడు. జూన్ 2 నుంచి గురువు ధన నాశనము కలిగిస్తాడు. రాహువు, కేతువులు డిసెంబర్ 5 దాకా సౌభాగ్యకరమైన ఫలితాలను ఇస్తారు. డిసెంబర్ 6 నుంచి సర్వసుఖాలను అందిస్తారు.

వృషభ రాశి వారికి ఈ కొత్త తెలుగు సంవత్సరంలో ఎలా ఉంటుంది? (pinterest)
వృషభ రాశి వారికి ఈ కొత్త తెలుగు సంవత్సరంలో ఎలా ఉంటుంది? (pinterest)

శని ఏకాదశి స్థాన సంచారం కారణంగా వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో, వ్యక్తిగత జీవితంలో ఆశావాహంగా ముందుచూపుతో పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. దీర్ఘకాలిక లక్ష్యాలను కూడా వృషభ రాశి వారు పూర్తి చేస్తారు. సంపాదన పెరుగుతుంది. వ్యాపారంలో సమన్వయం ఉంటుంది. జూలై నుంచి డిసెంబర్ దాకా శని తిరోగమనం వలన ఆర్థిక ప్రయోజనాలు తగ్గుతాయి.

వృషభ రాశి వారికి ఈ కొత్త తెలుగు సంవత్సరంలో ఎలా ఉంటుంది?

ఈ కొత్త తెలుగు సంవత్సరంలో వృషభ రాశి వారికి షేర్లు, పెట్టుబడులు సామాన్య ఫలితాలను ఇస్తాయి. రైతులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. రైతులకు ఈ ఏడాది కూడా అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారులు, న్యాయాధికారులు మంచి గుర్తింపును పొందుతారు. ఇనుము, సిమెంట్, గృహ నిర్మాణ సంబంధ వ్యాపారాలకు వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక లాభాన్ని పొందుతారు. రైస్ మిల్లర్లు, పారిశ్రామిక రంగం వారికి కూడా ఈ ఏడాది అనుకూలంగా ఉంటుంది. కొత్త తెలుగు సంవత్సరంలో ఏ నెల ఎలా ఉండబోతోంది? నెలల వారీగా ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.

2026 మార్చి నుంచి ఏప్రిల్ 2027 వరకు నెలవారీ ఫలితాలు తెలుసుకోండి

మార్చి 2026:

మార్చిలో వృషభ రాశి వారు ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. మార్చి నెలలో వృషభ రాశి వారు శుభకార్యాలకు సహాయం చేసి అండగా ఉంటారు. సుఖ సంతోషాలను పొందుతారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. భూ గ్రస్తులు వృద్ధి చెందుతాయి. ఇతరులను ఆకర్షించడానికి వాక్ ప్రసంగాలను అలవర్చుకుంటారు.

ఏప్రిల్ 2026:

ఏప్రిల్ నెల ప్రారంభంలో ధన వృద్ధి, సుఖ సౌఖ్యాలు పొందుతారు. ఆనందంగా ఉంటారు. చేతినిండా డబ్బు ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత ఉంటుంది. అలాగే ఈ నెలలో పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు.

మే 2026:

ఈ నెలలో ఈ రాశి వారికి కాస్త ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. కుటుంబానికి కూడా దూరంగా ఉంటారు. భూమిని కొనుగోలు చేస్తారు. ధర్మ సంపాదన ఉంటుంది.

జూన్ 2026:

ఈ నెలలో ఇతరులను బాగా గౌరవిస్తారు. అధిక ధన వ్యయం ఉంటుంది. కాస్మెటిక్స్ మొదలైన వాటికి ధనం ఎక్కువగా ఖర్చు చేస్తారు. కళాత్మకంగా ఇతరులను ఆకర్షిస్తారు.

జూలై 2026:

ఈ నెలలో వృషభ రాశి వారు కుటుంబంతో ఆనందంగా ఉంటారు. రియల్ ఎస్టేట్, మోటార్, యాంత్రిక సంబంధిత వృత్తుల వారికి బాగా ఆదాయం వస్తుంది. రాజకీయ వ్యక్తులకు కూడా గుర్తింపు లభిస్తుంది. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు భారీగా ధన లాభం కలుగుతుంది.

ఆగస్టు 2026:

ఈ నెలలో అన్నదమ్ములకు అండగా ఉంటారు. ఇతరుల తప్పులను వేలెత్తి చూపకుండా క్షమాగుణంతో ఉంటారు. ధైర్యం పెరుగుతుంది. ఉన్నత విద్యలో బాగా రాణిస్తారు. సంగీతం మరియు ఇతర విద్యల్లో కూడా గుర్తింపు వస్తుంది.

సెప్టెంబర్ 2026:

ఈ నెల ప్రారంభంలో భయాలు తొలగిపోతాయి. నెల చివరికి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. భూ లాభం కలుగుతుంది. ఈ సమయంలో సౌమ్యంగా ఉంటారు.

అక్టోబర్ 2026:

తలచిన వాటిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. నూతన వస్త్ర, ధనధాన్య లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతోషంగా ఉంటారు.

నవంబర్ 2026:

ఈ నెల ప్రారంభంలో బాధ్యతగా ఉంటారు. శ్రద్ధగా అన్ని పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. పై అధికారులు శ్రమను గుర్తిస్తారు. సంగీతం, నాట్యం మరియు కళాకారులు నవంబర్ నెలలో మంచి గుర్తింపును పొందుతారు.

డిసెంబర్ 2026:

ఈ నెలలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. సంబంధాల్లో మార్పు ఉండొచ్చు. పదోన్నతి ఆలస్యం అవ్వచ్చు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. భాగస్వామ్య పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు. కొన్ని రోజులు వేచి ఉండడం మంచిది.

జనవరి 2027:

ఈ నెలలో ఈ రాశి వారు తల్లికి సంబంధించిన అనారోగ్య సమస్యలను చూడొచ్చు. మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. ఎక్కువగా అన్ని విషయాలపై శ్రద్ధ పెడితే బావుంటుంది.

ఫిబ్రవరి 2027:

పరిశోధనల రంగం వారికి బాగా కలిసి వస్తుంది. వ్యక్తిగత జీవితం ఇతరులను మోసం చేసేలా ఉండొచ్చు. చట్టపరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలలో ఈ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

మార్చి, ఏప్రిల్ 2027:

ఈ నెలలో ఊపిరితిత్తుల సమస్య, మానసిక ఒత్తిడి వంటివి చూడొచ్చు. తల్లిదండ్రుల నుంచి ఆస్తి లాభం కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం కూడా చూస్తారు. మార్చి నెలాఖరుకి విజయాలను అందుకుంటారు.

ఈ రాశి వారికి శివారాధన, హనుమాన్ చాలీసా పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అదృష్ట సంఖ్య 6. రెండు, ఆరు తేదీలు కలిసి వస్తాయి. బుధవారం, శుక్రవారం, శనివారం అనుకూలంగా ఉంటుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More