Lucky Rasis: మేష రాశితో పాటు ఈ రాశుల వారికి మార్చి నెలలో విపరీతమైన ఆర్థిక లాభం!

ఈ నెలలో కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు జరుగుతోంది. మార్చి 11న గురువు నేరుగా సంచారం చేస్తాడు. మార్చి 14న బుధుడు తిరుగమనం చెందుతాడు. మార్చి 15న సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత బుధుడు మార్చి 21న కుంభ రాశిలో నేరుగా సంచారం చేస్తాడు. మార్చి 26న కుజుడు ఉదయిస్తాడు. 

Published on: Mar 06, 2026 3:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పులు చేస్తాయి. అలాంటప్పుడు శుభ యోగాలను, అశుభ యోగాలను చూస్తూ ఉంటాము. కొన్ని సార్లు శుభ ఫలితాలు కలిగితే, కొన్నిసార్లు సమస్యలు కూడా వస్తాయి. మార్చి నెలలో కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి రాబోతోంది. ఈ నెలలో కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు జరుగుతోంది. మార్చి 11న గురువు నేరుగా సంచారం చేస్తాడు. మార్చి 14న బుధుడు తిరుగమనం చెందుతాడు.

Lucky Rasis: మేష రాశితో పాటు ఈ రాశుల వారికి మార్చి నెలలో విపరీతమైన ఆర్థిక లాభం! (pinterest)
Lucky Rasis: మేష రాశితో పాటు ఈ రాశుల వారికి మార్చి నెలలో విపరీతమైన ఆర్థిక లాభం! (pinterest)

మార్చి 15న సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత బుధుడు మార్చి 21న కుంభ రాశిలో నేరుగా సంచారం చేస్తాడు. మార్చి 26న కుజుడు ఉదయిస్తాడు. ఇలా గ్రహాల సంచారంలో మార్పు ఉండడంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. లాభాలను పొందుతారు. కొత్త ఉద్యోగాలు కూడా లభిస్తాయి. ఆనందంగా ఉంటారు. ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి.

మేష రాశితో పాటు ఈ రాశుల వారికి మార్చి నెలలో విపరీతమైన ఆర్థిక లాభం, విజయాలు

1.మేష రాశి:

మేష రాశి వారికి మార్చి నెల బాగా కలిసి రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారికి కొత్త ఉద్యోగాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. కెరీర్‌లో బాగా కలిసి వస్తుంది. గ్రహాల అనుగ్రహంతో ఈ రాశి వారు భారీగా లాభాలను పొందుతారు.

కొత్త కారు, వెండి, బంగారం వంటివి కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. ఎప్పటి నుంచో తీరని సమస్యలు ఈ సమయంలో తీరి పోతాయి. పని ప్రదేశంలో మీ పనిని చూసి అందరూ మెచ్చుకుంటారు. ఆనందంగా ఉంటారు.

2.కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి ఇది శుభ మాసం. ఈ మాసంలో ఈ రాశి వారు విపరీతమైన లాభాలను పొందుతారు. కెరీర్‌లో బాగా కలిసి వస్తుంది. భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకుంటారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. సంతోషంగా ఉంటారు. ఆర్థికపరంగా బాగుంటుంది.

3.మీన రాశి:

రాశి వారికి ఈ సమయంలో గ్రహాల ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు అన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. అదృష్టం కూడా పెరుగుతుంది. ఈ నెలలో ఈ రాశి వారు పదోన్నతి కలుగుతుంది. కొత్త ఆదాయ వనరులు నుంచి డబ్బు వస్తుంది. ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఉన్నతాధికారుల మద్దతు ఉంటుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More